Rajamouli Next Movie: రాజమౌళి తరువాతి చిత్రం అదేనా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డైనమిక్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోందనగానే సదరు సినిమాపై ప్రేక్షకుల్లో పలు చర్చలు మొదలవుతూ ఉంటాయి. ఈ మధ్య కాలంలో అంతటి స్టార్ డమ్ చూసిన డైరెక్టర్ మరొకరు కానరారు. రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి-1’ ఉత్తమ చిత్రంగా జాతీయ అవార్డు సొంతం చేసుకోవడం, రాజమౌళి తరం దర్శకుల్లో ఆయనకు మాత్రమే ‘పద్మ’ పురస్కారం లభించడం ఇత్యాది అంశాలు సైతం రాజమౌళి అనగానే నేషనల్ లెవెల్లో ఆసక్తి కలిగేలా చేస్తున్నాయి. రాజమౌళి ‘ట్రిపుల్ ఆర్’ టిక్కెట్ రేట్ల పెంపుతో ఈ యేడాది టాప్ ట్రాసర్ గా నిలిచింది. దీంతో రాజమౌళి తరువాతి చిత్రం ఎలా ఉంటుందన్న చర్చ అప్పుడే మొదలయింది. రాజమౌళి ఈ సారి మహేశ్ బాబు హీరోగా ఓ చిత్రం తెరకెక్కించనున్నారు. ఈ విషయం చాలా రోజుల క్రితమే ఆయన స్పష్టం చేశారు. ప్రముఖ నిర్మాత డాక్టర్ కె.యల్.నారాయణ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారనీ రాజమౌళియే చెప్పారు. రాబోయే మహేశ్ సినిమా మళ్ళీ రాజమౌళి ‘బాహుబలి’ రికార్డులు బద్దలు చేస్తుందని ఆయన అభిమానులు ఆశిస్తున్నారు.
ఈ ముచ్చట ఇలా సాగుతోంటే, రాజమౌళి తరువాత తీయబోయే కథ ఇలా ఉంటుందంటూ ఓ ముచ్చట వినిపిస్తోంది. రాజమౌళి గురువు కె.రాఘవేంద్రరావు పేరు వినగానే ఆయన తెరకెక్కించిన అనేక సూపర్ డూపర్ హిట్ మూవీస్ గుర్తుకు వస్తాయి. వాటిలో అన్నిటికన్నా ముందుగా ఆబాలగోపాలానికి గుర్తుకు వచ్చే సినిమా యన్టీఆర్ ‘అడవిరాముడు’. స్టూడియోతో పనిలేకుండా 45 ఏళ్ళ క్రితమే రాఘవేంద్రరావు ‘అడవిరాముడు’ను తెరకెక్కించారు. ఈ విషయాన్ని ఇప్పటికీ అందరూ చెప్పుకుంటారు. జంగిల్ మూవీస్ లో ‘అడవిరాముడు’ నేటికీ ఓ ట్రెండ్ సెట్టర్ గా నిలచింది. రాజమౌళి మహేశ్ తో తీయబోయే చిత్రం జంగిల్ మూవీ అని వినిపిస్తోంది. అంతేకాదు, జంగిల్ మూవీ అంటే కేవలం అడవిలో తీయడం కాకుండా, పలు జంతువులను షూటింగ్ లో ఉపయోగించాల్సి ఉంటుంది. సినిమా షూటింగ్ నిమిత్తమై జంతువులను ఉపయోగించడం మన దేశంలో నిషేధం. అందువల్ల మహేశ్ తో రాజమౌళి తీయబోయే జంగిల్ మూవీని ఆఫ్రికా అడవుల్లో చిత్రీకరిస్తారని తెలుస్తోంది. ప్రధాన భాగమంతా అక్కడ షూట్ చేసి, తరువాత తెలుగునేలపై కొన్ని కీలక సన్నివేశాలను, కొన్ని పాటలను తెరకెక్కిస్తారని వినిపిస్తోంది. మరి ఇదే నిజమయితే, రాజమౌళి తన గురువు రాఘవేంద్రరావు బాటలోనే పయనిస్తూ ‘స్టూడియో అవసరం లేకుండా’ ఈ జంగిల్ మూవీని తెరకెక్కిస్తారేమో చూడాలి.
Also Read
- October Tollywood : టాలీవుడ్ బాక్సాఫీస్‌పై డబ్బింగ్ మూవీ దండయాత్ర!
- Ram Charan : RC 17 ప్రీ లుక్ పోస్టర్.. ఇదెక్కడ రచ్చ అయ్యా?
- Niharika Konidela : J.D. చక్రవర్తి కాళ్లు మొక్కిన నిహారిక కొణిదెల
- Pocket Rockets : విదేశీ చదువుల కోసం శ్రీలంకలో గ్యాంబ్లింగ్.. బస్తీ కుర్రాళ్ల జీవితాలతో ఆడుకున్న ఆ అందమైన అమ్మాయి ఎవరు?
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. పూర్తి ఆధిక్యంలో కూటమి!
-
Pawan Kalyan: ఎన్నికల పద్ధతి ఏదైనా.. ప్రజల మద్దతు కూటమికే.. పవన్ కీలక వ్యాఖ్యలు
-
Nara Lokesh: మున్సిపల్ ఎన్నికల విజయం మరింత పెద్ద బాధ్యత.. నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు
-
October Tollywood : టాలీవుడ్ బాక్సాఫీస్‌పై డబ్బింగ్ మూవీ దండయాత్ర!
-
MPTC, ZPTC ఎన్నికలకు భారీ పోలీస్ బందోబస్తు.. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ప్రకటన
-
US Strike on Iran: ఇరాన్ వైమానిక రక్షణ కేంద్రం ధ్వంసం.. ట్రంప్ కీలక ప్రకటన!
ట్రెండింగ్
-
Healthy Food Buying Tips : ప్యాకెట్‌పై ప్రోటీన్ అని ఉంటే నమ్మేస్తున్నారా? కొనేముందు ఈ 4 విషయాలు చూడండి
-
Zomato Host Mode : జొమాటోలో కొత్త ఫీచర్.. అతిథులకు ఫుడ్ ధరలు కనిపించవు
-
Bhai Dooj 2026: భాయి దూజ్ 2026.. అన్నదమ్ముల కోసం అక్కాచెల్లెళ్లు చేసే ఈ పూజ వెనుక కథ ఇదే.!
-
Cheesy Chicken Pasta Recipe: కేవలం 15 నిమిషాల్లో చీజీ చికెన్ పాస్తా.. ఇంట్లోనే సులభంగా చేసేయండి.!
-
Laundry Tips : హోటల్ టవల్స్ ఎప్పుడూ ఎందుకు మెత్తగానే ఉంటాయి.? ఈ చిన్న చిట్కాలే రహస్యం.!