దేశవ్యాప్తంగా పెట్రో ధరలు మండిపోతున్నాయి.. వాహనాలు బయటకు తీయాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి.. సామాన్యులకు భారంగా మారిన పెట్రో ధరలు.. క్రమంగా అన్ని రకాల ఉత్పత్తులపై భారం మోపుతున్నాయి.. అయితే, రూపాయికే లీటర్ పెట్రోల్ ప్రకటించిందో సంస్థ.. రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా… మహారాష్ట్ర సోలాపూర్‌లో ఈ ఆఫర్ తీసుకొచ్చారు.. అయితే, కొన్ని షరతులు కూడా పెట్టారు.. మొదట తన పెట్రోల్ పోయించుకున్న 500 మంది మాత్రమే రూపాయికే లీటర్ పెట్రోల్ అనే ఆఫర్ తీసుకొచ్చారు. అసలే పెరిగిన ధరలతో అల్లాడిపోతున్న జనం.. ఆ పెట్రోల్ బంకు వద్ద బారులు తీరారు. ప్రతి కొనుగోలుదారునికి ఒక లీటరు ఇంధనం మాత్రమే ఇచ్చారు నిర్వాహకులు.. అయినప్పటికీ, ప్రజలు పెట్రోల్ పంప్ వద్ద కిక్కిరిసిపోయింది.. వాహనాల రద్దీ పెరగడంతో.. పోలీసులు రంగ ప్రవేశం చేయాల్సి వచ్చింది.
Read Also: KS Eshwarappa: సీఎం ఆదేశాలు.. ఇవాళ ఆ మంత్రి రాజీనామా..
డాక్టర్ అంబేద్కర్ విద్యార్థులు, యూత్ పాంథర్స్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.. కాగా, ద్రవ్యోల్బణం బాగా పెరిగింది. నరేంద్ర మోడీ ప్రభుత్వ హయాంలో పెట్రోల్ ధర లీటర్ రూ.120కి చేరింది. కాబట్టి ప్రజలకు ఉపశమనం కలిగించడానికి మరియు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని జరుపుకోవడానికి, మేము ఒక్క రూపాయికే పెట్రోల్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాము అని ఆ సంస్థ రాష్ట్ర యూనిట్ నాయకుడు మహేష్ సర్వగోడ వెల్లడించారు.. మా లాంటి చిన్న సంస్థ 500 మందికి ఉపశమనం కలిగించగలిగింది.. ప్రభుత్వం కూడా సహాయం అందించాలి అని సూచించారు. ఇక, రూపాయికే పెట్రోలు కొనడం సంతోషంగా ఉందని ఆనందాన్ని వ్యక్తం చేశారు పలువురు కొనుగోలు దారులు..