కరోనా మహమ్మారి ఇప్పటికీ ప్రపంచదేశాలను వణికిస్తూనే ఉంది.. 2019లో చైనాలో వెలుగుచూసిన కోవిడ్.. అతలాకుతలం చేస్తూనే ఉంది.. ఇక, ఇప్పటికే అనే అధ్యయనాలు, పరిశోధనలు జరిగాయి.. మరికొన్ని జరుగుతూనే ఉన్నాయి.. అయితే, కొన్ని స్టడీలు మాత్రం మహమ్మారికి సంబంధించిన అనేక సంచలన విషయాలు బటయపెడుతున్నాయి.. ఇప్పటి వరకు ఉన్న అంచనాలు, లెక్కలకంటే ఎక్కువ కాలం మనుషుల శరీరంలో వైరస్ యాక్టివ్‌గా ఉంటుందని తాజాగా ఓ పరిశోధన బయపెట్టింది.. కోవడ్ పాజిటివ్‌గా తేలిన 14 రోజుల తర్వాత కూడా చాలా మంది యాక్టివ్ వైరస్‌ను వెదజల్లే అవకాశముందని తేల్చిన ఆ పరిశోధన.. కొందరిలో అయితే ఏకంగా 7 నెలలకు పైగానే యాక్టివ్‌గా ఉండొచ్చని షాకింగ్ విషయాలను బయటపెట్టింది.
ఫ్రాన్స్‌కు చెందిన పాస్చర్ ఇన్‌స్టిట్యూట్, ది యూనివర్సిటీ ఆఫ్ సావ్‌పౌలో (యూఎస్‌పీ), బ్రెజిల్‌లోని ఆస్వాల్డో క్రజ్ ఫౌండేషన్, ఇతర అంతర్జాతయ శాస్త్రవేత్తల బృందంతో కలసి ఓ పరిశోధన నిర్వహించారు.. ఆ పరిశోధనకు సంబంధించిన వివరాలు ప్రాంటియర్స్ ఇన్ మెడిసిన్స్ జర్నల్‌లో ప్రచురించారు.. ఇక, పరిశోధన విషయానికి వస్తే.. బ్రెజిల్‌లోని కొందరు కరోనా పేషెంట్లకు వరుస టెస్ట్‌లు చేశారు. నెగెటివ్ వచ్చే దాకా రెండు, మూడుసార్లు ఆర్‌టీపీసీఆర్ టెస్టులు చేస్తూ పోయారు.. వీరిలో ఇద్దరు పురుషులు, ఓ మహిళలో 70 రోజులకు మించి వైరస్‌ను గుర్తించినట్టు ఆ స్టడీ చెబుతోంది.. అంటే దీనిని బట్టి వైరస్ సోకిన వారిలో 8 శాతం మంది 2 నెలల కంటే ఎక్కువ కాలం పాటు ఇతరులకు కరోనాను వ్యాప్తి చేసే అవకాశాలున్నాయని గుర్తించింది.. అయితే, ఇన్ఫెక్షన్ సోకిన తర్వాత చివరి దశలో ఎలాంటి లక్షణాలు కనిపించకపోవచ్చని చెబుతున్నారు.
ఇక, 38 ఏళ్లున్న ఓ వ్యక్తిలో 20 రోజులు స్వల్ప లక్షణాలే కనిపించినా.. అతని శరీరంలో మాత్రం 232 రోజుల పాటు వైరస్ కొనసాగినట్టు, మ్యుటెషన్లు జరిగినట్టు ఈ పరిశోధన గుర్తించింది.. ఈ సమయంలో చికిత్స కొనసాగించకుండా కోవిడ్ నిబంధనలు పాటించకుడా ఉంటే.. ఆ 7 నెలల్లో ఎంతో మందికి వైరస్ వ్యాప్తి చెందించి ఉండేవాడని కూడా చెబుతోంది.. మరోవైపు.. కోవిడ్ సోకిన 14 రోజుల తర్వాత కూడా ప్రజల్లో యాక్టివ్ వైరస్ ఉంటుందని.. ఇది ఇతరులకు వ్యాప్తి చెందించే అవకాశాలు మెండుగా ఉన్నాయని తేల్చింది.. కావున, కరోనా సోకిన వారు ఎక్కడెక్కడ ఉన్నారు, వారి ఆరోగ్య పరిస్థితి ఏంటో ఎప్పటికప్పుడు తెలుసుకోవడం ద్వారా మరిన్ని మ్యుటేషన్లు, కొత్త వేరియెంట్లు వచ్చే అవకాశాలపై కన్నేసి ఉంచొచ్చని ఆ అధ్యయనం చెబుతోంది.