కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతోన్న సమయంలో.. హైదరాబాద్ శివారులోని రంగారెడ్డి జిల్లా నార్సింగిలో కరోనా కలకలం సృష్టించింది.. ఒకే కాలేజీలో 25 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్‌గా తేలింది.. దీంతో.. భయభ్రాంతులకు గురయ్యారు తోటి విద్యార్థులు.. గత రెండు రోజులుగా తీవ్ర చలి, జ్వరంతో బాధపడుతున్నారు విద్యార్థులు… అప్రమత్తమైన కళాశాల యాజమాన్యం.. ఇవాళ ఉదయం విద్యార్దులకు వైద్య పరీక్షలు చేయించారు.. అందులో భాగంగా కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయగా.. 25 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఇక, అప్రమత్తమైన నార్సింగి మున్సిపల్ అధికారులు. కళాశాలలో శానిటేషన్ చేశారు.. మిగితా విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇప్పటికే పలు విద్యాసంస్థల్లో ఈ తరహాలో కరోనా కేసులు వెలుగుచూసినా.. మరోసారి ఒకే కాలేజీలో ఒకేసారి 25 మంది విద్యార్థులు కరోనా బారినపడడం కలకలం సృష్టిస్తోంది. విద్యార్థులతో పాటు తల్లిదండ్రుల్లోనూ ఆందోళన మొదలైంది.