యాపిల్ ‘ఐఫోన్’కు అంత డబ్బు పెట్టడం ఎందుకని చాలామంది ఆలోచించడం సర్వసాధారణం. అందుకే సామాన్య జనాలు పాత మోడళ్ల వైపు మొగ్గు చూపుతారు. తక్కువ ధరకు వాటిని కొనుగోలు ఎదురుచూస్తుంటారు. అందులోనూ పాత, కొత్త మోడళ్లు దాదాపు ఒకే ధరకు అందుబాటులో ఉంటే?.. వెంటనే కొనేస్తారు. ప్రస్తుతం అలాంటి ఆఫర్ ఒకటి అమెజాన్‌లో ఉంది. యాపిల్ ఐఫోన్ 13, ఐఫోన్ 15 ధరలు అమెజాన్‌లో దాదాపు ఒకేలా ఉన్నాయి. ఇది కొంచెం ఆశ్చర్యకరమైనదే కానీ.. వినియోగదారులకు మాత్రం […]
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) కమిటీ సభ్యులపై కేసు నమోదైంది. సెలక్షన్ కమిటీ చైర్మన్ హబీబ్ అహ్మద్, సందీప్ రాజన్, సందీప్ త్యాగిలు డబ్బులు డిమాండ్ చేశారని ఇద్దరు ప్లేయర్స్ తల్లిదండ్రులు ఉప్పల్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. అండర్ 19, అండర్ 23 లీగ్‌లలో ఆడించాలంటే డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు పేర్కొన్నారు. డబ్బులు ఇవ్వనందుకు మంచి ప్రదర్శన చేసినా తన కుమాడిని ఆడనివ్వలేదని, సెలక్షన్ కమిటీపై చర్యలు తీసుకోవాలని ఓ ప్లేయర్ తండ్రి డాక్టర్ రామారావు […]
2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ) అభ్యర్థుల మొదటి జాబితాను విడుదల చేసింది. 57 మంది అభ్యర్థులతో కూడిన మొదటి జాబితాను ఈరోజు జేడీయూ ప్రకటించింది. మిత్రపక్షాలతో సీట్ల పంపకంపై ఒప్పందం కుదిరిన తర్వాత జేడీయూ అభ్యర్థుల ఈ జాబితాను విడుదల చేసింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సంజయ్ ఝా మాట్లాడుతూ.. ఎన్డీఏ ఐక్యంగా ఉందని, బీహార్ అభివృద్దే తమ లక్ష్యం అని చెప్పారు. ఇటీవల ఎన్డీఏ కూటమితో జేడీయూ సీట్ల పంపకాల ఒప్పందం […]
ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసం కృష్ణ పక్షం త్రయోదశిని ‘ధన త్రయోదశి’ లేదా ‘ధన్తేరస్’ అంటారు. దీపావళికి ముందే వచ్చే ధన త్రయోదశి.. సిరి సంపదలకు ప్రత్యేకం. ధన్తేరస్ రోజున భారత్‌లో బంగారం కొనడం ఎప్పటి నుంచో ఆనవాయితీగా వస్తోంది. సంప్రదాయకంగా ప్రజలు ధన్‌తేరస్‌లో బంగారం, వెండి సహా ఇతర విలువైన పాత్రలను కొనుగోలు చేస్తారు. ఇది సంపద, అదృష్టాన్ని తెస్తుందని నమ్ముతారు. దీపావళి పండగలో భాగంగా ఐదు రోజులు జరుపుకొనే వేడుకల్లో తొలి రోజైన ధన్తేరస్.. […]
భారత్-ఆస్ట్రేలియా వన్డే సిరీస్ ప్రారంభానికి సమయం దగ్గరపడింది. అక్టోబర్ 19 నుంచి మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆరంభం కానుంది. ఈ వన్డే సిరీస్ ముందు ఆతిథ్య ఆస్ట్రేలియాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. అక్టోబర్ 19న పెర్త్‌లో భారత్‌తో జరిగే తొలి వన్డేకు స్పిన్నర్ ఆడమ్ జంపా, వికెట్ కీపర్ జోష్ ఇంగ్లిస్ దూరమయ్యారు. వీరి స్థానంలో మాథ్యూ కున్నెమాన్, జోష్ ఫిలిప్‌లను క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) జట్టులోకి తీసింది. ఆడమ్ జంపా సతీమణి న్యూ సౌత్ […]
ఇండియా క్రికెట్లో అన్ని రాష్ట్రాల అసోసియేషన్లు తమ ప్లేయర్ల కోసం లీగ్స్ నడిపిస్తున్నాయి. కొత్త టాలెంట్‌ను బయటికి తీయడంలో ఈ లీగ్స్ ఉపయోగపడుతాయి. కానీ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) మాత్రం అందుకు భిన్నం. ఇక్కడ లీగ్ పక్కన పెడితే కనీసం వివాదం లేకుండా.. ఈ అసోసియేషన్‌ని రన్ చేయలేరు. ఇప్పటికే ఎన్నో వివాదాలతో పరువు పోగొట్టుకున్న హెచ్‌సీఏ.. ఇప్పుడు మరో వివాదంలో నిలించింది. Also Read: Afghanistan Cricket: చరిత్ర సృష్టించిన ఆఫ్గనిస్తాన్.. ప్రపంచంలోనే మొదటి […]
ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టు బంగ్లాదేశ్‌తో జరిగిన 3 వన్డేల సిరీస్‌లో సంచలన ప్రదర్శన చేసింది. అబుదాబిలో అక్టోబర్ 14న జరిగిన చివరి మ్యాచ్‌లో భారీ తేడాతో గెలిచి.. సిరీస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. ఇది ఆఫ్ఘనిస్తాన్‌కు వరుసగా 5వ వన్డే సిరీస్ విజయం కావడం విశేషం. చివరి వన్డే మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఏకంగా 200 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. అబుదాబిలో ఈ రికార్డు తేడాతో ఓడిపోవడం బంగ్లాదేశ్‌కు ఇదే మొదటిసారి. ఆఫ్ఘనిస్తాన్‌కు వరుసగా ఐదో […]
దేశంలో బంగారం ధరలు రోజురోజుకు రికార్డు స్థాయిలో దూసుకెళ్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని రీతిలో పెరుగుతూ.. పసిడి ప్రియులకు చుక్కలు చూపిస్తున్నాయి. గత 10 రోజులుగా వరుసగా పెరిగిన బంగారం ధరలు ఆకాశాన్నంటాయి. ఈ రోజు కూడా పసిడి ధరలు పసిడి భారీగానే పెరిగాయి. బులియన్ మార్కెట్లో నేడు 1 గ్రాము 24 క్యారెట్ల బంగారం ధర రూ.12,889గా.. 1 గ్రాము 22 క్యారెట్ల ధర రూ.11,815గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై రూ.540 […]
‘జన్ సురాజ్’ అధినేత, పొలిటికల్ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. 2025 బీహార్ ఎన్నికల్లో తాను పోటీ చేయనని తెలిపారు. తాను ఎన్నికల్లో పోటీ చేయకున్నా.. పార్టీ కోసం మాత్రం పనిచేస్తానని వెల్లడించారు. ఈ మేరకు పార్టీ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. పార్టీ ప్రయోజనం కోసం తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రశాంత్ కిషోర్ స్పష్టం చేశారు. బీహార్ ఎన్నికలు రెండు దశల్లో (నవంబర్ 6, 11) జరగనున్నాయి. నవంబరు 14న ఫలితాలు వెల్లడి […]