జనవరి 16, ఆదివారం దినఫలాలు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మేషం : ఈ రోజు ఈ రాశివారి వ్యాపారాలు మరింతగా పుంజుకుంటాయి. ఉపాధ్యాయులకు విశ్రాంతి లభిస్తుంది. కొత్త కార్యక్రమాలు చేపడుతారు. లిటిగేషన్ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. విద్యార్థులకు దూకుడు తగదు. మీ సమర్థతపై ఎదుటివారికి నమ్మకం కలుగుతుంది. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు.
వృషభం : ఈ రోజు ఈ రాశివారికి బంధువుల రాకవల్ల గృహంలో కొత్త ఉత్సాహం, సందడి చోటుచేసుకుంటుంది. సొంతంగా గాని, భాగస్వామ్యంగాగాని మీరు ఆశించిన విధంగా రాణించలేరు. బంధువులతో సంబంధాలు బలపడతాయి. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూలులో చికాకులు తప్పవు. ఆప్తుల రాకతో గృహం సందడిగా ఉంటుంది.
Also Read
- Tuesday Horoscope: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభాలే!
- Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభాలే, ఊహించని..!
- Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
- Saturday Horoscope: శనివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!
మిధునం : ఈ రోజు ఈ రాశివారు మిత్రులతో కలిసి విందు, వినోదాలలో పాల్గొంటారు. కుటుంబీకుల అవసరాలు, కోరికలు నెరవేర్చగల్గుతారు. రుణం తీసుకోవటం, ఇవ్వటం క్షేమం కాదని గమనించండి. మీ శ్రీమతి ప్రోత్సాహంతో కొన్ని పనులు సాధిస్తారు. సహోద్యోగులతో వాగ్వాదాలు తగదు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూ సమాచారం అందుతుంది.
కర్కాటకం : ఈ రోజు ఈ రాశివారు ఆలస్యమైనా పనులు అనుకున్న విధంగా పూర్తి కాగలవు. మీ శ్రీమతి సూటిపోటి మాటలు అసహనం కలిగిస్తాయి. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. వాయిదా పడిన మొక్కుబడులు ఎట్టకేలకు తీర్చుకుంటారు. మీ అభిరుచికి తగ్గ వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి.
సింహం : ఈ రోజు ఈ రాశివారి వ్యాపారంలో గందరగోళ పరిస్థితులు నెలకొంటాయి. పారిశ్రామిక వర్గాలకు ఒత్తిడులు తొలగిపోతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. దూర ప్రయాణాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. పట్టుదలతో శ్రమించిన గాని పనులు పూర్తి కావు. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు.
కన్య : ఈరోజు ఈ రాశివారికి సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తుల సహకారం లభిస్తుంది. ముందస్తు జాగ్రత్తతో తీసుకున్న నిర్ణయాలు మంచి ఫలితాలిస్తాయి. దైవ, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాల్లో నిలదొక్కుకోవటానికి మరింతగా శ్రమించాలి. ఉద్యోగస్తులు విశ్రాంతి పొందుతారు. స్త్రీలకు ఇరుగు, పొరుగు వారితో సఖ్యత అంతగా ఉండదు.
తుల : ఈ రోజు ఈ రాశివారు కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. ప్రేమ వ్యవహారాలలో పెద్దల నుండి అభ్యంతరాలను ఎదుర్కొంటారు. వాహనం నడుపునపుడు మెళుకువ అవసరం. మార్కెట్ రంగాల వారికి ఆందోళన వంటివి తలెత్తుతాయి. బంధు మిత్రుల కోసం ధనం బాగా వ్యయం చేస్తారు. స్త్రీల అతి అలంకరణ విమర్శలకు దారి తీస్తుంది.
వృశ్చికం : ఈ రోజు ఈ రాశివారు వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు మంచి ఫలితాలనిస్తాయి. పత్రికా సంస్థలలోని వారికిఒక సమాచారం అందోళన కలిగిస్తుంది. భాగస్వామిక సంస్థల్లో మీ పెట్టుబడులు ఉపసంహరించుకుంటారు. ఇతరుల తప్పిదాలకు సైతం మీరే బాధ్యత వహించవలసి వస్తుంది. చీటికి మాటికి ధనం విపరీతంగా వ్యయం చేస్తారు.
ధనస్సు : ఈ రోజు ఈ రాశిలోని స్త్రీల అభిప్రాయాలకు మంచి స్పందన లభిస్తుంది. రాజకీయనాయకులు తరుచు సభలు, వేడుకల్లో పాల్గొంటారు. ఖర్చులు ఊహించినవే కావటంతో ఇబ్బందులుండవు ప్రేమికుల వ్యవహారం వివాదాస్పద మవుతుంది. విదేశాల నుంచి ఆప్తుల రాక సంతోషం కలిగిస్తుంది. ఆశాదృక్పథంలో కొత్తయత్నాలు సాగిస్తారు.
మకరం : ఈ రోజు ఈ రాశివారు ఏదైనా అమ్మాలనే ఆలోచన క్రియారూపంలో పెట్టండి. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో మెళుకువ, ఏకాగ్రత చాలా అవసరం. కుటుంబీకుల మధ్య దూరపు బంధువుల ప్రస్తావన వస్తుంది. శారీరకశ్రమ, విశ్రాంతి లోపం వల్ల స్వల్ప అస్వస్థతకు గురవుతారు. సభ్యత్వాలు, పదవులనుంచి తప్పుకోవలసి వస్తుంది..
కుంభం : ఈ రోజు ఈ రాశివారు స్కీంలు, వాయిదాల పద్ధతిలో విలువైన వస్తువులు అమర్చుకుంటారు. విద్యార్థులకు క్రీడలు, ఇతర వ్యాపకాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు మీ ఉన్నతికి దోహదపడతాయి. విద్యారులు ధ్యేయం పట్ల మరింత శ్రద్ధవహిస్తారు. మీ అలవాట్లు, బలహీనతలు అదుపులో ఉంచుకోండి.
మీనం : ఈ రోజు ఈ రాశివారు చేపట్టిన పనులలో ఓర్పు, పట్టుదల అవసరం. స్త్రీలకు పరిచయాలు వ్యాపకాలు అధికమవుతాయి. అనవసర విషయాలలో తలదూర్చి సమస్యలు తెచ్చుకోకండి. మీ ఉత్సాహాని అదుపులో ఉంచుకోవటం శ్రేయస్కరం. వాతావరణంలోని మార్పు మీకు ఎంతో ఆందోళన కలిగిస్తుంది. పాత సమస్యలు పరిష్కార మార్గంలో నడుస్తాయి.
తాజావార్తలు
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
JoJo Glimpse : రాయలసీమ వర్షాలొస్తే వజ్రాలు దొరుకుతాయా?.. రచ్చ రేపుతున్న రస్టిక్ లవ్ స్టోరీ!
-
Australia: నడిరోడ్డుపై పాకిస్తాన్ యువతి నమాజ్.. కార్‌తో ఢీకొట్టిన డ్రైవర్‌కు ఊరట..
-
Jim Jim Tara: జిమ్ జిమ్ తార ఫుల్ సాంగ్ రిలీజ్ చేసిన పర్ణశాల టీం
-
Aafiya Sayed: రుక్మిణి ఎవరో తెలిసింది.. నితిన్ లవర్‌గా సరికొత్త హీరోయిన్
ట్రెండింగ్
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!