సమ్మె తప్పదంటూ.. వెనక్కి తగ్గేదే లేదంటూ ముందుకు సాగుతోన్న ఉద్యోగ సంఘాలను బుజ్జగించే పనిలో పడిపోయింది ప్రభుత్వం.. రేపు ఉద్యోగ సంఘాలను మరోసారి చర్చలకు ఆహ్వానించింది ప్రభుత్వం.. అయితే, లిఖిత పూర్వకంగా ఆహ్వానిస్తేనే వస్తామని స్టీరింగ్ కమిటీ తేల్చేసింది.. దీంతో.. లిఖిత పూర్వక ఆహ్వానాన్ని పంపింది ప్రభుత్వం.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు సచివాలయంలో సమావేశానికి రావాలని కోరింది.. ఇక, ఆహ్వానం అందిందని స్టీరింగ్ కమిటీ కూడా ధృవీకరించింది. మరోవైపు.. ఉద్యోగులు సమ్మె వరకూ వెళ్లకుండా చూడాలని జిల్లా కలెక్టర్లు, హెచ్‌వోడీలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ఆదేశాలు జారీ చేశారు.. చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారమవుతాయని ఉద్యోగులకు తెలియజేయాలని కలెక్టర్లకు సూచించారు సీఎస్.. మరి.. రేపటి చర్చలు ఎలా జరుగుతాయి.. ఉద్యోగుల డిమాండ్లకు ప్రభుత్వం ఓకే చెబుతుందా.. ? మళ్లీ కొత్త సమస్యలు ఏమైనా వస్తాయా? సమ్మెకు పులిస్టాప్ పడబోతోందా? వంటి పరిణామాలు ఇప్పుడు ఉత్కంఠరేపుతున్నాయి.