Off The Record: తెలంగాణపై సీరియస్‌గా ఫోకస్ పెట్టిన కాంగ్రెస్ అధిష్టానం.. సోనియా ప్రత్యేక శ్రద్ధ..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: వచ్చే అసెంబ్లీ ఎన్నికలు చావో రేవో అన్నట్టుగా భావిస్తోంది తెలంగాణ కాంగ్రెస్. ఈసారి రాష్ట్రంలో ఉనికి చాటుకోకుంటే… ఇక దుకాణం కట్టేసుకోవాల్సిందేనన్నంత కసి, భయం కలగలిసి ఉన్నాయట ఆ పార్టీ నేతల్లో. రాష్ట్ర నాయకుల సంగతి పక్కన పెడితే… అధిష్టానమే ఈ విషయంలో చాలా సీరియస్‌గా ఉన్నట్టు తెలిసింది. అంతర్గత కుమ్ములాటలతో ఎట్టి పరిస్థితుల్లో ప్రత్యర్థులకు ఛాన్స్ ఇవ్వకూడదన్న పట్టుదలగా వ్యూహ రచన జరుగుతోందట. పార్టీకి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని, ఇలాంటి అవకాశాన్ని చేజార్చుకోకూడదనుకుంటూ… నౌ ఆర్ నెవర్ అంటున్నారట పార్టీ పెద్దలు. అందుకనే… సోనియా, రాహుల్, ప్రియాంక.. ఇలా అంతా ఇప్పుడు తెలంగాణ మీద ఫోకస్ పెట్టారట. మరీ ముఖ్యంగా పొలిటికల్ వీఆర్‌ఎస్ తీసుకున్న సోనియా కూడా ఈ విషయంలో చాలా పర్టిక్యులర్‌గా ఉన్నట్టు తెలిసింది. ఖమ్మం బహిరంగ సభ జరిగిన రోజున ఆమె వ్యవహారశైలి గురించి తర్వాత తెలుసుకున్న టి కాంగ్రెస్ నేతలు అవాక్కయ్యారట.
ఖమ్మం సభ జరుగుతున్న తీరును సోనియా ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ… స్వయంగా పర్యవేక్షించారట. సభ మీద పోలీసుల ఆంక్షలు, వచ్చేవారిపై నియంత్రణ గురించి తెలుసుకున్న సోనియాగాంధీ…. నాలుగైదు సార్లు రాహుల్ సెక్యూరిటీ అధికారుకి ఫోన్ చేసి ఆరా తీశారట. సభ దగ్గర ఎవరెవరు ఉన్నారు..? ఏం జరుగుతోంది? జన సమీకరణ…లాంటి అంశాలపై ఆమె వాకబు చేసినట్టు తెలుసుకున్న కొంత మంది సీనియర్ నేతలు అవాక్కయ్యారట. మేడమే నేరుగా ఫోకస్ పెట్టడం ఏంటి? ఆ స్థాయిలో పర్యవేక్షిస్తున్నారంటే….అధిష్టానం ఎంత సీరియస్ గా తెలంగాణ మీద ఫోకస్ పెట్టిందో అర్థం అవుతోందంటున్నారు. అటు చేరికలపై కూడా నేరుగా అధిష్టానమే దృష్టిసారిస్తోంది. పార్టీ చేయించుకుంటున్న సర్వేల ఆధారంగానే చేరికల లెక్కలు ఉన్నట్టు తెలిసింది. ఎత్తుగడలకు సంబంధించిన ఆదేశాలన్నీ….ఢిల్లీ నుంచే వస్తున్నాయని అంటున్నారు. అంటే… ఎట్నుంచి ఎటు చూసినా… ఏ అవకాశాన్ని మిస్ అవకుండా జాగ్రత్తలు తీసుకుని ప్లాన్ చేయాలన్న దిశగా అడుగులు వేస్తోంది కాంగ్రెస్ అధిష్టానం. ఖమ్మంలాంటి సభల్ని వీలైనంత ఎక్కువగా పెట్టాలన్న ఆలోచన కూడా మొదలైందట. అలాగే ఎన్నికలలోపు రాహుల్ బహిరంగ సభలు ప్రతి ఉమ్మడి జిల్లాకు ఒకటి పెడితే ఎలా ఉంటుందన్న ఆలోచన కూడా పార్టీ హైకమాండ్‌కు ఉన్నట్టు తెలిసింది.
Also Read
- Smriti Mandhana: బాలల హక్కుల కోసం స్మృతి మంధాన ముందడుగు.. ఆహ్వానించిన సచిన్ టెండూల్కర్..
- Pakistan: పాకిస్తాన్లో అరాచక పాలన.. ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.!
- Abhijeet Dipke: ‘‘సంతకం చేయలేదు, మళ్లీ వీధుల్లోకి వస్తాం’’.. CJP దీప్కే సంచలన ప్రకటన.!
- Bangladesh: షేక్ హసీనాను గద్దె దించిన బంగ్లాదేశ్ నేత.. ఇప్పుడు CJP నిరసనలకు మద్దతు.!
ఖమ్మం సభపై రాహుల్ గాంధీ సంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. సభ ముగిశాక విజయవాడ వెళ్తూ…. దారిలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి థాక్రే తో తెలంగాణపై చర్చించారట రాహుల్. ఖమ్మం లాంటి సభలు జిల్లాకు ఒకటి నిర్వహించేలా ప్లాన్ చేయాలని సూచించారట. పాలమూరు జిల్లా సభను కూడా ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని చెప్పినట్టు తెలిసింది. జూపల్లి చేరిక సభకు ప్రియాంక వస్తున్నందున ఖమ్మం తరహాలో సభను నిర్వహించాలని అధిష్టానం నుంచి ఆదేశాలు వచ్చినట్టు తెలిసింది. పాలమూరు సభ తేదీ ఖరారవకున్నా… ఈనెల 20న నిర్వహించవచ్చని ప్రాధమిక సమాచారం. మహబూబ్‌నగర్ జిల్లా సభ అయ్యాక పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్ పెట్టే అవకాశం ఉంది. మొత్తంగా వరుస సభలు..సమావేశాలతో టి కాంగ్రెస్‌లో జోష్ నింపే పనిలో పడింది పార్టీ అధిష్టానం. ఆ ప్రణాళికలు ఏ మేరకు వర్కౌట్ అవుతాయో, రాష్ట్ర నాయకులు ఎంత వరకు సఖ్యతగా కలిసి పనిచేస్తారో చూడాలి.
తాజావార్తలు
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
-
Smriti Mandhana: బాలల హక్కుల కోసం స్మృతి మంధాన ముందడుగు.. ఆహ్వానించిన సచిన్ టెండూల్కర్..
-
Pakistan: పాకిస్తాన్లో అరాచక పాలన.. ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.!
-
Rajinikanth: బాషా 2.. పేట 2 వద్దని.. జైలర్ 2కి తలైవా ఎందుకు ఒప్పుకున్నారు?
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..