ప్రధాని నరేంద్ర మోడీతో సీఎం జగన్ సమావేశం ముగిసింది.. ప్రధానితో నివాసంలో జరిగిన ఈ సమావేశం దాదాపు 1.20 గంటలకు పైగా సాగింది.. ప్రధాని మోడీతో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు సీఎం జగన్.
Undavalli Arun Kumar: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అష్ట దరిద్రాలకు కేంద్ర ప్రభుత్వమే కారణం అంటూ విమర్శలు గుప్పించారు సీనియర్ పొలిటీషియన్, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్.. ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ పలు అంశాలను ప్రస్తావించిన ఆయన.. కేంద్రానికి రాష్ట్రం నుంచి 100 రూపాయలు వెళ్తే.. వాళ్లు తిరిగి రాష్ట్రానికి ఇస్తున్నది 64 రూపాయలు మాత్రమేనని దుయ్యబట్టారు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి రోజులు రావాలని కోరుకోవటం మినహా నాలాంటి వారు ఏమీ చేయలేరని ఆవేదన వ్యక్తం […]
వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు యూనిఫాం సివిల్ కోడ్ పై తమ విధానం ఏంటో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఉండవల్లి.. రేపు పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు పెట్టాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. అందుకే పార్టీలు తమ వైఖరిని ప్రజలకు వెల్లడించాలన్నారు.
Off The Record: ఉమ్మడి విశాఖ జిల్లాలో గవర్లకు ప్రత్యేక గుర్తింపు ఉంది. సీనియర్ లీడర్స్ దాడి వీరభద్రరావు, కొణతాల రామకృష్ణ ఈ సామాజికవర్గానికి చెందినవారే. అనకాపల్లి సిట్టింగ్ ఎంపీ భీశెట్టి సత్యవతి, విశాఖ పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే గణబాబు కూడా గవర్లే. ఉమ్మడి విశాఖ వరకు నామినేటెడ్ పదవుల్లోనూ వీళ్ళకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటాయి రాజకీయపార్టీలు. ఉత్తరాంధ్రలో ఈ సామాజికవర్గానికి చెందినవారు దాదాపు 20 లక్షల మంది ఉన్నారు. విశాఖ పశ్చిమ, ఉత్తర, దక్షిణ, […]
Off The Record: వచ్చే అసెంబ్లీ ఎన్నికలు చావో రేవో అన్నట్టుగా భావిస్తోంది తెలంగాణ కాంగ్రెస్. ఈసారి రాష్ట్రంలో ఉనికి చాటుకోకుంటే… ఇక దుకాణం కట్టేసుకోవాల్సిందేనన్నంత కసి, భయం కలగలిసి ఉన్నాయట ఆ పార్టీ నేతల్లో. రాష్ట్ర నాయకుల సంగతి పక్కన పెడితే… అధిష్టానమే ఈ విషయంలో చాలా సీరియస్గా ఉన్నట్టు తెలిసింది. అంతర్గత కుమ్ములాటలతో ఎట్టి పరిస్థితుల్లో ప్రత్యర్థులకు ఛాన్స్ ఇవ్వకూడదన్న పట్టుదలగా వ్యూహ రచన జరుగుతోందట. పార్టీకి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని, ఇలాంటి అవకాశాన్ని […]