Mahesh Babu: పాట మినహా పూర్తయిన ‘సర్కారు వారి పాట’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రిన్స్ మహేశ్ బాబు అభిమానులకో శుభవార్త! అతి త్వరలోనే మహేశ్ లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’ షూటింగ్ కు చిత్ర బృందం గుమ్మడికాయ కొట్టేయబోతోంది. ఈ సినిమాకు సంబంధించిన ఒక్క పాట చిత్రీకరణ మినహా మొత్తం షూటింగ్ పూర్తయిపోయింది. ఈ ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో మహేశ్ బాబు సరసన తొలిసారి కీర్తి సురేశ్ హీరోయిన్ గా నటిస్తోంది. పరశురామ్ ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు. గతంలో ఎన్నడూ చూడని మహేశ్ ను సరికొత్త అవతారంలో చూపించబోతున్నాడు పరశురామ్. ఇప్పటికే విడుదలైన ఈ సినిమాలోని రెండు పాటలు సూపర్ డూపర్ హిట్ అయిపోయాయి.
పాన్ ఇండియా మూవీస్ తో పాటు భారీ బడ్జెట్ తెలుగు సినిమాలూ విడుదలకు క్యూ కట్టడంతో ‘సర్కారు వారి పాట’ రిలీజ్ విషయంలో మరో ఆలోచన లేదని నిర్మాతలు చెప్పేశారు. ముందు అనుకున్నట్టే ఈ మూవీ మే 12న జనం ముందుకు రాబోతోంది. మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ పతాకాలపై నవీన్ యెర్నేని, వై. రవి శంకర్, రామ్ ఆచంట, గోపీ ఆచంట సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆర్. మధి సినిమాటోగ్రఫర్‌గా వ్యవహరిస్తున్నారు. మార్తాండ్ కే వెంకటేష్ ఎడిటర్‌గా, ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. ఇక మీదట సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ కంటిన్యూగా ఇస్తామని చిత్ర నిర్మాతలు ప్రిన్స్ మహేశ్ బాబు ఫ్యాన్స్ ను ఊరిస్తున్నారు.
Also Read
- Srinidhi Shetty: "కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు.." శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
- Sardar 2 OTT: ఓటీటీలో 'సర్దార్ 2' ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
- Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం": జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
- Ranabaali : ‘రణబాలి’ టికెట్ రేట్ల పెంపు వివాదం: అసలు నిజం బయటపెట్టిన మేకర్స్
#SarkaruVaariPaata completes shoot except for a song!
Get ready for exciting updates 💥#SVPManiaBegins 🔥#SVPOnMay12
Super 🌟 @urstrulyMahesh @KeerthyOfficial @ParasuramPetla @madhie1 @MusicThaman @14ReelsPlus @GMBents @saregamasouth pic.twitter.com/qK4tYD0h6d
— Mythri Movie Makers (@MythriOfficial) April 12, 2022
తాజావార్తలు
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
-
Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
-
Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ ‘విరాట్ గర్జన’.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!