ఆంధ్రప్రదేశ్‌లో ఈ నెల 21వ తేదీ నుంచి ట్రేడ్ కార్నివాల్ నిర్వహించేందుకు సిద్ధమైంది ప్రభుత్వం.. వాణిజ్య ఉత్సవం పోస్టర్, లోగో విడుదల చేసిన మంత్రులు మేకపాటి, కన్నబాబు.. ఈ సందర్భంగా పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ ఆజాద్ కా అమృత్ మహోత్సవం కార్యక్రమంలో భాగంగా దేశ వ్యాప్తంగా ట్రేడ్ కార్నివాల్ నిర్వహిస్తోందని.. రాష్ట్రంలో ఈ నెల 21 నుంచి ట్రేడ్ కార్నివాల్ నిర్వహిస్తామని.. ఈ నెల 21, 22 తేదీల్లో రాష్ట్ర స్థాయి ఎక్స్ పో నిర్వహిస్తున్నామని తెలిపారు.. ఆ తర్వాత జిల్లా స్థాయిల్లో ఎక్స్ పో నిర్వహించనున్నట్టు వెల్లడించిన మంత్రి.. ముఖ్యమంత్రి ఈ ఎక్స్ పో ను ప్రారంభిస్తారని తెలిపారు.. ఇక, ఎగుమతుల్లో రాష్ట్ర వాటా 4 శాతంగా ఉందన్న మంత్రి.. దీనిని 10 శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు..
ఇక, ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ పెట్టాలనే ఆలోచనలో ఉన్నట్టు వెల్లడించారు వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు.. ఎక్వా ఎగుమతుల్లో 40 శాతం రాష్ట్రం నుంచే ఉన్నాయన్న ఆయన.. వాణిజ్య ఉత్సవంలో ఇతర దేశాల నుంచి కూడా ప్రతినిధులు వర్చువల్ గా పాల్గొంటారన్నారు.. గత ప్రభుత్వంలా మబ్బుల్లో తేలిపోయినట్లు కాకుండా వాస్తవ పరిస్థితితో ముందుకు వెళుతున్నామని తెలిపారు మంత్రి కన్నబాబు.