ఎక్కడైతే దేవుడి హుండీ చోరీ జరిగింతే.. మళ్లీ అక్కడికే దేవుడి సొమ్ము వచ్చింది. ఈ సంఘటన చాలా విచిత్రంగా అనిపించినా.. ఇది నిజం.. పూర్తి వివరాల్లోకి వెళితే.. అనంతపురం జిల్లాలో విచిత్రమైన సంఘటన ఒకటి చోటుచేసుకుంది. నెల రోజుల క్రితం బుక్కరాయ సముద్రంలోని చెరువు కట్ట వద్ద ఉన్న ముసలమ్మ ఆలయంలో హుండీ చోరీ జరిగింది. ఆ హుండీలోని సొమ్మును తిరిగి యధా స్థానంలో పెట్టారు. దానితో పాటు అందులో ఓ లేఖ కూడా ఉండడం విశేషం. […]
అనంతరపురం జిల్లా సింగనమల టీడీపీలో వర్గ విభేదాలపై మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి పై గత కొద్దిరోజులుగా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. అనంతపురంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బండారు శ్రావణి చదువుకున్న ఎమ్మెల్యే…ఆమెకి అన్ని తెలుసని ఆయన అన్నారు.బండారు శ్రావణి ఫోటో పక్కన పెట్టి డబ్బులు ఎంచుతున్నాడని వీడియో వైరల్ చేస్తున్నారు.సింగనమలలో ప్రతిపక్ష పార్టీ నాయకుల గురించి మాట్లాడే ధైర్యం […]
తురకపాలెంలో మూడు నెలల్లో ముప్పై మంది చనిపోవడం బాధాకరమని.. ఈ విషయం సంచలనం సృష్టించిందని మాజీ మంత్రి అంబంటి రాంబాబు అన్నారు..ప్రకాశం జిల్లా, తాళ్ళూరు మండలం లోని ఒక రెవెన్యూయేతర గ్రామం తురకపాలెం. గ్రామాల్లో ప్రజలకు మూడు నెలల నుంచి జ్వరాలు రావడం, ఆసుపత్రిలో చేరడం, చనిపోవడం జరిగిందన్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే….ప్రకాశం జిల్లాలో ఏర్పాటు చేసిన సమావేశంలో అంబంటి రాంబాబు మాట్లాడుతూ.. ప్రకాశం జిల్లాలోని తురుకపాలెంలో మూడు నెలల నుంచి జ్వరాలతో ఆస్పత్రిలో చేరి జనాలు […]
కూటమి ప్రభుత్వం, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మోడీకి చంద్రబాబు సరెండర్ అయ్యారన్నారు కేఏ పాల్. ప్రేయర్ బుక్కులో అందరి పేర్లు రాసుకున్నానన్నారు. విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మాట్లాడుతూ.. మోడీకి చంద్రబాబు సరెండర్ అయ్యారు. చంద్రబాబు 120 సంవత్సరాలు బతుకుతాడట, నేను తలుచుకుంటే 125 రోజుల్లో పైకి పోతాడన్నారు. ప్రేయర్ బుక్కులో […]
నిమజ్జనం కోసం రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగిన ఘటన కాకినాడ జిల్లా పిఠాపురం మండలం బి.కొత్తూరులో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. పిఠాపురం మండలం బి. కొత్తూరులో వినాయక మండపాలు ఏర్పాటు చేసి.. పూజలు నిర్వహించారు. ఇంతవరకు బాగానే ఉంది. నిమజ్జనంనిమజ్జనం రూట్ విషయంలో రెండు సామాజిక వర్గాల మధ్య ఘర్షణ చోటు చేటుచేసుకుంది. ఈ ఘర్షణలో రెండు వర్గాల మధ్య మాటామాటా పెరిగి.. ఒకరిపై మరొకరు దాడులు చేసుకున్నారు. దీంతో స్వల్పంగా ఇరువర్గాల వారికి […]
విజయవాడ ఇంద్ర కీలాద్రి అమ్మవారి హుండీని లెక్కించారు ఆలయ సిబ్బంది. అమ్మవారి ఆలయంలో 31 రోజుల హుండీని లెక్కించారు. హుండీ లెక్కింపులో మొత్తం నగదు నాలుగు కోట్ల 57 లక్షల 31,258 రూపాయలు వచ్చినట్లు ఆలయ ఈఓ వెల్లడించారు. దీనిలో బంగారం 400 గ్రాములు, వెండి 7 కేజీల 650 గ్రాములు వచ్చింది. అంతే కాకుండా 14 దేశాల నుంచి విదేశీ కరెన్సీ కూడా హుండీలో లభ్యమైంది. పలు దేశాల విదేశీ కరెన్సీ 524 యూఎస్ఏ డాలర్లు, […]
అమరావతిలో మంత్రులతో భేటీ నిర్వహించారు సీఎం చంద్రబాబునాయుడు. సుగాలి ప్రీతి కేసును సీబీఐకి అప్పగించామని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. సుగాలి ప్రీతి కుటుంబానికి అండగా ఉన్నందుకు తనను టార్గెట్ చేస్తున్నారన్నారు డిప్యూడీ సీఎం పవన్ కళ్యాణ్. స్వార్థ రాజకీయాల కోసం చేసే విషప్రచారాన్ని ధీటుగా తిప్పికొడదామని పవన్ అన్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. యూరియాపై జరుగుతున్న దుష్ప్రచారంపైనా కేబినెట్ భేటీ తర్వాత.. మంత్రులతో చర్చించారు సీఎం చంద్రబాబు నాయుడు . ఎరువులకు ఇబ్బంది లేకున్నా.. వైసీపీ […]
విజయవాడ నుంచి బెంగళూరుకు ఫ్లైట్ కు తప్పిన పెను ప్రమాదం తప్పింది. ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ విమానాన్ని పక్షి ఢీకొట్టింది. టేకాఫ్ కు ముందే ఈ సంఘటన జరగడంతో అంతా సిబ్బంది అంతా అలర్టై ఒక్కసారిగా విమానాన్ని నిలిపివేశారు. టేకాఫ్ కు ముందే ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. విజయవాడ నుండి బెంగళూరుకు వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం పక్షి ఢీకొనడంతో రద్దు చేయబడింది. విమానం టేకాఫ్ కోసం […]
ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం మండలం జూపూడి గ్రామంలో భారీ పేలుడు సంభవించింది. భారీ పేలుడు పదార్ధాలు ఇంట్లో ఉండటం వల్ల బ్లాస్ట్ జరిగినట్లు సమాచారం. ప్రమాదంలో ఓ ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. బ్లాస్టింగ్ సమయంలో ఇంట్లో వెల్డింగ్ వర్క్ జరుగుతున్నట్లు చెబుతున్నారు స్థానికులు. ప్రమాదం లో తీవ్రంగా గాయపడిన ముగ్గురు వ్యక్తులు.. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని […]
విశాఖపట్నంలో గోవా గవర్నర్ పూసపాటి ఆశోక్ గజపతి రాజుకు ఘన సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చాలా సంవత్సరాలు ప్రభుత్వంలో మంత్రిగా పని చేశాను.విశాఖ లో ప్రజా ధనం తో కట్టిన ఋషి కొండ ప్యాలస్ పెచ్చులు ఉడిపోయాయి అని తెలిసింది.ఆ భవనం కోసం ఖర్చు పెట్టిన 600- 700 కోట్లు ఉంటే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి అయ్యేది అనుకునే వాడిని….ఈ ప్యాలస్ ఏం చెయ్యాలని ప్రభుత్వం ప్రజలను అడుగుతోంది…దానిని పిచ్చి ఆసుపత్రి చేస్తే […]