పీఆర్సీ, ఫిట్మెంట్, హెచ్ఆర్ఏ వ్యవహారం ఏపీలో కాకరేపుతోంది. అయితే, మరోసారి చర్చలు కొనసాగుతున్నాయి.. దీంతో.. కార్మికుల సమ్మె డెడ్‌లైన్ కంటే ముందే.. ఈ వ్యవహారానికి పులిస్టాట్ పెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.. ఇక, ఇవాళ ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన స్టీరింగ్ కమిటీ సభ్యులు వెంకట్రామిరెడ్డి, పట్టువిడుపులకు మేం కూడా సిద్ధంగా ఉన్నామని తెలిపారు.. చర్చలు ఇంకా కొనసాగుతున్నాయి.. ఒకదానికి ఒకటి లింక్ అయి ఉన్న అంశాలు ఉన్నాయన్న ఆయన… కొన్నింటి పై ప్రభుత్వం, కొన్ని అంశాల్లో మేం […]
భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ తెలంగాణలో పర్యటించనున్నారు.. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఆయన పర్యటన కొనసాగనుంది.. సంగారెడ్డి జిల్లాలోని ఇక్రిశాట్ స్వర్ణోత్సవాల్లో పాల్గొననున్న ఆయన.. ఆ తర్వాత రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లో నిర్వహిస్తున్న రామానుజచార్యుల సహస్రాబ్ది సమారోహంలో పాల్గొంటారు.. ఈ పర్యటన కోసం మధ్యాహ్నం 2.45 గంటల ప్రాంతంలో ఇక్రిశాట్‌కు చేరుకోనున్న ప్రధాని మోడీ.. ఇక్రిసాట్ స్వర్ణోత్సవాలను ప్రారంభిస్తారు.. ఇక, ఇక్రిశాట్లో కొత్తగా ఏర్పాటు చేసిన పర్యావరణ మార్పుల పరిశోధన కేంద్రంతో పాటు ర్యాపిడ్ జనరేషన్ […]
మంత్రుల కమిటీతో జరిగిన స్టీరింగ్ కమిటీ సమావేశంలో ప్రభుత్వం కీలక ప్రతిపాదనలు చేసినట్టుగా తెలుస్తోంది.. హెచ్ఆర్ఏపై ప్రభుత్వం కీలక ప్రతిపాదనలు చేసినట్టు సమాచారం.. హెచ్ఆర్ఏ శ్లాబుల్లో కీలక సవరణల దిశగా చర్చలు సాగాయి.. మంత్రులు నాలుగు శ్లాబులు ప్రతిపాదించినట్లు సమాచారం.. 2 లక్షల జనాభాలోపు ఉన్న ప్రాంతాల్లో ఉద్యోగులకు 8 శాతం హెచ్ఆర్ఏ ప్రతిపాదన పెట్టగా.. అదే 2 లక్షల నుంచి 5 లక్షల జనాభా ఉంటే 12 శాతం హెచ్ఆర్ఏ, ఇక, 5-15 లక్షల జనాభా […]
కరోనా థర్డ్ వేవ్ విజృంభణ క్రమంగా తగ్గిపోతోంది.. దీంతో.. కరోనా కేసులు భారీ ఎత్తున నమోదైన సమయంలో.. కఠిన ఆంక్షలు విధిస్తూ.. అమలు చేస్తూ వచ్చిన ఆయా రాష్ట్రలు ఇప్పుడు సడలింపులబాట పడుతున్నాయి.. తాజాగా, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ ఆంక్షలను సడలించింది. సినిమా థియేటర్స్, జిమ్‌లు, స్విమ్మింగ్ పూల్స్, యోగా కేంద్రాలను.. పూర్తి సామర్థ్యంతో నడుపుకోవచ్చని పేర్కొంది ప్రభుత్వం.. అయితే, ఇదే సమయంలో కోవిడ్ నిబంధనలను తప్పకుండా పాటించాలని స్పష్టం చేసింది.. రాష్ట్రంలో ప్రస్తుతం కోవిడ్ […]
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో డ్రోన్స్ పై నిషేధం విధిస్తున్నట్టు పోలీస్ కమిషనర్ తెలిపారు.. రామచంద్రపురం ఇక్రిశాట్, ముంచింతల్ చిన్న జీయర్ ఆశ్రమం వద్ద డ్రోన్స్ పై నిషేధం ఉంటుందని.. రేపు ఉదయం 6 గంటల నుండి ఈ నెల 15వ తేదీ వరకు నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయని ఉత్తర్వులు జారీ చేశారు.. రిమోట్ కంట్రోల్ డ్రోన్స్, పర గ్లిడర్స్, మైక్రో లైట్ ఎయిర్ క్రాఫ్ట్స్ పై నిషేధం విధించారు.. 15వ తేదీ వరకు వీవీఐపీల రాక సందర్భంగా […]
తెలుగు రాష్ట్రాల్లో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది.. అయితే, గత బులెటిన్‌తో పోలిస్తే మాత్రం.. ఆంధ్రప్రదేశ్‌లో కొత్త పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గగా.. తెలంగాణలో మాత్రం స్వల్పంగా పెరిగాయి.. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన కోవిడ్ బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 30,886 శాంపిల్స్ పరీక్షించగా 4,198 మందికి పాజిటివ్‌గా తేలింది.. మరో ఐదుగురు మృతి చెందారు, ఇదే సమయం 9,317 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు ప్రభుత్వం పేర్కొంది.. ప్రస్తుతం రాష్ట్రంలో […]
డబ్బుల గురించి ఓ సినిమాలో హీరో పాడినట్టుగా.. బతుకు బండిని నడేపేది పచ్చనోటే.. డబ్బును బట్టి మనిషికి స్టేటస్ మారిపోతోంది.. ఇచ్చే విలువ కూడా మారుతుంది.. పేరు వెనుక లేని తోకలు కూడా వచ్చి చేరుతాయి.. అయితే, ఇప్పుడు తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే డబ్బులపై హాట్ కామెంట్సల్ చేశారు.. మానకొండూరు నియోజకవర్గంలోని ఇల్లంతకుంట మండల కేంద్రంలో దళిత బంధుపై నిర్వహించిన అవగాహన సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే రసమయి బాలకిషన్.. మనిషికి డబ్బు చాలా ముఖ్యం […]