ఊహించని పరిణామాలతో ప్రధాని పదవి కోల్పోయిన పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్.. పాక్ ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరించారు.. తనకు ఇప్పుడు పదవి లేదని, తాను మరింత ప్రమాదకరంగా మారుతానంటూ వార్నింగ్ ఇచ్చారు.. ప్రధాని పదవి కోల్పోయిన తర్వాత తొలిసారి పెషావర్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తాను అధికారంలో ఉన్నప్పుడు ప్రమాదకారిని కాదు.. కానీ, ఇప్పుడు మరింత ప్రమాదకారిగా మారుతానని పేర్కొన్నారు.. దేశంలో తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రతిపక్ష పార్టీల సహాయంతో విదేశీ శక్తులు కుట్రలు చేశాయని మరోసారి ఆరోపించిన ఆయన.. ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకున్న ప్రభుత్వాన్ని తాము అంగీకరించబోమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Read Also: Vontimitta: నేడు ఒంటిమిట్టలో రాములోరి కళ్యాణం.. పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం
ఇక, దేశంలో ప్రతిసారీ ఒక ప్రధానిని తొలగించినప్పుడు ప్రజలు పండగ చేసుకుంటారు.. కానీ, కానీ తనను పదవి నుండి తొలగిస్తే ప్రజలు నిరసనలు చేస్తున్నారని తెలిపారు ఇమ్రాన్ ఖాన్.. మరోవైపు.. తనను పదవి నుండి తొలగించే సమయంలో అర్ధరాత్రి వరకు న్యాయస్థానం తలుపులు ఎందుకు తెరిచి ఉంచారని నిలదీశారు.. దాని వెనుక ఉన్న ఉద్దేశ్యాన్ని బహిరంగపర్చాలని డిమాండ్ చేశారు పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. కాగా, ప్రధాని పదవి నుంచి దిగిపోయే పరిస్థితులు వచ్చినప్పటి నుంచి భారత్‌పై ప్రశంసలు కురిపిస్తూ వచ్చిన విషయం తెలిసిందే.