మేషం : ఈ రోజు ఈ రాశిలోని ఉద్యోగ వ్యాపారాల్లో కొంత పురోగతి సాధిస్తారు. గృహంలో మార్పులు చేర్పులు చేస్తారు. మీ మాటకు ఇంటా బయటా ఆదరణ పెరుగుతుంది. ఆప్తుల కలయికతో మానసికంగా కుదుటపడతారు. నిరుద్యోగులు భేషజాలకు పోకుండా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటం ఉత్తమం. వృషభం : ఈ రోజు ఈ రాశిలోని ఉపాధ్యాయులకు గుర్తింపు లభిస్తుంది. బ్యాంకు వ్యవహారాలలో పరిచయంలేని వ్యక్తులతో మితంగా సంభాషించండి. లీజు, ఏజెన్సీలు, నూతన టెండర్ల విషయంలో బాగా ఆలోచించి […]
సింగరేణి గనుల్లో మరో ప్రమాదం జరిగింది.. మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలం శ్రీరాంపూర్ డివిజన్ ఎస్సార్పీ 3 గనిలో ఇవాళ ఉదయం గని పైకప్పు కూలిన ఘటనలో నలుగురు కార్మికులు ప్రాణాలు విడిచారు.. ఈ ప్రమాదంలో గనిలోని 21 డిప్ 24 లెవల్, 3ఎస్పీ 2 సీం వద్ద గని పైకప్పు రక్షణ చర్యలు చేపడుతున్న టింబర్‌మెన్ బేర లచ్చయ్య, సపోర్ట్‌మెన్ వీ క్రిష్ణారెడ్డి, బదిలీ వర్కర్లు గడ్డం సత్యనర్సింహారాజు, రెంక చంద్రశేఖర్ మృతిచెందారు.. పై కప్పు […]
ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి ఐటీ అధికారుల దాడులు కలకలం రేపుతున్నాయి.. విశాఖపట్నంలో రియల్ ఎస్టేట్ సంస్థలే టార్గెట్‌గా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి.. భువనేశ్వర్ సహా పలు ప్రాంతాల నుంచి ఐటీ అధికారుల టీమ్ విశాఖకు వచ్చినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా నగరంలోని మూడు రియల్ ఎస్టేట్ కంపెనీల్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి.. ఇదే సమయంలో ప్రముఖ బిల్డర్ల ఇళ్లు, కార్యాలయాల్లో ఏకకాలంలో తనిఖీలు చేస్తున్నారు ఐటీ అధికారులు. కాగా, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానులపై నిర్ణయం తీసుకుంది […]
తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి హరీష్‌రావుకు.. వైద్య, ఆరోగ్య శాఖ బాధ్యతలను కూడా అప్పగించారు సీఎం కేసీఆర్.. ఇక, ఇవాళ ఆరోగ్యశాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తన్నీరు హరీష్ రావును వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు మర్యాద పూర్వకంగా కలిశారు.. వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి ఎస్.ఏ.ఎం.రిజ్వి, కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ వాకాటి కరుణ, ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ డా. శ్రీనివాస రావు, వైద్య విద్యా శాఖ డైరెకర్ డా. రమేష్ రెడ్డి, ఓ.ఎస్.డి. గంగాధర్, […]
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు ఓ రోజు పైకి.. మరో రోజు కిందికి కదులుతూనే ఉన్నాయి.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 38,242 శాంపిల్స్ పరీక్షించగా.. 164 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది.. మరో వ్యక్తి కోవిడ్‌తో చనిపోగా.. 171 మంది బాధితులు పూర్తిస్థాయిలో కోవిడ్ నుంచి కోలుకున్నారు. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,72,987కు చేరగా.. రికవరీ కేసులు 6,65,272కు పెరిగాయి.. ఇక, […]
ఎన్నికల సమయంలో రాజకీయ వలసలు సర్వ సాధారణమైన విషయమే.. ఇప్పుడు పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో.. ఆమ్ ఆద్మీ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది.. ఢిల్లీలో రెండోసారి పీఠం ఎక్కిన ఆ పార్టీ.. ఈ సారి పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలపై ప్రత్యేకంగా దృష్టి సారించింది.. అయితే, ఆప్ మాజీ ఎమ్మెల్యే రూపిందర్ కౌర్ రుబీ.. ఇవాళ ఆ పార్టీకి గుడ్‌బై చెప్పేశారు.. గతంలో బటిండా రూరల్ ఎమ్మెల్యేగా ఉన్న ఆమె.. ఆమ్ ఆద్మీ పార్టీకి రాజీనామా చేశారు. […]
ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది.. ఇక, అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ప్రారంభించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. ఇవాళ ఎమ్మెల్యే కోటా కింద ఎన్నికలు జరగనున్న మూడు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.. ఆంధ్రప్రదేశ్‌లోని 14 ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి.. ఎమ్మెల్యే కోటా కింద మూడు ఎమ్మెల్సీ స్థానాలకు, స్థానిక సంస్థల నియోజకవర్గాల నుంచి 11 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.. అయితే, స్థానిక సంస్థలకు సంబంధించిన ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాను రెండు రోజుల్లో ప్రకటిస్తామని […]
కరోనా మహమ్మారి బారినపడి మృతిచెందినవారి కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం.. కోవిడ్ సోకి మరణించిన వారి కుటుంబాలకు రూ. 50 వేలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వనున్నట్లు తెలిపింది.. రాష్ట్ర విపత్తుల నిర్వహణ నిధుల నుంచి ఈ పరిహారం అందజేయనుండగా.. ఈ మేరకు మార్గదర్శకాలను జారీ చేసింది తెలంగాణ సర్కార్.. ఇక, కోవిడ్ డెత్ సర్టిఫికెట్ జారీ చేసేందుకు అధికారులతో ఓ కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొంది ప్రభుత్వం.. మృతుల కుటుంబ సభ్యుల ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది.. […]
ఆంధ్రప్రదేశ్‌లోని 14 ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి.. ఎమ్మెల్యే కోటా కింద మూడు ఎమ్మెల్సీ స్థానాలకు, స్థానిక సంస్థల నియోజకవర్గాల నుంచి 11 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే షెడ్యూల్ కూడా జారీ చేశారు.. నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది.. స్థానిక సంస్థల నియోజకవర్గాల ఎమ్మెల్సీ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. ఈ నెల 16న నోటిఫికేషన్ జారీచేసి అదేరోజు నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. ఇక, ఈ ఎన్నికలకు సిద్ధమైపోతోంది అధికార […]
మద్యం షాపుల కేటాయింపుల్లోనూ రిజర్వేషన్లు కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం.. గౌడ్, ఎస్సీ, ఎస్టీలకు షాపుల కేటాయింపుల్లో రిజర్వేషన్లు కల్పించింది.. అయితే, మద్యం దుకాణాల కేటాయింపులో రిజర్వేషన్లపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.. ఖమ్మం జిల్లాకు చెందిన రవికాంత్ ఈ రిజర్వేషన్లను సవాల్ చేస్తూ పిటిషన్ వేయగా.. హైకోర్టు అత్యవసర విచారణకు స్వీకరించింది.. కులాల ప్రాతిపదికన రిజర్వేషన్లు ఉండొద్దని సుప్రీంకోర్టు తీర్పు ఉందన్న తన పిటిషన్లో పేర్కొన్నారు పిటిషనర్.. అయితే, ఈ కేసుపై విచారణ చేపట్టిన తెలంగాణ […]