మరో 6 నెలల్లోనే అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు కాబుతోంది.. పెట్టుబడులతో రండి.. ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులకు ఇదే సరైన సమయం అంటూ జీసీసీ గ్లోబల్ లీడర్ల రోడ్షోలో పిలుపునిచ్చారు ఏపీ ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్.. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, క్వాంటమ్ టెక్నాలజీ వంటి అధునాతన సాంకేతిక రంగాల్లో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఆంధ్రప్రదేశ్ లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లపై పెట్టుబడులు పెట్టాల్సిందిగా కోరారు..
వైఎస్ జగన్ ప్రభుత్వ వైఖరి కారణంగా వ్యవసాయ రంగానికి, రైతులకు అనేక చిక్కుముడులు ఏర్పడ్డాయని విమర్శించారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు.. ఏపీ మంత్రి అచ్చెన్నాయుడుతో కలిసి కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో సమావేశమైన తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన.. వైఎస్ జగన్ హయాంలో వ్యవసాయ రంగం పూర్తిగా దెబ్బతింది.. రైతాంగం అన్ని రకాలుగా ఇబ్బందులు పడ్డారన్నారు.
ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై ప్రసన్నకుమార్ చేసిన వ్యాఖ్యలపై సీరియస్గా స్పందించారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఈ వ్యాఖ్యలను ప్రతి ఒక్కరూ ఖండించాలన్న ఆయన.. మహిళల వ్యక్తిత్వాన్ని అవహేళన చేస్తూ కించపరచే వ్యాఖ్యలు చేయడం వైసీపీ నాయకులకు ఒక అలవాటుగా మారిపోయిందని మండిపడ్డారు.
దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయలేనంత మంచి చేసిన నాయకుడు వైఎస్ రాజశేఖర్రెడ్డి అంటూ కొనియాడారు వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి.. వైసీపీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన వైఎస్ఆర్ జయంతి వేడుకల్లో పాల్గొన్ని నివాళులర్పించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లలా భావించి పాలన అందించారు వైఎస్ అన్నారు..
మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై జరిగిన దాడికి తనకి ఎలాంటి సంబంధం లేదని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి స్పష్టం చేశారు.. ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి.. తన క్యారెక్టర్ గురించి మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి అసభ్యకరంగా మాట్లాడారు.. ఇప్పటికి ఎన్నోసార్లు తన క్యారెక్టర్ పై తీవ్రమైన విమర్శలు చేసినా.. నేనెక్కడా సహనం కోల్పోలేదన్నారు.. తనపై వ్యక్తిగత విమర్శలు వేసిన ప్రసన్న కుమార్ రెడ్డిపై మహిళా కమిషన్ కి ఫిర్యాదు చేస్తా అన్నారు.. ప్రసన్న కుమార్…
ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ప్రసన్నకుమార్ రెడ్డి.. జిల్లా చరిత్రలో ఈ తరహా దాడులు గతంలో ఎప్పుడూ చూడలేదన్నారు.. అయితే, కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి తనను వ్యక్తిగతంగా దూషించడం వల్లే నేను కౌంటర్ ఇచ్చాను అన్నారు.. అంతేకాదు, ప్రశాంతి రెడ్డి మీద చేసిన ప్రతి విమర్శకు కట్టుబడి ఉన్నానని ప్రకటించారు..
కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తుల దాడి కలకలం సృష్టించింది. నెల్లూరు నగరంలోని సావిత్రి నగర్లోని ప్రసన్నకుమార్ రెడ్డి నివాసంలోకి చొరబడి దుండగులు.. అల్లకల్లోలం చేశారు. ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. కారు అద్దాలు పగలకొట్టి దాన్ని తలకిందులుగా పక్కకి తోసేసారు. ఇంటి రూపు రేఖలే మార్చేశారు.