భారత రాజ్యాంగం విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలలపై ప్రతిపక్షాలు ఓ రేంజ్లో ఫైర్ అవుతున్నాయి.. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి.. అయితే, ఈ వ్యవహారంలో సీఎంపై అన్ని పీఎస్లపై ఫిర్యాదు చేసేందుకు సిద్ధం అవుతోంది కాంగ్రెస్ పార్టీ.. రేపు అన్ని పోలీస్ స్టేషన్లలో సీఎం కేసీఆర్పై ఫిర్యాదు చేయనున్నట్టు వెల్లడించారు టి.పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి.. కేసీఆర్ మాటల వెనక కుట్ర ఉందన్న ఆయన.. నరేంద్ర మోడీ ఆదర్శ నాయకుడు పుతిన్ అయితే.. కేసీఆర్ […]
పీఆర్సీ ఉద్యమం ఉధృతమైంది.. సమ్మెకు సిద్ధం అవుతున్నారు ఉద్యోగులు.. ఇప్పటికే పెన్ డౌన్ అంటూ.. ఆందోళనను ఉధృతం చేశారు.. అయితే, ఉద్యోగ సంఘాల నేతల తీరుపై సీరియస్ గా స్పందించారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.. మాటలు, వాటికి కౌంటర్లు చేస్తూ వెళితే అసలు సమస్య డైవర్ట్ అవుతుందని.. దీని వల్ల ఉద్యోగులకే నష్టం అన్నారు.. ఉద్యోగ సంఘాల నాయకులు ఏం చేయాలనుకుంటున్నారో నాకు అర్ధం కావడం లేదన్న ఆయన.. ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాల్సిన బాధ్యత […]
యూనివర్సిటీ గ్రాంట్స్ (యూజీసీ) చైర్మన్గా తెలంగాణ బిడ్డ నియమితులయ్యారు.. యూజీసీ చైర్మన్గా తెలంగాణకు చెందిన మామిడాల జగదీష్ కుమార్ను నియమిస్తున్నట్టు కేంద్రప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది… ఇప్పటి వరకు ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీకి వైస్-ఛాన్సలర్గా విధులు నిర్వహిస్తున్నారు జగదీష్ కుమార్… యూజీసీ చైర్మన్గా ఆయన ఐదు సంవత్సరాలు కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొంది కేంద్ర ప్రభుత్వం.. Read Also: రోజా తీవ్ర అసంతృప్తి..! అవసరమైతే రాజీనామాకు సై.. జగదీష్ […]
ఆంధ్రప్రదేశ్లోని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పదవులు చిచ్చు పెడుతున్నాయి.. తాజాగా, జరిగిన పరిణామాలపై ఆవేదనకు గురైన ఫైర్ బ్రాండ్, ఎమ్మెల్యే ఆర్కే రోజా.. అవసరం అయితే రాజీనామాకైనా సిద్ధమంటున్నారు.. ఇంతకీ ఆమె అసంతృప్తి కారణం ఏంటంటే.. శ్రీశైలం బోర్డు చైర్మన్ నియామకమే. తాజాగా, శ్రీశైలం బోర్డు చైర్మన్గా చెంగారెడ్డి చక్రపాణిరెడ్డిని నియమించారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. అయితే, ఈ వ్యవహారం రోజాకు మింగుడుపడడం లేదు.. చక్రపాణిరెడ్డికి పదవి ఇవ్వడంపై రోజా కినుకు వహించారు.. కాగా, […]
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావుపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్.. కేసీఆర్.. ఈ మధ్య రాజ్యాంగంపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమైన విషయం తెలిసిందే కాగా.. ఇవాళ తాడేపల్లిలో ఏపీ ఎస్సీ, ఎస్టీ గెజిటెడ్ అధికారుల సంక్షేమ సంఘం డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో.. డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, ప్రభుత్వ సలహాదారు సజ్జలతో కలిసి పాల్గొన్న మంత్రి ఆదిమూలపు సురేష్.. కేసీఆర్పై విరుచుకుపడ్డారు.. కొంత మంది కుహనా మేధావులు రాజ్యాంగం మార్చాలని అంటున్నారని ఆగ్రహం […]
ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. తాడేపల్లిలో జరిగిన ఏపీ ఎస్సీ, ఎస్టీ గెజిటెడ్ అధికారుల సంక్షేమ సంఘం డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో మంత్రి ఆదిమూలపు సురేష్, ప్రభుత్వ సలహాదారు సజ్జల, పలువురు ప్రజా ప్రతినిధులతో కలిసి పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చంద్రబాబు ఓట్ల కోసం మాల, మాదిగల్లో చీలికలు తీసుకుని వచ్చారని ఆరోపించారు.. తమ సమస్యలు పరిష్కారించాలనే గెజిటెడ్ ఉద్యోగులు మనల్ని ఇక్కడకు పిలిచారన్న ఆయన.. అమ్మ ఒడి […]