కేంద్ర ప్రభుత్వ “అగ్నిపథ్” పథకానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం అవుతున్నాయి.. ఆ నిరసనలపై ఆర్మీ చీఫ్, జనరల్ మనోజ్ పాండే స్పందించారు. ఆర్మీ శిక్షణ ప్రక్రియ ప్రత్యేకంగా,ఆలోచనాత్మకంగా నిర్వహించబడుతుందని పేర్కొన్నారు.. నిర్దిష్ట ప్రమాణాలు పొందుపర్చాం.. అవి నిరంతరం పర్యవేక్షించబడతాయి మరియు పరీక్షించబడతాయని స్పష్టం చేశారు. అగ్నిపథ్ స్కీమ్ ద్వారా భారత్‌కు సమర్ధవంతమైన సైన్యాన్ని అందించగలమని అభిప్రాయపడ్డారు ఆర్మీ చీఫ్.. Read Also: Agnipath Protest: అగ్గి రాజేసిన అగ్నిపథ్.. డిప్యూటీ సీఎం ఇంటిపై దాడి భారత […]
కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన అగ్నిపథ్ స్కీమ్‌కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు ఉద్రిక్తంగా మారుతున్నాయి.. ఆర్మీ రిక్రూట్మెంట్ కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువత కేంద్రం తీరుపై మండిపడుతున్నారు.. ఒక్కసారి ఎన్నికవగానే ప్రజా ప్రతినిధులు జీవితాంతం పెన్షన్ పొందుతున్నారని… ప్రాణాలు అర్పించేందుకు సైన్యంలో దిగినవారికి పెన్షన్ స్కీమ్ ఎత్తేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. బీహార్‌లో మొదట అగ్నిపథ్‌పై ఆందోళను ప్రారంభం కాగా.. క్రమంగా అన్ని ప్రాంతాలకు విస్తరిస్తున్నాయి.. సికింద్రాబాద్‌లో ఆర్మీ అభ్యర్థులు నిర్వహించిన ఆందోళన విధ్వంసానికి దారి […]
అగ్నిపథ్ స్కీమ్‌ను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా నిరుద్యోగులు, ఆర్మీ అభ్యర్థులు నిర్వహిస్తోన్న ఆందోళనలు పలు చోట్ల హింసాత్మకంగా మారాయి. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ఆర్మీ అభ్యర్థులు నిర్వహించిన ఆందోళన విధ్వంసానికి దారి తీసింది.. ఒక్కసారిగా రైల్వేస్టేషన్‌లోకి ఆందోళనకారులు చొచ్చుకురావడంతో పోలీసులు చేతులెత్తేశారు.. మొత్తంగా అగ్నిపథ్ పై ఆందోళనకారులు ఆగ్రహంతో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ను రణరంగంగా మార్చేశారు.. రైల్వేస్టేషన్‌లోని ఫర్నిచర్, సీసీ కెమెరాలు, ఏది కనిపించినా వదలకుండా ధ్వంసం చేశారు.. Read Also: Agneepath Scheme: సికింద్రాబాద్ విధ్వంసంపై స్పందించిన రేవంత్ ఇక, […]
టెలికం మార్కెట్లో జియో ఎంట్రీ తర్వాత ఆ రంగంలోని ఉన్న సంస్థల అంచనాలు తలకిందులయ్యాయి.. ఫ్రీ ఆఫర్ ఎత్తివేసి.. జియో కొత్త టారిప్‌లు తెచ్చినా.. చార్జీలు పెంచుతున్నా.. ఆ సంస్థకు ఆదరణ తగ్గడం లేదనే చెప్పవచ్చు.. కొన్ని సందర్భాల్లో జియో చందాదారులు తగ్గిపోయినా.. మళ్లీ పుంజుకుంది.. ఏప్రిల్‌లో కొత్తగా 16.8 లక్షల మంది చందాదారులు చేరడం విశేషం.. దీంతో.. జియో మొబైల్ యూజర్ల సంఖ్య 40.5 కోట్లకు పెరిగి.. దేశంలోనే అతిపెద్ద టెలికం సంస్థగా కొనసాగుతోంది. Read […]
తెలంగాణ సహా దేశవ్యాప్తంగా వరుసగా చిన్నారులు, అమ్మాయిలు, వృద్ధులు అనే తేడా లేకుండా అఘాయిత్యులు ఆందోళనకు గురిచేస్తున్నాయి.. జూబ్లీ హిల్స్ పబ్ కేసు మరువక ముందే.. హైదరాబాద్‌లో అదే తరహా కేసు ఒకటి ఇప్పుడు కలకలం రేపుతోంది… హైదరాబాద్‌లోని బాచుపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో గుజరాత్‌కు చెందిన యువతిపై అత్యాచారం జరిగినట్టు పోలీసులకు ఫిర్యాదు అందింది.. పోలీసులు చెబుతున్నప్రకారం పూర్తి వివరాల్లోకి వెళ్తే.. Read Also: US Shooting: అమెరికాలోని అలబామా చర్చిలో కాల్పుల కలకలం.. ఒకరు మృతి […]
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.. అనంతపురం జిల్లా తాడిపత్రిలోని జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు ఈడీ అధికారులు.. జేసీ ప్రభాకర్‌రెడ్డి సహా ఆయన కుటుంబ సభ్యుల సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈడీ సోదాల సమయంలో ఇంట్లో ఉన్నారు మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డితో పాటు.. జేసీ ప్రభాకర్‌రెడ్డి. మరోవైపు… కాంట్రాక్టర్ చవ్వా గోపాలరెడ్డి ఇంట్లోనూ ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. ఇవాళ తెల్లవారుజామున జేసీ ఇంట్లోకి ప్రవేశించిన ఈడీ అధికారులు సోదాలు చేపట్టడంతో.. […]
వరుసగా రెండు రోజులు దిగివచ్చి కొనుగోలు దారులకు గుడ్‌న్యూస్ చెప్పిన పసిడి ధరలు.. ఇప్పుడు షాక్ ఇచ్చాయి.. మరోసారి పైకి కదిలాయి.. దేశంలోని చాలా నగరాల్లో బంగారం, వెండి ధరల్లో వ్యత్యాసం ఉంది. ఈరోజు భారత మార్కెట్లో 1 గ్రాము 22 క్యారెట్ల బంగారం ధర రూ.4810 వద్ద కొనసాగుతుండగా.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.48100గా ఉంది.. దేశంలోని నాలుగు మెట్రోపాలిటన్ నగరాల్లో బంగారం ధరలు పరిశీలిస్తే.. చెన్నైలో 22 క్యారెట్లు మరియు […]
అన్నింటికి ఆధార్ తప్పనిసరి అయిపోయింది.. చిన్నా పెద్ద తేడా లేకుండా ఆధార్ కార్డు చూపించడం, అవసరం అయితే జీరాక్స్ కాపీ ఇవ్వడం జరుగుతోంది.. ఇక, పుట్టగానే ఆధార్ నంబర్ కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధం అవుతుంది.. ఆస్పత్రిలో పుట్టిన వెంటనే ఆ పసికూనలకు ఆధార్ నంబర్ కేటాయించేలా చర్యలు తీసుకుంటున్నారు. అప్పుడే పుట్టిన శిశువులకు ఆస్పత్రుల్లోనే ఆధార్ నంబర్ కేటాయించేలా చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం.. పైలట్ ప్రాజెక్టు కింద సంగారెడ్డి ఎంసీహెచ్, జహీరాబాద్ ఏరియా ఆస్పత్రిని ఎంపిక చేసింది.. […]
శ్రీశుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ బుతువు, జ్యేష్టమాసం, కృష్ణపక్షం, శుక్రవారం రోజు రాశిఫలాలు ఎలా ఉన్నాయి? ఏ రాశివారు ముందడుగు వేయాలి..? ఎవరు వెనక్కి తగ్గాలి..? ఎవరు కొత్త పనులు చేపట్టాలి…? ఎవరు దూరంగా ఉంటే మంచిది..? ఈ రోజు వివిధ రాశులవారి దినఫలాల కోసం కింది వీడియోను క్లిక్ చేయండి.. https://www.youtube.com/watch?v=E3jBWhyuDPU