Ruturaj Gaikwad: సాకులు చెప్పను.. గెలిచినా మేం ఇంకా మెరుగుపడాలి!
- 32 పరుగుల తేడాతో కోల్‌కతాపై చెన్నై విజయం
- బౌలింగ్‌లో ప్లాన్‌లు పనికొచ్చాయి
- ఇంకా మెరుగుపడాల్సిన అవసరం ఉంది
- నా ఫామ్ గురించి ఆందోళన అవసరం లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) మరో విజయాన్ని అందుకుంది. మంగళవారం కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే 32 పరుగుల తేడాతో గెలిచింది. హ్యాట్రిక్ ఓటముల అనంతరం వరుసగా రెండు మ్యాచుల్లోనూ గెలిచి పాయింట్ల పట్టికలో కాస్త పైకి వచ్చింది. ఈ విజయంపై సీఎస్‌కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఆనందం వ్యక్తం చేశాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. పిచ్ పరిస్థితులు మారడం వల్ల తాము లక్ష్యాన్ని సరిగ్గా అంచనా వేసి బౌలింగ్‌లో ప్లాన్‌ను అమలు చేశామని చెప్పాడు. ఫీల్డింగ్‌కు సంబంధించి ఎలాంటి సాకులు చెప్పనని, ఇంకా మెరుగుపడాల్సిన అవసరం ఉందని రుతురాజ్ స్పష్టం చేశాడు.
సీఎస్‌కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మాట్లాడుతూ… ‘నిజం చెప్పాలంటే ఈ విజయంతో చాలా సంతోషంగా ఉన్నాం. ఒక మంచి స్కోర్‌ను డిఫెండ్ చేయగలిగాం. పిచ్ పరిస్థితులను బట్టి చూస్తే అది మంచి స్కోర్ అనిపించింది. మొదటి 7-8 ఓవర్ల తర్వాత వికెట్ పూర్తిగా మారిపోయింది. స్పిన్ అవ్వడం మొదలైంది, బంతి ఆగిపోవడం కూడా ఆగిపోయింది. మొదట మేము 220 లేదా 210 స్కోర్ లక్ష్యంగా పెట్టుకున్నాం. కానీ తర్వాత 190-180 స్కోర్ కూడా సరిపోతుందని భావించాం. పవర్‌ప్లేలో బాగా బౌలింగ్ చేయాలనుకున్నాం. ఆ తర్వాత రన్‌రేట్‌ను కంట్రోల్‌లో ఉంచడమే లక్ష్యంగా ముందుకు సాగాం’ అని చెప్పాడు.
Also Read
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
Also Read: RCB vs LSG: లక్నో ‘సూపర్ ఫాస్ట్’ వచ్చేశాడు.. ఇక ఆర్‌సీబీకి దబిడిదిబిడే!
‘మా బౌలింగ్ బాగుంది. మెల్లగా జట్టు సమన్వయం మెరుగుపడుతోంది. ప్రతి ఆటగాడికి తన పాత్ర స్పష్టంగా తెలిసింది. ఏ ఓవర్లు వేయాలి, ఏ లెంగ్త్‌లో బౌలింగ్ చేయాలన్నది తెలుసుకున్నారు. జట్టు అవసరాలకు అనుగుణంగా ఆటగాళ్లు అలవాటు పడుతున్నారు. జట్టు క్రమంగా మెరుగుపడుతోంది. ఇది మంచి సూచన. బ్యాటింగ్‌లో అవసరం ఉంటే వీర్‌ను ఉపయోగించాలని అనుకున్నాం. బ్యాటింగ్ బాగా చేశాం కాబట్టి రెండో ఇన్నింగ్స్‌లో పవర్‌ప్లే బౌలర్‌గా అకీల్‌ను తీసుకొచ్చాం. మధ్యలో ఇద్దరు రైట్ హ్యాండర్లు ఉన్నా.. మంచి ఓవర్లు వేశాడు. నూర్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఫీల్డింగ్‌లో చాలా క్యాచ్‌లు మిస్ అయ్యాయి. ఒకటి రెండు మాత్రమే పట్టుకున్నాం. ఈరోజు వాతావరణం కొంచెం తేమగా ఉంది, చేతులకు చెమట ఎక్కువగా వచ్చింది. ఇది సాకుగా చెప్పలేను. ఫీల్డింగ్‌లో బాగా మెరుగవ్వాల్సిన అవసరం ఉంది. నా ఫామ్ పైన ఎలాంటి ఆందోళన లేదు. ఫిట్‌నెస్, మానసికంగా బాగున్నా. ఒకే ఒక్క పెద్ద ఇన్నింగ్స్ ఆడితే అన్నీ కుదురుకుంటాయి. జట్టులోని ఇతర ఆటగాళ్లు బాగా ఆడుతున్నారు’ అని రుతురాజ్ చెప్పుకొచ్చాడు.
తాజావార్తలు
-
Virat Kohli: ఎన్నడూ ఇలా లేడు.. ఇక విరాట్ కోహ్లీని ఎవరూ టచ్ చేయలేరు: కైఫ్
-
Gyanesh Kumar: సీఈసీ జ్ఞానేష్ కుమార్ చుట్టూ బిగిస్తున్న ఉచ్చు.. మరోసారి విపక్షాల భారీ ప్లాన్..!
-
YS Jagan: నేడు ఒంగోలుకు వైఎస్ జగన్.. కాకుమాను రాజశేఖర్ కుటుంబానికి పరామర్శ
-
Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ ‘వెజ్ కీమా’.. సులువుగా చేసేయండి ఇంట్లో.!
-
Amaravati – Krishna River: అమరావతికి గుడ్‌న్యూస్.. కృష్ణా నది కరకట్ట పనులకు గ్రీన్ సిగ్నల్
ట్రెండింగ్
-
Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
-
100W ఛార్జింగ్, 200MP ARRI కెమెరా, 8,800mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ HONOR Magic9 Pro Max లాంచ్.!
-
ARRI టెక్నాలజీ, 200MP+200MP కెమెరాలు, 8,000mAh భారీ బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్లతో HONOR Magic 9 లాంచ్.!
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!