పాములంటే చాలా మందికి భయం. కొందరైతే పాము దూరంగా ఉన్నా కూడా అది తమవద్దకే వస్తుందనే భావనతో గజగజ వణుకుతూ ఉంటారు. పాము కాటు చాలా ప్రమాదకరం. కొన్ని విషపూరిత పాముల కాట్ల వల్ల తీవ్రమైన నొప్పి, రక్తంలో విషప్రభావం, అలాగే శరీర భాగాల్లో నెక్రోసిస్ ఏర్పడి ఆ భాగాన్ని తొలగించాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. అందుకే పాములంటే భయం సహజమే. పాములు వాతావరణాన్ని గుర్తించే అద్భుత శక్తి ఉంటుందని జంతు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.. ఇవి వాతావరణ […]
అమెరికాలోని వర్జీనియా రాష్ట్రంలో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. ఆష్లాండ్లోని ఒక మద్యం దుకాణంలో సీలింగ్ టైల్ విరిగి, అక్కడి నుంచి ఒక రకూన్ (కుందేలును పోలి ఉండే అడవి జంతువు) అకస్మాత్తుగా లోపలికి పడిపోయింది. ఘటన సమయంలో దుకాణం మూసి ఉండటంతో, భయపడిన రకూన్ అక్కడ ఉన్న స్కాచ్, విస్కీ వంటి మద్యం సీసాలను పగులగొట్టింది. పగిలిపోయిన సీసాలలో పారుతున్న మద్యం తాగిన రకూన్ మత్తులో దుకాణంలోని బాత్రూమ్కి వెళ్లి అక్కడే పడిపోయింది. మరుసటి ఉదయం […]
ఉత్తరప్రదేశ్‌లో ఓ విచిత్ర ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. పెళ్లి అయ్యి కేవలం 20 నిమిషాల్లోనే అత్తగారింటికి చేరుకున్న వధువు… తనకు విడాకులు కావాలని ప్రకటించింది. మొదట ఇది సరదాగా చేసిన వ్యాఖ్య అనుకుని, అక్కడున్నవాళ్లు నవ్వేశారు. కానీ వధువు మాటల్లో సీరియస్ కనిపించడంతో అందరూ అవాక్కయ్యారు. చివరకు పెద్దల సమక్షంలోనే విడాకులు కూడా జరిగిపోయాయి. పూర్తి వివరాల్లోకి వెళితే… డియోరియా జిల్లా భలౌని ప్రాంతానికి చెందిన విశాల్ మధేసియా, సాలెంపూర్‌కు చెందిన పూజతో నవంబర్ 25న […]
రైల్వేలో ప్రయాణం సౌకర్యవంతంగా, వేగంగా ఉండటంతో పాటు తక్కువ ఖర్చుతో జరుగుతుంది. అందువల్ల ఎక్కువ మంది రైళ్లలో ప్రయాణించడానికి ఆసక్తి చూపుతుంటారు. ప్రయాణికుల అవసరాలు, డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026 జనవరి 1 నుంచి నాన్–ఏసీ స్లీపర్ కోచ్‌లో ప్రయాణించే వారికి కూడా బెడ్షీట్లు, దిండ్లు అందించనున్నట్లు రైల్వే ప్రకటించింది. ఈ సౌకర్యం ఇప్పటివరకు ప్రధానంగా ఫస్ట్, సెకండ్, థర్డ్ ఏసీ కోచ్‌లలో మాత్రమే లభించేది.గరీబ్ రథ్ వంటి […]
డ్రై ఫ్రూట్స్‌ను రోజూ మితంగా తీసుకోవడం ఆరోగ్యానికి అనేక రకాలుగా ప్రయోజనం చేస్తుంది. ఇవి సహజంగా పోషకాలతో నిండిపోయి శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజ లవణాలు, మంచి కొవ్వులు, ప్రోటీన్‌ను అందిస్తాయి. న్యూట్రిషన్ల ప్రకారం, డ్రై ఫ్రూట్స్‌ను క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా అనేక వ్యాధులను దూరం ఉంచుకోవచ్చు. బాదం, వాల్నట్లో ఉన్న ఒమెగా–3 ఫ్యాటీ అసిడ్స్ హృదయాన్ని రక్షిస్తాయి.ఇవి చెడు కొలెస్ట్రాల్ (LDL)ను తగ్గించడంలో సహాయపడతాయి. వాల్నట్, బాదం మెదడు పనితీరు పెంచి, జ్ఞాపకశక్తి, దృష్టి […]
ఢిల్లీ మరియు గుజరాత్ వీధుల్లో కొత్త మొబిలిటీ విప్లవానికి శ్రీకారం చుట్టుతోంది. క్యాబ్ డ్రైవర్లకు నిజమైన యాజమాన్య హక్కులు కల్పించాలనే లక్ష్యంతో ‘భారత్ టాక్సీ’ రూపుదిద్దుకుంటోంది. ఓలా, ఉబర్ వంటి ప్రైవేట్ క్యాబ్ సంస్థలకు ప్రత్యామ్నాయంగా, దేశవ్యాప్తంగా డ్రైవర్లను ఆర్థికంగా సాధికారులను చేయడమే ఈ పథక ప్రధాన ఉద్దేశ్యం. ప్రస్తుతం భారత్ టాక్సీని ఢిల్లీ, గుజరాత్‌లోని సౌరాష్ట్ర ప్రాంతంలో సాఫ్ట్ లాంచ్ చేశారు. డ్రైవర్ల హక్కుల కోసం గళమెత్తే, ప్రపంచంలోనే తొలి జాతీయ మొబిలిటీ సహకార సంస్థగా […]
దేశంలో ప్రముఖ రైడ్-హైలింగ్ సర్వీసులలో ఒకటైన ఓలా క్యాబ్స్ కీలక మార్పులు చేసింది. మంగళవారం నుంచి నాన్–ఏసీ రైడ్స్‌ను అధికారికంగా ప్రారంభించింది. దేశంలో తొలిసారిగా ఈ సేవను అందిస్తున్న సంస్థగా ఓలా కంపెనీ గుర్తింపు పొందింది. ఈ కొత్త ఎంపికతో కస్టమర్లకు మరిన్ని ఆప్షన్లు లభిస్తాయని, ఇది వినియోగదారుల పట్ల తమ నిబద్ధతను ప్రతిబింబించే నిర్ణయమని యాజమాన్యం తెలిపింది. కంపెనీ ప్రతినిధుల వివరాల ప్రకారం, అర్బన్ ప్రాంతాల్లో నాన్–ఏసీ రైడ్స్ చాలా తక్కువ ధరలకు అందుబాటులో ఉండనున్నాయి. […]
కొంతమంది చలికాలంలో స్నానం చేయడానికి, ముఖం కడుక్కుందానికి కూడా వెనకాడుతారు. చలిని తట్టుకోలేక కావచ్చు, అలవాటు లేకపోవచ్చు. అయితే, ఇంకొందరు మాత్రం పళ్లు తోమడానికే కూడా వెనకడుతారు. కానీ ఇలా పళ్లు తోమకుండా ఉండడం వలన తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశముందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రతి రోజు మనం తినే ఆహారం 20 నిమిషాల్లోనే నోటిలో ఉన్న బ్యాక్టీరియా ద్వారా ఆమ్లంగా మారుతుందని డెంటిస్ట్ లు చెబుతున్నారు. ఈ ఆమ్లం దంతాల బయటి పొర […]
పానీపూరి తినేందుకు వెళ్లిన ఓ మహిళకు విచిత్ర అనుభవం ఎదురైంది. పానీపూరి తినేందుకు నోరు తెరిచిన మహిళ నోరు మూసుకోకుండా అలానే ఉండిపోయింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఔరయ్యా జిల్లాలో చోటుచేసుకుంది.పానీపూరి తింటున్న సమయంలో ఒక మహిళ తన నోరు మామూలుగా తెరిచింది.. ఈ క్రమంలో ఆమె దవడ అకస్మాత్తుగా లాక్ అయి, నోరు మూసుకోలేని పరిస్థితి ఏర్పడింది. పూర్తి వివరాల్లోకి వెళితే… ఔరయ్యాలోని ఒక పానీపూరి షాపుకు వచ్చిన మహిళ పూరి తినే సమయంలో నోటిని […]
ఇటీవల కొంత మంది యువత మద్యం మత్తులో ఎలా, ఎందుకు ప్రవర్తిస్తున్నారో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. పూర్తిగా తాగి రోడ్లపై రచ్చ చేస్తూ, చూసేవారికి ఇబ్బంది కలిగించే సంఘటనలు పెరుగుతున్నాయి. తాజాగా ఓ యువతి మద్యం మత్తులో నానా హంగామా చేసింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. హైదరాబాద్ జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని షాపూర్‌నగర్ చౌరస్తాలో ఓ యువతి మద్యం మత్తులో రచ్చ రచ్చ చేసింది. రోడ్డుమధ్యలో నిలబడి వాహనాలు […]