బెజవాడలోని ఇంద్రకీలాద్రిపై నేటితో శాకంబరీ ఉత్సవాలు ముగియనున్నాయి.. రెండు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగిన ఉత్సవాలతో హరిత వర్ణ ఆభరణాలతో దర్శనమిచ్చారు శ్రీ కనకదుర్గమ్మ.. కూరగాయలు, ఆకు కూరలతో ఆలయం అలంకరించారు.. పండ్లు, కూరగాయలు ఆభరణాలుగా దర్శనమిస్తున్నారు దేవతామూర్తులు..
ఇవాళ ఏపీ వ్యాప్తంగా పేరెంట్ టీచర్ మీటింగ్ జరగనుంది. అన్ని ప్రభుత్వ. ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలలో నిర్వహించనున్నారు... సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేష్ సత్యసాయి జిల్లాలో కొత్తచెరువు ప్రభుత్వ పాఠశాలలో పాల్గొంటారు.. 2 కోట్ల మంది భాగస్వామ్యం తో ఈ మీటింగ్ జరగనుంది.. సుమారు 75 లక్షల మంది విద్యార్థులు..
బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు పీవీఎన్ మాధవ్... విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన ఏపీ బీజేపీ నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నా కంటే ముందు అధ్యక్షులైన వారి శక్తి యుక్తులతో ముందుకు వెళ్తాను అన్నారు.. ప్రతీ కార్యకర్త తానే అధ్యక్షుడయ్యానని అన్నంతగా పని చేస్తున్నారు.. రాష్ట్రంలో అరాచక పాలనకు చరమగీతం పలుకుతూ ఒక నిర్ణయాన్నిచ్చారని పేర్కొన్నారు.. బీజేపీ ఇచ్చిన ఈ పదవిని గౌరవంగా భావించి పని చేస్తాను అన్నారు..
వైఎస్ జగన్ మామిడి రైతాంగాన్ని పరామర్శించే చిత్తూరు జిల్లా పర్యటనకు అడ్డుకునేందుకు.. బంగారుపాళ్యం పర్యటనను వివాదం చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ కూటమి ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు మాజీ మంత్రి అంబటి రాంబాబు.. మూడు వేల మంది వైసీపీ నాయకులు, కార్యకర్తలకు నోటీసులు ఇచ్చారు. పెట్రోల్ బంకుల వద్ద పోలీసులను కాపలా పెట్టారు.
విశాఖ నగర నడిబొడ్డున గంజాయి సాగు కలకలం సృష్టించింది.. కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో జ్ఞానాపురం రాస వీధి సమీపంలోని ఓ పాడు బడ్డ ఇంటి దగ్గర ఖాళీ ప్రదేశంలో కొన్ని మొక్కలు ఏపుగా పెరిగాయి. అయితే, అవి గంజాయి మొక్కలను పోలినట్టే ఉండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు..
కృష్ణా, గోదావరి జలాల పవిత్ర సంగమం దగ్గర జలహారతి నిర్వహించారు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు.. ఈ కార్యక్రమంలో విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, జగ్గయ్య పేట ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య , తదితరులు పాల్గొన్నారు.. పట్టీసీమ ద్వారా ఈ సంవ త్సరం 13 లక్షల ఎకరాలకు సాగునీరు అందించనున్నామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు మంత్రి నిమ్మల..
మరోసారి కూటమి ప్రభుత్వంపై సోషల్మీడియా వేదికగా ఫైర్ అయ్యారు వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. చంద్రబాబు దుర్మార్గపాలన మూడు హత్యలు, ఆరు హత్యాయత్నాలు, పన్నెండు దాడుల రూపంలో సాగుతోందని దుయ్యబట్టారు.. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్రెడ్డిపై హత్యాప్రయత్నమే లక్ష్యంగా ఆయన ఇంటిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించిన జగన్.. వయోవృద్ధురాలైన ఆయన తల్లిని భయభ్రాంతులకు గురిచేస్తూ టీడీపీకి చెందిన రౌడీలు చేసిన బీభత్సం, విధ్వంసం, ప్రజాస్వామ్యంపై చేసిన ఒక భయంకరమైన దాడిగా పేర్కొన్నారు.