Punjab: దిగ్గజాలను ఊడ్చేసిన ‘చీపురు’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీకి పరిమితం అనుకున్న ఆమ్‌ఆద్మీ పార్టీ.. ఇతర రాష్ట్రాలపై కూడా ఫోకస్ పెట్టింది.. అందులో భాగంగా పంజాబ్‌పై ప్రధానంగా కేంద్రీకరించారు ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.. అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని విజయాన్ని అందుకున్నారు.. ఆప్ ప్రభంజనంలో సీఎం, మాజీ సీఎంలు, రాజకీయ దిగ్గజాలు సైతం ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.. రాజకీయాల్లో పాతుకుపోయిన నేతలు సైతం ఇంటి బాట పట్టారంటే.. ఆప్ ప్రభంజనం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు..
Read Also: Mayor: థియేటర్లకు మేయర్ లేఖ.. కొత్త సినిమా వస్తే ప్రతీ షోకు వంద టికెట్లు ఇవ్వండి..
Also Read
ఇక, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో పంజాబ్ ముఖ్యమంత్రి చన్నీ, డిప్యూటీ సీఎం ఓపీ సోనీ, పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ, శిరోమణి అకాలీదళ్ చీఫ్ సుఖ్బీర్ బాదల్, ఏకంగా ఐదుసార్లు సీఎంగా సేవలు అందించిన ప్రకాష్ సింగ్ బాదల్, మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ సైతం ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.. సీఎం చరణ్‌జిత్ సింగ్ చెన్నీ రెండు స్థానాల నుంచి బరిలోకి దిగారు.. అయితే, భదౌడా, చమకౌర్ సాహిబ్ రెండు స్థానాల్లో ఓటమి తప్పలేదు.. ఇక, అమృత్ సర్ ఈస్ట్ నుంచి పోటీ చేసిన పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ పరాజయం పాలయ్యారు.. అజయ్ గుప్తా అనే ఆప్ అభ్యర్థి సిద్ధూను ఓడించారు. మరోవైపు.. పంజాబ్ డిప్యూటీ సీఎంగా ఉన్న ఓపీ సోనీ.. అమృత్ సర్ సెంట్రల్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. మరోవైపు పంజాబ్ సీఎంగా పనిచేసిన అమరీందర్ సింగ్.. పాటియాలా నుంచి బరిలోకి దిగారు. ఆప్ అభ్యర్థి అజీత్ సింగ్ కోహ్లీ చేతిలో ఓడిపోయారు. శిరోమణీ అకాలీదళ్ అధ్యక్షుడిగా ఉన్న సుఖ్‌బీర్ సింగ్ బాదల్.. జలాలాబాద్ నుంచి పోటీ చేసి ఆప్ అభ్యర్థి జగదీప్ కంబోజీ చేతిలో పరాజయం పాలయ్యారు.. ఇక, మాజీ సీఎం శిరోమణి అకాలీదళ్ అగ్రనేత అయిన ప్రకాష్ సింగ్ బాదల్.. లంబీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగి ఆప్ అభ్యర్థి గుర్మీత్ సింగ్ ఖుదియాన్ చేతిలో ఓడిపోయారు.. ఇలా ఎంతోమంది ప్రముఖులను మట్టి కరిపించారు ఆప్ అభ్యర్థులు.
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?