శ్రీకాకుళం జిల్లాలో సంభవించిన రైలు ప్రమాదంలో ఐదుగురు మృతిచెందారు.. జి. సిగడాం మండలం బాతువ – చీపురుపల్లి రైల్వే స్టేషన్ మధ్య ఈ దుర్ఘటన జరిగింది.. గౌహతి వైపు వెళుతున్న ఎక్స్‌ప్రెస్ రైలు సాంకేతిక లోపం వల్ల అక్కడ నిలిచిపోయింది. కొందరు ప్రయాణికులు రైలు దిగి ప్రక్కన పట్టాలపై నిలబడి ఉండగా కోణార్క్ ఎక్స్‌ప్రెస్ వారిపై నుంచి దూసుకెళ్లింది.. దీంతో.. రైలు పట్టాలపై నిలిచినున్నవారు మృతిచెందారు.. పలువరు గాయాలపాలయ్యారు.. ఘటనా స్థలంలో చెల్లా చెదురుగా మృతదేహాలు పడిపోయాయి.. రైలు ఢీ కొట్టడంతో ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. మృతులలో ముగ్గురు వ్యక్తులు అస్సాం రాష్ర్టానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు.
Read Also: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
అయితే, జి.సిగడాం మండలం భాతువ వద్ద సాంకేతిక కారణంతో గౌహతి ఎక్స్ ప్రెస్ కొద్ది సేపు నిలిచిపోయింది.. దీంతో.. కొందరు ప్రయాణికులు ట్రైన్ దిగి పక్క ట్రాక్‌పై రావడంతో అనుకొని ప్రమాదం చోటు చేసుకుంది.. కోణార్క్ ఎక్స్‌ప్రెస్ రూపంలో మృత్యు శకటం వీరిపై దూసుకెళ్లింది.. ఈ ఘటనలో మృతి చెందిన ఐదుగురిలో ముగ్గురు అస్సాంకు చెందిన పసుమంత్రి వజులు, బనిషర్ బసుమంత్రి , రసిదుల్ ఇస్లాంగా గుర్తించారు. ట్రైన్ ప్రమాదంలో గాయాలపాలైన వ్యక్తి జిట్టునాయక్ ఒడిశా రాష్ర్టం బరంపురంగా తెలుస్తుంది. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం విజయనగరం ఎంఆర్ ఆసుపత్రికి తరలించారు.. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. వివిధ కోణాల్లో ధర్మాప్తు చేస్తున్నారు. రైలులో పొగలు రావడంతో చైన్ లాగి దిగటానికి ప్రయత్నించారా? లేదా సాంకేతిక కారణాలతోనే గౌహతి ఎక్స్‌ప్రెస్ నిలిచిపోయిందా? అనే కోణంలో దర్యాప్తు సాగుతోంది..
మరోవైపు.. శ్రీకాకుళం జిల్లాలో రైలు ఢీకొని పలువురు మరణించిన ఘటనపై సీఎం వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.. క్షతగాత్రులకు మంచి వైద్యసేవలు అందేలా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.. ఘటనకు సంబంధించిన ప్రాథమిక వివరాలను సీఎంకు వివరించారు అధికారులు.. విశాఖపట్నం నుంచి గౌహతి వెళ్తున్న రైలు సాంకేతిక లోపంతో నిలిచిపోయిందని.. చల్లగాలికోసం కొంతమంది ప్రయాణికులు కిందకు దిగారని, మరో ట్రాక్‌పై వెళ్తున్న కోణార్క్ ఎక్స్‌ప్రెస్ వీరిని ఢీ కొట్టడంతో కొంత మంది మరణించినట్టుగా సీఎంకు వివరించారు.. మరణించిన వారి కుటుంబాలకు అన్నిరకాలుగా సహాయ సహకారాలు అందించాలని స్పష్టం చేశారు సీఎం వైఎస్ జగన్.