ఎన్నికల సమయంలో రాజకీయ వలసలు సర్వ సాధారణం.. ఇప్పుడు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగుతోన్న సమయంలో.. యూపీలో కాంగ్రెస్ పార్టీకి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి.. తాజాగా కేంద్ర మాజీ మంత్రి, రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడిగా పేరున్న ఆర్‌పీఎన్ సింగ్.. కాంగ్రెస్ పా్టీకి గుడ్‌బై చెప్పి.. బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.. ఇక, ఈ పరిణామాలపై రాజస్థాన్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అశోక్ గెహ్లాట్‌కు ఓ ప్రశ్న ఎదురైంది.. ? పెద్ద స్థాయి నుంచి చిన్న స్థాయి వరకు నేతలు పార్టీని వెళ్లిన నేతలు తిరిగి పార్టీలోకి రావడం కాంగ్రెస్ పార్టీకి సర్వసాధారణమంటూ ఆయన సమాధానం ఇచ్చారు.. ఆర్‌పీఎన్ సింగ్.. బీజేపీలో చేరడంపై స్పందించిన గెహ్లాట్.. కాంగ్రెస్ పార్టీ మహా సముద్రం లాంటిదని, ఇందులో ఎంతో మంది సీనియర్ లీడర్లు తయారు అవుతారని, అయితే అందరూ శాశ్వతంగా ఇక్కడే ఉండడం సాధ్యం కాదని, బయటికి వెళ్లడం మళ్లీ వెనక్కి రావడం సహజంగానే జరుగుతుందని అభిప్రాయపడ్డారు.
Read Also: ఏపీలో కొనసాగుతోన్న కోవిడ్ విజృంభణ..