Health Risks : రెగ్యులర్ గా పళ్లు తోమకపోతే ఏమవుతుందో తెలుసా..
- పళ్లు తోమకపోతే తీవ్రమైన ఆరోగ్య సమస్యలు
- పళ్లు సరిగా తోమకపోతే గుండె జబ్బుల ప్రమాదం..
- మూడు రెట్లు పెరిగే అవకాశం ఉందన్న నిపుణులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొంతమంది చలికాలంలో స్నానం చేయడానికి, ముఖం కడుక్కుందానికి కూడా వెనకాడుతారు. చలిని తట్టుకోలేక కావచ్చు, అలవాటు లేకపోవచ్చు. అయితే, ఇంకొందరు మాత్రం పళ్లు తోమడానికే కూడా వెనకడుతారు. కానీ ఇలా పళ్లు తోమకుండా ఉండడం వలన తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశముందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ప్రతి రోజు మనం తినే ఆహారం 20 నిమిషాల్లోనే నోటిలో ఉన్న బ్యాక్టీరియా ద్వారా ఆమ్లంగా మారుతుందని డెంటిస్ట్ లు చెబుతున్నారు. ఈ ఆమ్లం దంతాల బయటి పొర అయిన ఎమినల్‌ను నెమ్మదిగా కరిగిస్తుందంటున్నారు. ఆహారం తీసుకున్న 4–6 గంటల్లోపే దంతాలపై ప్లాక్ అనే జిగట పొర ఏర్పడుతుంది. ఇది 12 గంటల తర్వాత గట్టిపడి టార్టర్ గా మారుతుందని.. దీంతో 24 గంటల తర్వాత చిగుళ్లు ఉబ్బడం, రక్తస్రావం కావడం, నోటి నుంచి దుర్వాసన రావడం ప్రారంభమవుతాయని వెల్లడించారు. ఒక్క రోజు కూడా పళ్లు తోమకపోతే నోటిలో ఒక మిలియన్‌కు పైగా బ్యాక్టీరియా పెరుగుతాయని వైద్యులు చెబుతున్నారు.
Also Read
- Bats: గబ్బిలాల శరీరంలో దాగిన భయంకర రహస్యం..!
- Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
- Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే 'రాగి మునగాకు రొట్టె' చేసేయండి ఇలా.!
- Beetroot Pachadi: బీట్‌రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
నిరంతరం పళ్లు తోమకపోతే దీర్ఘకాలంలో తీవ్రమైన ఆరోగ్య సమస్యలు రావచ్చని డెంటిస్ట్ లు చెబుతున్నారు.. ఒక అధ్యయనం ప్రకారం రోజూ పళ్లు తోమని వ్యక్తులకు వివిధ ఆరోగ్య సమస్యల ప్రమాదం సుమారు 25 శాతం ఎక్కువగా ఉంటుంది. ఒక సంవత్సరం పాటు పళ్లు సరిగా తోమకపోతే గుండె జబ్బుల ప్రమాదం మూడు రెట్లు పెరిగే అవకాశం ఉందని డెంటిస్టులు హెచ్చరిస్తున్నారు. నోటిలో పెరిగే బ్యాక్టీరియా ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లు, న్యుమోనియా వంటి వ్యాధులకు కూడా దారితీయవచ్చని వారు చెబుతున్నారు.
పొగాకు వాడకపోయనా పళ్లు తోముకోకుండా ఉండే వారికి నోటి క్యాన్సర్ ప్రమాదం కూడా కొంతవరకు ఉంటుందని నిపుణులు అంటున్నారు. సంవత్సరం పాటు పళ్లు తోమకుండా ఉంటే, దంతాలు తీవ్రమైన కుళ్ళు, కుహరాలు, పుండ్లు, అధిక నొప్పి వంటి సమస్యలు ఎదురవుతాయి. ఇది చిగుళ్ల వ్యాధికి కారణమై, చివరికి పళ్లు వదులై ఊడిపోయే ప్రమాదం ఉంది.అందుకే డెంటిస్ట్‌లు ప్రతిరోజూ రోజుకు రెండు సార్లు పళ్లు తోముకోవడం తప్పనిసరి అని సూచిస్తున్నారు. ఇది నోటి ఆరోగ్యానికే కాకుండా, మొత్తం శరీర ఆరోగ్యాన్ని కాపాడటంలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ఈ సమాచారం అంతా ఇంటర్నెట్ నుంచి గ్రహించాం. మీకు ఏదైనా సందేహాలు ఉంటే డెంటిస్ట్ ని కలిసి సలహా తీసుకోవడం మంచిది.
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!