RCB vs LSG: లక్నో ‘సూపర్ ఫాస్ట్’ వచ్చేశాడు.. ఇక ఆర్‌సీబీకి దబిడిదిబిడే!
- చిన్నస్వామి స్టేడియంలో ఆర్‌సీబీ vs ఎల్ఎస్‌జీ మ్యాచ్
- లక్నో 'సూపర్ ఫాస్ట్' వచ్చేశాడు
- ఇక ఆర్‌సీబీకి దబిడిదిబిడే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mayank Yadav Set To Play RCB vs LSG Clash in IPL 2026: లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్‌జీ) ‘సూపర్ ఫాస్ట్’ బౌలర్ మయాంక్ యాదవ్ ఐపీఎల్ 2026లో ఆడేందుకు సిద్దమయ్యాడు. ఈరోజు ఎం చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ)తో జరిగే మ్యాచ్‌కు మయాంక్ అందుబాటులో ఉండనున్నాడు. ఈ విషయాన్ని ఎల్ఎస్‌జీ డైరెక్టర్ టామ్ మూడీ మంగళవారం మీడియాకు తెలిపారు. మయాంక్ పూర్తి ఫిట్‌నెస్ సాధించాడని, ఆర్‌సీబీతో మ్యాచ్ ఆడేందుకు సిద్ధంగా ఉన్నాడని టామ్ మూడీ చెప్పారు. విషయం తెలిసిన ఎల్ఎస్‌జీ ఫాన్స్ ‘ఆర్‌సీబీకి దబిడిదిబిడే’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఐపీఎల్ 2025 సీజన్‌లో గాయంతో ఇబ్బందులు ఎదుర్కొన్న మయాంక్ యాదవ్ కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. 2025 మే 4 తర్వాత అతడు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. గత కొన్ని నెలలుగా జట్టు మెడికల్ టీమ్ పర్యవేక్షణలో రిహాబిలిటేషన్ పూర్తి చేసి.. ఇప్పుడు మ్యాచ్‌లు ఆడేందుకు సిద్ధమయ్యాడు. ఐపీఎల్ 2026 ఆరంభంలో పూర్తిస్థాయి ఫిట్‌నెస్ లేకపోవడంతో మయాంక్‌ను తుది జట్టులోకి తీసుకోలేదు. ప్రస్తుతం అతడు పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నాడు. ఆర్‌సీబీతో మ్యాచ్‌లో మయాంక్ బౌలింగ్ చేయనున్నాడు. ఐపీఎల్‌లో మయాంక్ ఇప్పటివరకు 6 మ్యాచ్‌లు ఆడి 9 వికెట్స్ పడగొట్టాడు. 2024 నుంచి జట్టులో ఉన్నా.. గాయాల కారణంగా ఎక్కువగా మ్యాచ్‌లు ఆడలేదు.
Also Read
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
Also Read: Anshul Kamboj-CSK: అన్షుల్ అదరహో.. సీఎస్‌కేకు బిగ్ మ్యాచ్ విన్నర్‌గా యువ సంచలనం!
మయాంక్ యాదవ్‌తో పాటు మరో పేసర్ మొహ్సిన్ ఖాన్ కూడా గాయం నుంచి కోలుకుని జట్టులో చేరడానికి సిద్ధంగా ఉన్నాడు. మొహ్సిన్ మ్యాచ్ ఫిట్‌నెస్ కోసం తుది పరీక్ష జరగాల్సి ఉంది. ఈరోజు జరిగే పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తే.. అతను కూడా జట్టు ఎంపికకు అందుబాటులోకి వస్తాడు. ఈ ఇద్దరి రీఎంట్రీతో లక్నో బౌలింగ్ దళం మరింత బలపడనుంది. ఈ సీజన్‌లో వీరిద్దరి గైహాజరీలో మహమ్మద్ షమీ బౌలింగ్ బాధ్యతను మోస్తున్నాడు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉన్న లక్నో.. మూడో స్థానంలో ఉన్న ఆర్‌సీబీని ఓడించి తిరిగి ఫామ్‌లోకి రావాలని చూస్తోంది. మయాంక్ రీఎంట్రీతో ఎల్ఎస్‌జీ ఆశలు మరింత పెరిగాయి. ఆర్‌సీబీ మ్యాచ్‌లో అతడి ప్రదర్శన ఎలా ఉంటుందో చూడాలి.
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్‌సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!