Virat Kohli: ఆ అవార్డుకు విరాట్ కోహ్లీ అనర్హుడు.. టీమిండియా మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు!
- 59 బంతుల్లో 76 రన్స్
- కోహ్లీ నెమ్మదైన బ్యాటింగ్ వల్లే
- అవార్డుకు కోహ్లీ అనర్హుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sanjay Manjrekar Says India Bowlers Deserve for Player of the Match Award: దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించి.. విశ్వవిజేతగా నిలిచిన విషయం తెలిసిందే. అయితే దక్షిణాఫ్రికాపై విజయం టీమిండియాకు అంత ఈజీగా దక్కలేదు. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా గెలవడానికి 30 బంతుల్లో 30 పరుగులు మాత్రమే అవసరమయిన సమయంలో జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, అర్ష్‌దీప్ సింగ్‌ల అద్భుత బౌలింగ్‌తో భారత్ గట్టెక్కింది. ఫైనల్లో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు 59 బంతుల్లో 76 రన్స్ చేసిన విరాట్ కోహ్లీకి దక్కింది. కోహ్లీకి ఈ అవార్డు దక్కడాన్ని టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ తప్పుబట్టాడు.
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుకు విరాట్ కోహ్లీ అనర్హుడు అని సంజయ్ మంజ్రేకర్ పేర్కొన్నాడు. అవార్డును కోహ్లీకి బదులు బౌలర్లకు ఇవ్వాల్సిందని అభిప్రాయపడ్డాడు. ఈఎస్‌పీఎన్-క్రిక్‌ఇన్ఫోలో సంజయ్ మంజ్రేకర్ మాట్లాడుతూ… ‘విరాట్ కోహ్లీ స్లో ఇన్నింగ్స్ కారణంగా విధ్వంసకర బ్యాటర్లలో ఒకడైన హార్దిక్ పాండ్యాకు ఎక్కువ బంతులు ఎదుర్కొనే అవకాశం రాలేదు. హార్దిక్ కేవలం రెండు బంతులు మాత్రమే ఆడాడు. భారత్ బ్యాటింగ్ బాగుంది కానీ.. కోహ్లీ నెమ్మదైన బ్యాటింగ్ వల్లే భారత్ ఉత్కంఠ పరిస్థితులను ఎదుర్కొంది. కోహ్లీని బౌలర్లే కాపాడారు’ అని అన్నాడు.
Also Read
- Smriti Mandhana: బాలల హక్కుల కోసం స్మృతి మంధాన ముందడుగు.. ఆహ్వానించిన సచిన్ టెండూల్కర్..
- Pakistan: పాకిస్తాన్లో అరాచక పాలన.. ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.!
- Abhijeet Dipke: ‘‘సంతకం చేయలేదు, మళ్లీ వీధుల్లోకి వస్తాం’’.. CJP దీప్కే సంచలన ప్రకటన.!
- Bangladesh: షేక్ హసీనాను గద్దె దించిన బంగ్లాదేశ్ నేత.. ఇప్పుడు CJP నిరసనలకు మద్దతు.!
Also Read: Rohit Shama Soil: అందుకే మట్టిని తిన్నా: రోహిత్ శర్మ
‘ఓ దశలో భారత్ ఓడిపోయే స్థితిలో నిలిచింది. అప్పుడు 90 శాతం విజయావకాశాలు దక్షిణాఫ్రికాకే ఉన్నాయి. భారత బౌలర్లు మ్యాచును మలుపుతిప్పారు. వాస్తవానికి విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్‌ను కాపాడింది బౌలర్లే. విరాట్ 128 స్ట్రైక్ రేట్‌తో సగం ఇన్నింగ్స్‌ను ఆడాడు. నా అభిప్రాయం ప్రకారం ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ బౌలర్‌కు ఇవ్వాల్సింది. ఎందుకంటే వారే భారత జట్టును గెలిపించారు’ అని సంజయ్ మంజ్రేకర్ పేర్కొన్నాడు.
తాజావార్తలు
-
Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
-
Smriti Mandhana: బాలల హక్కుల కోసం స్మృతి మంధాన ముందడుగు.. ఆహ్వానించిన సచిన్ టెండూల్కర్..
-
Pakistan: పాకిస్తాన్లో అరాచక పాలన.. ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.!
-
Rajinikanth: బాషా 2.. పేట 2 వద్దని.. జైలర్ 2కి తలైవా ఎందుకు ఒప్పుకున్నారు?
-
Indigo : పవర్ బ్యాంక్‌లో మంటలు.. శంషాబాద్‌లో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..