మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఈ రోజు నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి విడుదల కానున్నారు.. రుస్తుం మైనింగ్ కేసుల్లో కాకాణికి బెయిల్ మంజూరు చేస్తూ సోమవారం రోజు తీర్పును వెలవరించింది ఏపీ హైకోర్టు.. అయితే, కాకాణిపై మొత్తం ఎనిమిది కేసులు నమోదు కాగా.. వివిధ కోర్టుల్లో బెయిల్ దొరికింది.. దీంతో, 85రోజులుగా జైల్లో ఉన్న కాకాణి గోవర్దన్‌రెడ్డి ఈ రోజు జైలు నుంచి విడుదల కాబోతున్నారు..
విశాఖపట్నంలో డేటా సిటీని అభివృద్ధి చేయడం వల్ల భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ హబ్ గా తయారవుతుందని చెప్పారు, దీనికి సహకారం కావాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ నుంచి వలస వెళ్లే కార్మికుల సంక్షేమం, భద్రత, గౌరవాన్ని కల్పించేందుకు ప్రవాస భారతీయ బీమా యోజన వంటి పథకాలను విస్తరించాలి, సంబంధిత ఫిర్యాదుల పరిష్కారం కోసం ఏపీలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయండి. ఆంధ్రప్రదేశ్ లో జాతీయ, అంతర్జాతీయస్థాయి స్కిల్ కాంక్లేవ్ నిర్వహణలో భాగస్వామ్యం కల్పించినందుకు కృతజ్ఞతలు.
చంద్రబాబు బానే ఉంటారు.. భవిష్యత్తులో పోలీసు అధికారులు ఇబ్బందులు పడతారని హెచ్చరిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి.. ఏపీ లిక్కర్ స్కామ్ అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ లో ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డితో ఇవాళ అనంతపురం వైసీపీ నేతలు ములాఖాత్ అయ్యారు. మాజీ ఎమ్మెల్యేలు అనంత వెంకటరామిరెడ్డి, కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, సుగాసి బాల సుబ్రమణ్యం.. మిథున్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాజకీయ కక్ష సాధింపుతో అరెస్టు చేసినా మిథున్ రెడ్డి…
తనను తాడిపత్రి వెళ్లేందుకు పోలీసులు అనుమతి ఇచ్చేంత వరకు రోడ్డుపైనే బైఠాయిస్తాను అంటున్నారు కేతిరెడ్డి పెద్దారెడ్డి.. హైకోర్టు తీర్పు చారిత్రాత్మకం.. హైకోర్టు తీర్పు వల్లే 14 నెలల తర్వాత తాడిపత్రికి వెళ్తున్నాను.. కానీ, హైకోర్టు ఆదేశాలను కూడా పోలీసులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు..
కేతిరెడ్డి పెద్దారెడ్డి దమ్ముంటే తాడిపత్రికి రా... తేల్చుకుందాం అంటూ సవాల్ విసిరారు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి.. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి ఎంట్రీపై స్పందించిన జేసీ... కేతిరెడ్డి పెద్దారెడ్డిపై నాకు ఎలాంటి కక్ష లేదు.. కానీ, కేతిరెడ్డి పెద్దారెడ్డి చేసిన దౌర్జన్యాలపై తాడిపత్రి ప్రజలకు జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు..
వాయుగుండం ఎఫెక్ట్‌తో అప్రమత్తమైన తూర్పు కోస్తా (తూ.కో.) రైల్వే శాఖ.. కేకే లైన్లో పలు రైళ్లు దారి మళ్లించింది.. మరికొన్ని రైళ్లు రద్దు చేసినట్టు ప్రకటించారు..మరోవైపు, అరకు పర్యాటక రైలు ఇవాళ, రేపు రద్దు చేసినట్టు అధికారులు ప్రకటించారు.. ఇక, దారిమళ్లిన రైళ్లను పరిశీలిస్తే.. 18515 విశాఖ - కిరండోల్ నైట్ ఎక్స్ ప్రెస్ ను దారిమళ్లించారు.. ఇప్పటికే అరకు చేరుకున్న 58501 విశాఖ - కిరండోల్ రైలును వెనక్కి రప్పిస్తున్నారు అధికారులు..