జనవరి 6, గురువారం దినఫలాలు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మేషం : ఈ రోజు ఈ రాశివారు బ్యాంకింగ్ వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులపట్ల మెళుకువ అవసరం. ప్రింటింగ్ రంగాల వారికి అరకొర పనులే లభిస్తాయి. మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. విద్యార్థులు మొండివైఖరి అవలంబించుట వల్ల మాటపడక తప్పదు. తోటలు కొనుగోలుకై చేయుప్రయత్నాలు వాయిదాపడుట వల్ల ఆందోళన చెందుతారు.
వృషభం : ఈ రోజు ఈ రాశిలోని ఉద్యోగస్తుల దైనందిన కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. కాంట్రాక్టర్లు, బిల్డర్లకు రావలసిన ధనం చేతికందుతుంది. కంప్యూటర్, ఎలక్ట్రానికల్ రంగాల వారు క్రమేణా పుంజుకుంటారు. వాహనచోదకులు జరిమానాలు చెల్లించవలసి వస్తుంది. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్లు, ప్లీడరు గుమస్తాలకు చికాకులు అధికమవుతాయి.
Also Read
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
- Saudi-India: ‘అప్రమత్తంగా ఉండండి.. ఇంట్లోనే ఉండండి’.. సౌదీలోని భారతీయులకు కేంద్రం సూచన
- Mecca Defence Pact: మక్కా ఒప్పందానికి బీటలు! సౌదీకి తేల్చి చెప్పిన టర్కీ!
- Saudi-Houthi: మరింత దూకుడు పెంచిన హౌతీలు.. రియాద్ ఎయిర్పోర్టుపై దాడి!
మిధునం : ఈ రోజు ఈ రాశిలోని చిన్నారులు, ఆత్మీయులకు విలువైన కానకలందిస్తారు. ఖర్చులు అధికమవుతాయి. నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాలు ఏమంత సంతృప్తినీయవు. చిట్స్, ఫైనాన్సు వ్యాపారులకు ఖాతాదారులతో సమస్యలు తలెత్తుతాయి. సొంత వ్యాపారాలు, దీర్ఘకాలిక పెట్టుబడులు ప్రస్తుతానికి వాయిదా వేయటం శ్రేయస్కరం.
కర్కాటకం : ఈ రోజు ఈ రాశివారికి సంఘంలో మంచి పేరు, ఖ్యాతి లభిస్తుంది. విద్యార్థినులకు ప్రతి విషయంలోను ఏకాగ్రత, కొత్త విషయాల పట్ల ఆసక్తి ఏర్పడతాయి. స్త్రీలకు బంధువర్గాల నుంచి ఒత్తిడి, మొహమ్మాటాలను ఎదుర్కుంటారు. గృహ మార్పుతో ఇబ్బందులు తొలగి మానసికంగా కుదుటపడతారు. వేడుకలు, దైవకార్యాల్లో ప్రముఖంగా వ్యవహరిస్తారు.
సింహం : ఈ రోజు ఈ రాశివారు వాదోపవాదాలకు, హామీలకు దూరంగా ఉండటం మంచిది. ఒక మంచి పని చేశామన్న సంతృప్తి మీలో నెలకొంటుంది. పండ్లు, పూలు, కొబ్బరి, చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. శ్రీవారు, శ్రీమతి వైఖరి ఉల్లాసం కలిగిస్తుంది. అధికారులతో సంభాషించేటపుడు మెలకువ వహించండి.
కన్య : ఈ రోజు ఈ రాశివారికి ప్రభుత్వ సంస్థల్లో వారు కొంత జాప్యం, ఒత్తిడి ఎదుర్కొనక తప్పదు. ఎవరికైనా ధన సహాయం చేసినా తిరిగిరాజాలదు. కుటుంబ వ్యక్తులతో స్వల్ప విరోధముల రావచ్చు. జాగ్రత్త వహించండి. ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికమవుతుంది. దైవ సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు.
తుల : ఈ రోజు ఈ రాశివారు వేతనం తక్కువైనా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిది. గతంలో ఒకరికిచ్చిన హామీ వల్ల వర్తమానంలో ఇబ్బందు లెదుర్కుంటారు. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. స్త్రీలు విశ్రాంతికై చేయు యత్నాలు అంతగా ఫలించకపోవచ్చును. రావలసిన ధనంలో కొంత మొత్తం అందుకుంటారు.
వృశ్చికం : ఈ రోజు ఈ రాశిలోని హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. మీ శ్రీమతి సలహా పాటించటం చిన్నతనంగా భావించకండి. ఒకానొక వ్యవహారంలో మీ ప్రమేయం మంచి ఫలితాలనిస్తుంది. మిత్రులతో సంభాషించేటపుడు సంయమనం పాటించండి. దైవకార్యక్రమాల పట్ల ఏకాగ్రత వహిస్తారు.
ధనస్సు : ఈ రోజు ఈ రాశిలోని కొబ్బరి, పండ్ల, పూల, చిరు వ్యాపారులకు కలిసిరాగలదు. ఆహార వ్యవహారాల్లో మొహమాటలకు తావివ్వకండి. మీ ఉన్నతిని చూసి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. బంధువుల రాకపోకలు పునరావృతమవుతాయి. కుటుంబ వ్యక్తులతో స్వల్ప విరోధముల రావచ్చు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు.
మకరం : ఈ రోజు ఈ రాశివారు ఆర్థిక లావాదేవీలు, వ్యవహార ఒప్పందాల్లో మెలకువ వహించండి. బంధువుల రాకతో కుటుంబములో సందడి నెలకొంటుంది. దూర ప్రయాణాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఉపాధ్యాయులకు విద్యార్థుల వల్ల సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది జాగ్రత్త వహించండి. వీలైనంత వరకు బయటి ఆహారాన్ని భుజించకండి.
కుంభం : ఈ రోజు ఈ రాశిలోని పత్రికా రంగంలోని వారికి ఆందోళన తప్పదు. మీ యత్నాలకు సన్నిహితుల ప్రోత్సాహం లభిస్తుంది. శ్రమించిన కొలదీ ఫలితం అన్నట్లుగా ఉంటుంది. వృత్తి వ్యాపారులకు సంతృప్తి, పురోభివృద్ధి, స్త్రీలకు షాపింగ్ లోను, చెల్లింపులలోను అప్రమత్తత అవసరం. బంధు మిత్రులతో పరస్పర కానుక లిచ్చిపుచ్చుకుంటారు.
మీనం : ఈ రోజు ఈ రాశివారిని ఆర్థిక, లావాదేవీలు, ఉమ్మడి వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. మొహమాటం, మెతకదనం వీడి నిక్కచ్చిగా వ్యవహరిస్తేనే అనుకున్నది సాధ్యమవుతుంది. తల పెట్టిన పనుల్లో ఒత్తిడి, చికాకులు తప్పవు. క్రయ విక్రయాలు ఊపందుకుంటాయి.
తాజావార్తలు
-
Dussehra Holidays 2026: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే దసరా సెలవులు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
-
AP Local Body Elections: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు.. సుప్రీంకోర్టు కీలక సూచనలు
-
Easy Egg Peeling Tips: ఉడికించిన గుడ్లను సులభంగా ఒలిచే సింపుల్ పద్ధతి.. ఈ చిన్న పొరపాట్లు చేయకండి!
-
Pinarayi Vijayan CMRL Case: మాజీ సీఎం పినరయి విజయన్కు హైకోర్టులో షాక్.. CMRL కేసులో FIRకు ఆదేశం!
-
Cancer Medicines Price Update: క్యాన్సర్ మందుల ధరలపై కేంద్రం కీలక నిర్ణయం.. 70 శాతం వరకు తగ్గింపు?
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!