కాలనీలు పూర్తవుతున్నకొద్దీ అన్నిరకాలుగా కాలనీల్లో కనీస మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు సీఎం జగన్.. ఇళ్ల నిర్మాణవేగాన్ని ఇదే రీతిలో ముందుకు తీసుకెళ్లాలన్న ఆయన.. కోర్టు కేసులు కారణంగా ఇళ్లస్థలాలు పంపిణీ నిలిచిపోయిన చోట ప్రత్యామ్నాయ భూముల సేకరణపై దృష్టి పెట్టాలని, ఈ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు.
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి.. వరుసకు వదిన, మరిది అవుతారు. వీరిద్దరూ చెరొక పార్టీకి నాయకత్వం వహిస్తున్నారు. పురంధేశ్వరి ఇప్పటి వరకు చంద్రబాబును డైరెక్ట్గా విమర్శించిన దాఖలాలు లేవు. కాంగ్రెస్లో ఉన్నా, బీజేపీలో ఉన్నా.. టీడీపీ అధినేతపై విమర్శలు చేయలేదు. ఎన్నడూ చంద్రబాబు పేరు కూడా ఎత్తలేదు. ఇప్పడు పరిస్థితి వేరు.
Kakani Govardhan Reddy: తెలుగుదేశం పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి.. నెల్లూరులో మీడియాతో మాట్లాడిన ఆయన.. టీడీపీ చచ్చిపోయింది.. దాని పాదయాత్రకు నలుగురు వ్యక్తులు కావాలని.. పాడె పట్టడానికి ముందు వైపు చంద్రబాబు, అచ్చెన్నాయుడు ఉన్నారు.. ఇక, వెనుకవైపు లోకేష్ బాబు ఉండగా.. నాలుగో వ్యక్తిగా పాడె మోయటానికి పవన్ కల్యాణ్ ఆరాటపడుతున్నాడు అంటూ ఎద్దేవా చేశారు.. ఇక, లోకేష్ బాబుకు వ్యవసాయ పంటల పేర్లు కూడా తెలియదు.. మరోవైపు చంద్రబాబు […]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హస్తిన పర్యటన ముగిసింది.. ఈ ఉదయం ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ఏపీ సీఎం.. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా, కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో సమావేశం అయ్యారు.
పవన్ కల్యాణ్ ఈ ఎన్నికల్లో కూడా ఎమ్మెల్యే కాలేడు అని జోస్యం చెప్పారు మంత్రి రోజా.. జాతరలో వేపాకు పట్టుకొని ఉగినట్లు ఊగడం తప్ప పవన్ కూ ఏమీ తెలియదు అంటూ ఎద్దేవా చేశారు. గోదావరి జిల్లాలో 34 అసెంబ్లీ నియోజకవర్గాలు గెలవడం కాదు.. దమ్ముంటే రాష్ట్రం మొత్తంలో 34 మంది అభ్యర్ధులను సొంతంగా పవన్ కల్యాణ్ నిలబెట్టాలి అంటూ సవాల్ విసిరారు