పవన్ కల్యాణ్ పర్యటనపై తీవ్ర ఉత్కంఠ.. ఇంకా అనుమతి రాలే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్రంలో రోడ్ల దుస్థితిపై కదలిన జనసేన పార్టీ.. ఎక్కడికక్కడ శ్రమదానంతో రోడ్లను కొంతమేరకు అయినా బాగుచేసే కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది.. పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.. తూర్పు గోదావరితో పాటు అనంతపురం జిల్లాలో పవన్ పర్యటన కొనసాగనుంది.. అయితే.. పవన్ తూర్పు గోదావరి జిల్లా పర్యటనపై ఉత్కంఠ కొనసాగుతోంది.. పవన్, రాజమండ్రి సభకోసం జనసేన ఏర్పాట్లు చేస్తోంది. సర్కార్‌కు పవన్‌కు మధ్య తాజాగా రగులుతున్న రాజకీయం నేపథ్యంలో సత్తా చాటాలని జనసేన నేతలు భావిస్తున్నారు. భారీ ఎత్తున జనసమీకరణతో బలాన్ని నిరూపించే ప్రయత్నాల్లో ఉన్నారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం రాజమండ్రి ధవళేశ్వరం బ్యారేజీపైన పవన్ బహిరంగ సభ జరగాల్సి ఉంది. కానీ, పోలీసుల అనుమతి నిరాకరణతో రాజమండ్రి రూరల్ బాలాజీపేట సెంటర్‌కు బహిరంగ సభను మార్చినట్టు చెబుతున్నారు. ఇదే హుక్కంపేట-బాలాజీపేట రోడ్డులో పవన్ శ్రమధానం చేస్తాని ప్రకటించారు జనసేన నేతలు. అయితే వేదికను మార్చినప్పటికీ పోలీసులు అనుమతి ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని మండిపడుతున్నారు.
మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని అధ్వాన్నంగా ఉన్న రాజమండ్రి హుక్కుంపేట – బాలాజీపేట రోడ్డులో సభ నిర్వహించి శ్రమదానం చేసేందుకు సిద్ధమయ్యారు జనసేనాని పవన్ కల్యాణ్.. అయితే, ఇప్పటి వరకూ పోలీసులు అనుమతి ఇవ్వలేదు.. బహిరంగ సభ నిర్వహించేందుకు వీల్లేదని రాజమండ్రి అడిషనల్ ఎస్పీ లతా మాధురి స్పష్టం చేశారు.. కానీ, మరోవైపు.. జనసేన పార్టీ శ్రేణులు మాత్రం ఏర్పాట్లలో మునిగిపోయారు.. బహిరంగ సభ, శ్రమదాన కార్యక్రమానికి ప్రజలు, జనసేన శ్రేణులు భారీ సంఖ్యలో తరలివస్తారని అంచనా వేస్తుండగా.. పోలీసులు ఇంకా అనుమతి ఇవ్వకపోవడంతో.. ఏం జరగబోతోంది అనేది ఉత్కంఠగా మారింది.
Also Read
- Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. కాసేపట్లో రూ.300 దర్శనం టికెట్లు విడుదల..
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- AP Municipal Elections: మున్సిపల్ ఎన్నికల సీట్లపై కూటమి కసరత్తు.. చంద్రబాబు ముందు పవన్ కల్యాణ్ కీలక ప్రతిపాదనలు..!
- AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ సమావేశం.. కీలక నిర్ణయాలపై ఉత్కంఠ
- Tags
తాజావార్తలు
-
Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. కాసేపట్లో రూ.300 దర్శనం టికెట్లు విడుదల..
-
Jailer 2 : జైలర్ 2 సెన్సార్ కంప్లిట్.. రన్ టైమ్ ఎంతంటే ?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
ట్రెండింగ్
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
-
144Hz AMOLED డిస్‌ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్‌ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!