ఉద్యోగుల పట్ల ఇలాంటి సానుకూల నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం గతంలో లేదు అంటూ సీఎం వైఎస్ జగన్‌పై ప్రశంసలు కురిపించారు మాజీ మంత్రి పేర్నినాని.. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన 99 శాతం హామీలను సీఎం జగన్ అమలు చేశారన్న ఆయన.. సీపీఎస్ విధానంలో ఉద్యోగికి రూ. 400 పెన్షన్ ఇచ్చే పరిస్థితి ఉండేది.. సీపీఎస్ విధానాన్ని రద్దు చేస్తానని మచిలీపట్నంలో పాదయాత్రలో వైఎస్ జగన్ హామీ ఇచ్చారు.. ఇప్పుడు సీపీఎస్ ను రద్దు చేసి జీపీఎస్ ను రాష్ట్ర ప్రభుత్వం తీసుకు వచ్చిందని తెలిపారు.
Off The Record: తెలంగాణ కాంగ్రెస్‌లో ఎప్పుడూ ఏదో ఒక కార్యక్రమంతోనో, మాటలతోనో వార్తల్లో ఉండే నాయకుడు జగ్గారెడ్డి. ఎందుకో.. గత కొన్ని నెలలుగా మ్యూట్ మోడ్‌లోకి వెళ్ళిపోయారాయన. మాటలే కాదు.. ఆయన ఎవరికీ కనిపించడం కూడా లేదట. ఎందుకన్నది ఎవరికీ తెలియడం లేదట. అందుకే ఆ మౌనానికి అర్ధాలు, నానార్ధాలు, విపరీతార్ధాలు వెదికే పనిలో ఉన్నారట గాంధీభవన్‌లో కొందరు. చాలా రోజుల నుంచి మౌనముద్రలో ఉన్నారు టీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. అడపా దడపా […]