India U19 won by 201 runs vs Ireland U19: ఐసీసీ అండర్-19 ప్రపంచకప్ 2024లో యువ టీమిండియా మరో విజయం సాధించింది. బ్లూమ్‌ఫోంటైన్ వేదికగా గురువారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 201 పరుగుల భారీ తేడాతో ఐర్లాండ్‌ను చిత్తు చేసింది. భారీ లక్ష్య ఛేదనలో నమన్ తివారి (4/53), సౌమి పాండే (3/21) చెలరేగడంతో ఐర్లాండ్ 29.4 ఓవర్లలో 100 పరుగులకే ఆలౌట్ అయింది. ప్రపంచకప్‌లో భారత్‌కు వరుసగా రెండో విజయం. సెంచరీ చేసిన […]
ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రచారం గురించి ఇప్పుడే పట్టించుకోవటం లేదని, ప్రజలకు పథకాలు అందించే విషయం పైనే ఫోకస్ పెట్టారని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. 31 లక్షల మంది మహిళలకు ఇళ్ల స్థలాలు ఇవ్వటం ఎవరి ఊహకు కూడా అందని విషయమని, గతంలో ఇలాంటివి జరిగాయా? అని ప్రశ్నించారు. సీఎం వ్యవస్థల్లో మార్పులు తీసుకుని వచ్చారని, పారదర్శకంగా పథకాలు అందుతున్నాయన్నారు. 2024 ఎన్నికలకు జనవరి 27 నుంచి భీమిలి నుంచి […]
అసంతృప్తితో సీఎం వైఎస్ జగన్‌ను వదిలిపెట్టి వెళ్లే వారి వల్ల ఆయనకు ఏం నష్టం జరగదని మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. మా పార్టీ నుంచి బయటకు వెళ్లి.. మా ప్రత్యర్థి చంద్రబాబుతో చేతులు కలిపి కాంగ్రెస్‌కు వైఎస్ షర్మిల పనిచేస్తున్నారని అందరికీ తెలుసన్నారు. మా ప్రభుత్వం నచ్చక ఆమె మాట్లాడుతుందని, ఎవరైనా ఆమె మాటలు నమ్మతారా? అని ప్రశ్నించారు. భావితరాల కోసం పనిచేసే విజనరీ ఉన్న నాయకుడు సీఎం జగన్ అని, తనకు ఓటేయాలని ధైర్యంగా […]
టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా లోకేష్ ఖాళీగా ఉండి ట్వీట్లు పెడుతున్నారని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. 70 రోజుల్లో ఎవరు మ్యాకప్పో.. ఎవరు ప్యాకప్పో తెలుస్తుందని ఎద్దేవా చేశారు. పాదయాత్ర చేసి శ్రీకాకుళం రాకుండానే లోకేష్ ప్యాకప్ అయిపోయాడని బొత్స అన్నారు. ప్రజలు ఏదీ మరిచిపోరని, మరో డెబ్బై రోజుల్లో వారే సరైన సమాదానం చెబుతారని మంత్రి బొత్స పేర్కొన్నారు. పార్టీ కీలక సభ్యులతో సమావేశం ఏర్పాటు చేస్తున్నామని, ఉత్తరాంధ్ర ప్రాంతానికి తగరపువలసలో సీఎం […]
Vangalapudi Anitha Slams Minister Roja: వైసీపీ మంత్రి రోజాకు టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని, దమ్ముంటే ఏ తప్పు చేయలేదని ఏ గుడిలోనైనా రోజా ప్రమాణం చేయాలని ఛాలెంజ్ విసిరారు. అవినీతి తోటలో రోజా పువ్వులు విరబోస్తున్నాయని వంగలపూడి అనిత విమర్శించారు. మంత్రి రోజా అవినీతిని నగరి వైసీపీ నేతలే కథలు కథలుగా చెబుతున్నారన్నారు. జగనన్న బాణం తిరిగి వైసీపీకే గుచ్చుకుంటుందని అనిత […]
Two Children died after eating Panipuri in Eluru: ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో విషాదం చోటు చేసుకుంది. పానీపూరీ తిన్న ఇద్దరు అన్నదమ్ములు అస్వస్థతకు గురై మృత్యువాత పడ్డారు. బుధవారం రాత్రి పానీపూరీ తిని కడుపునొప్పితో బాధపడుతున్న ఇద్దరు చిన్నారులను కుటుంబసభ్యులు ప్రైవేట్ ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలోనే చనిపోయారు. చనిపోయిన ఇద్దరు అన్నదమ్ములు వెలపాటి రామకృష్ణ (10), వెలపాటి విజయ్ (6). జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రి మార్చరీలో మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. Also Read: […]
YCP MLA Jakkampudi Raja Comments on CM YS Jagan: అధిష్టానం ఆదేశిస్తే తాను రాజమండ్రి ఎంపీగా పోటీ చేస్తా అని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అన్నారు. అధిష్టానం నుంచి ఎటువంటి ప్రతిపాదన లేదని, రాజమండ్రి పార్లమెంట్ టికెట్ కాపులకు ఇవ్వాలని భావిస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశిస్తే ఎక్కడి నుంచి అయినా తాను పోటీకి సిద్ధం అని జక్కంపూడి రాజా తెలిపారు. నా రాజకీయ భవితవ్యం సీఎం జగన్ చేతుల్లోనే […]
Mary Kom React on Retirement News: భారత దిగ్గజ బాక్సర్, ఆరుసార్లు ప్రపంచ ఛాంపియన్ మేరీ కోమ్ బుధవారం జరిగిన ఓ స్కూల్ ఈవెంట్లో చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. మేరీ కోమ్ ఆట నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నారంటూ వార్తలు వచ్చాయి. వీటిని ఆమె గురువారం స్పందించారు. తాను రిటైర్మెంట్ ప్రకటించలేదని స్పష్టం చేశారు. తాను ఇప్పుడే బాక్సింగ్‌ను వీడబోనని, పోటీలో కొనసాగేందుకు ఫిట్‌నెస్‌పై దృష్టి పెడుతున్నట్లు మేరీ కోమ్ తెలిపారు. బుధవారం అస్సాంలోని […]
రాష్ట్రం కోసం, భావితరాల భవిష్యత్తు కోసం భూమిని త్యాగం చేసిన రైతులకు న్యాయం జరుగుతుందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. కుట్రలు, కుతంత్రాలు, కుయుక్తులకు ఎదురొడ్డి అమరావతి నిలబడిందన్నారు. అమరావతి కోసం పోరాడుతూ ప్రాణాలు కోల్పోయిన వారికి ఆయన నివాళులర్పించారు. అమరావతి పరిరక్షణకు రాజధాని రైతులు చేపట్టిన ఉద్యమం గురువారంతో 1500 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా నారా లోకేశ్ తన ఎక్స్ ద్వారా స్పందించారు. ‘కుట్రలు, కుతంత్రాలు, కుయుక్తులకు ఎదురొడ్డి […]
దర్శన టికెట్లు ఉన్న భక్తులకే తిరుమలలో గదులు: ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి కొండపై వసతి గదులకు సంబంధించి టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ నెలకు సంబంధించి శ్రీవారి దర్శన టికెట్లు పొందిన భక్తులకు మాత్రమే.. మొదటిసారిగా వసతి గదుల కేటాయింపును ఆన్లైన్లో చేపట్టింది. దర్శన టికెట్లు ఉన్న భక్తులకు మాత్రమే గదులు ఇవ్వడం ద్వారా.. భక్తుల రద్దీని కాస్త తగ్గించొచ్చని టీటీడీ భావిస్తోంది. శ్రీవారి ఆర్జిత సేవలు, లక్కీడిప్, వృద్ధులు, దివ్యాంగులు, శ్రీవాణి […]