దేశంలో బంగారం ధరలు రోజురోజుకు రికార్డు స్థాయిలో దూసుకెళ్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని రీతిలో పెరుగుతూ.. పసిడి ప్రియులకు చుక్కలు చూపిస్తున్నాయి. గత 10 రోజులుగా వరుసగా పెరిగిన బంగారం ధరలు ఆకాశాన్నంటాయి. ఈ రోజు కూడా పసిడి ధరలు పసిడి భారీగానే పెరిగాయి. బులియన్ మార్కెట్‌లో నేడు 1 గ్రాము 24 క్యారెట్ల బంగారం ధర రూ.12,889గా.. 1 గ్రాము 22 క్యారెట్ల ధర రూ.11,815గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై రూ.540 పెరిగి.. రూ.1,28,890గా నమోదయింది. 22 క్యారెట్ల 10 గ్రాములపై రూ.500 పెరిగి రూ.1,18,150 ట్రేడ్ అవుతోంది.
హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,28,890గా ఉంది. మరోవైపు 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,18,150గా కొనసాగుతోంది. ప్రస్తుతం సామాన్య, మధ్య తరగతి ప్రజలు బంగారం అనే మాట కూడా ఎత్తడానికి బయపడుతున్నారు. పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపుతుండడంతో.. బంగారంకు భారీగా డిమాండ్ పెరుగుతోందని బులియన్ మార్కెట్ నిపుణులు అంటున్నారు. గోల్డ్ పెరుగుదలకు అంతర్జాతీయంగా పలు పరిణామాలు కూడా కారణం అవుతాయి. పసిడి ధరలు మరింత పెరిగే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు.
Also Read: Prashant Kishor: బిహార్ ఎన్నికలు.. ప్రశాంత్ కిషోర్ కీలక నిర్ణయం!
బంగారంతో పాటు వెండి ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయి. చరిత్రలో ఎన్నడూ లేనంతగా వెండి ధరలు రికార్డు స్థాయికి చేరాయి. సిల్వర్ కూడా గత 10 రోజులుగా భారీగా పెరుగుతోంది. బులియన్ మార్కెట్‌లో కిలో వెండిపై రూ.1000 పెరిగి.. 1,90,000గా ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్ మార్కెట్‌లో రూ.2,07,000గా ఉంది. ఈ వారం రోజుల్లో వెండి ధరలు వరుసగా 3, 7, 7, 6, 0, 5, 4, 1 వేలు పెరిగింది. పెరిగిన ధరలతో సామాన్య జనాలు వెండి కొనడానికి కూడా ఇప్పుడు వెనకంజ వేస్తున్నారు.