గత నెల 27న కుప్పంలో టీడీపీ ఆధ్వర్యంలో లోకేష్ ‘యువగళం’ పాద్రయాత్రను ప్రారంభించారు. ఈ యాత్రలో పాల్గొన్న తారకరత్న గుండెపోటుకు గురై 22 రోజుల పాటు మరణంతో పోరాడి శనివారం సాయంత్రం కన్నుమూశారు. ఈరోజు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అభిమానులు, ఇండస్ట్రీ వర్గాల సందర్శనార్థం తారకరత్న పార్థివదేహాన్ని ఫిల్మ్ ఛాంబర్ లో ఉంచారు. నందమూరి తారకరత్న భౌతికకాయానికి నివాళులు అర్పించిన హీరో తరుణ్, తారకరత్నతో తనకి ఉన్న ఫ్రెండ్షిప్ ని గుర్తు చేసుకోని ఎమోషనల్ అయ్యాడు. “చిన్నప్పటి నుంచి […]
మోస్ట్ టాలెంటెడ్ ఇండియన్ హీరోస్ అనే లిస్టు తీస్తే అందులో ధనుష్ పేరు టాప్ 5లో ఉంటుంది. రెండు సార్లు నేషనల్ అవార్డ్ అందుకున్న ధనుష్, తెలుగు-తమిళ భాషల్లో చేసిన మొదటి బైలింగ్వల్ మూవీ ‘సార్/వాతి’. వెంకీ అట్లూరి డైరెక్ట్ చేసిన ఈ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్ ప్రొడ్యూస్ చేసింది. సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించిన సార్ సినిమాకి జీవీ ప్రకాష్ ఇచ్చిన మ్యూజిక్, సార్ సినిమాపై అంచనాలని మరింత పెంచింది. మిగిలిన తమిళ స్టార్ […]
మార్చ్ నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ కోసం సెట్స్ పైకి వెళ్లాల్సిన ఎన్టీఆర్-కొరటాల శివ సినిమా ఓపెనింగ్ సెరిమొని ఈ ఫిబ్రవరి 24న జరగాల్సి ఉంది. అఫీషియల్ అనౌన్స్మెంట్ రావడమే లేట్ అనుకుంటున్న సమయంలో ఎన్టీఆర్ 30 ఓపెనింగ్ సెరిమొనిని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. నందమూరి తారకరత్న మరణించడంతో ఎన్టీఆర్ 30 సినిమా పూజా కార్యక్రమాలని పోస్ట్ పోన్ చేశారు. కొత్త డేట్ త్వరలో అనౌన్స్ చేస్తామంటూ పీఆర్వో వంశీ కాకా ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఎన్టీఆర్, […]
నందమూరి తారకరత్న మరణవార్త రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలని కలచివేస్తుంది. 39 ఏళ్లకే మరణించిన తారకరత్న భౌతికకాయానికి నివాళులు అర్పించడానికి వచ్చిన ప్రతి ఒక్కరూ, తారకరత్న ఎంతో మంచి వాడు, అతని మరణం బాధాకరం అని మాట్లాడుతున్నారు. ఇంతమంచి వ్యక్తి మరణిస్తే, ప్రతి ఒక్కరినీ అతని మరణం బాధిస్తూ ఉంటే తారకరత్న తల్లిదండ్రులు మాత్రం మృతదేహాన్ని చూసేందుకు మోకిలకి కూడా రాలేదు. బాలయ్యనే చిన్న తండ్రి హోదాలో నిలబడి తారకరత్న అంత్యక్రియ కార్యక్రమాలని చూసుకుంటున్నాడు. అభిమానుల సందర్శనార్ధం తారకరత్న […]
23 రోజుల పాటు మరణంతో పోరాడి 39 ఏళ్లకే తుదిశ్వాస విడిచారు నందమూరి తారకరత్న. అభిమానులు, ఇండస్ట్రీ వర్గాల సందర్శనార్ధం తారకరత్న భౌతికకాయాన్ని ఫిల్మ్ ఛాంబర్ లో ఉంచారు. తారకరత్నకి నివాళులు అర్పించిన దర్శకుడు అనీల్ రావిపూడి… “తారకరత్న ఇంత చిన్న వయసులో మరణించడం బాధాకరం. #NBK108 సినిమాలో తారకరత్నకి మంచి పాత్రని ఇవ్వాలని బాలయ్య అడిగారు. మేము తారకరత్నతో మంచి పాత్ర చేయించాలి అని నిర్ణయం తీసుకోని రెడీ అవుతున్న సమయంలో ఇలాంటి సంఘటన జరిగింది” […]
సెలబ్రిటీ క్రికెట్ లీగ్ లో తెలుగు వారియర్స్ తరపున స్టార్ ప్లేయర్, మంచి ఓపెనింగ్ బ్యాట్స్ మాన్ అయిన నందమూరి తారకరత్న మరణించడంతో, నివాళులు అర్పించడానికి ఫిల్మ్ ఛాంబర్ వచ్చిన దగ్గుబాటి వెంకటేష్, తారకరత్నతో తనకి ఉన్న అనుబంధాన్ని మీడియాతో పంచుకున్నారు. “తారకరత్న అందరితో చాలా ప్రేమగా ఉండే వాడు, అతన్ని మేము మిస్ అవుతున్నాం. ఇది చాలా బాధాకరమైన విషయం. సెలబ్రిటీ క్రికెట్ సమయంలో తారకరత్నతో మంచి అనుభందం ఉండేది” అని వెంకటేష్ మాట్లాడారు.
39 ఏళ్లకే తుదిశ్వాస విడిచిన తారకరత్న భౌతికకాయానికి నివాళులు అర్పించిన సీనియర్ నటుడు బెనర్జీ, తారకరత్నతో తనకున్న బంధం గురించి మాట్లాడుతూ… “అంత మంచి నటుడు ఇలా చిన్న వయసులోనే మరణించడం భాధాకరం. ఆ భగవంతుడు తారకరత్నకి చాలా అన్యాయం చేశాడు. ఇటివలే 9 అవర్స్ వెబ్ సీరీస్ మేమిద్దరం కలిసి వర్క్ చేసాం. ఆ సమయంలో తారకరత్న బాబాయ్, బాబాయ్ అంటూ ప్రేమగా మాట్లాడే వాడు. నాన్న, నువ్వు మా మనసులో ఎప్పటికీ ఉంటావు” అని […]
నందమూరి తారకరత్న అకాల మరణం తెలుగు దేశం పార్టీ కార్యకర్తలని, నందమూరి అభిమానులని, సినిమా వర్గాలని దిగ్భ్రాంతికి గురి చేసింది. 23 రోజులపాటు మృత్యువుతో పోరాడి శనివారం నాడు తుది శ్వాస విడిచిన తారకరత్న భౌతికకాయాన్ని ఫిల్మ్ ఛాంబర్ లో అభిమానుల సందర్శనార్ధం ఉంచారు. ఈ కార్యక్రమాలని నందమూరి బాలకృష్ణ అన్నీ తానై చూసుకుంటున్నాడు. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు ఫ్యామిలీతో పాటు తారకరత్న భౌతికకాయానికి నివాళులు అర్పించారు. కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ లు తారకరత్న భౌతికకాయాన్ని […]
నందమూరి తారకరత్న భౌతికకాయాన్ని అభిమానులు, ఇండస్ట్రీ వర్గాల సందర్శనార్ధం ఫిల్మ్ ఛాంబర్ లో పెట్టారు. కార్డియాక్ అరెస్ట్ తో కుప్పకూలిన తారకరత్నని హాస్పిటల్ లో చేర్చినప్పటి నుంచి బాలయ్య అన్నీ తానై చూసుకుంటున్నాడు. హాస్పిటల్ దగ్గర ఉండే తారకరత్న ఆరోగ్య పరిస్థితులు తెలుసుకుంటూ, నిరంతరం అక్కడే ఉన్నాడు బాలయ్య. 23 రోజుల పోరాటం తర్వాత మరణించిన తారకరత్న ఆఖరి కార్యక్రమాలని కూడా బాలయ్య దగ్గర ఉండి చూసుకుంటున్నాడు. మోకిల నుంచి ఫిల్మ్ ఛాంబర్ ని తారకరత్న భౌతికకాయాన్ని […]
కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర నెవర్ బిఫోర్ బాక్సాఫీస్ ర్యాంపేజ్ ని చూపిస్తున్నాడు. యష్ రాజ్ ఫిల్మ్స్ ‘స్పై యూనివర్స్’లో భాగంగా షారుఖ్, ‘పఠాన్’ సినిమాతో జనవరి 25న ఆడియన్స్ ముందుకి వచ్చాడు. ఆల్ ఎగ్జిస్టింగ్ రికార్డ్స్ ని బ్రేక్ చేస్తూ పఠాన్ మూవీ వెయ్యి కోట్లకి చేరువలో ఉంది. మరో రెడ్ను రోజుల్లో ఈ మూవీ వెయ్యి కోట్ల మార్క్ ని టచ్ చెయ్యడానికి రెడీ ఉంది. మూడు వారాలుగా బాలీవుడ్ […]