Deputy CM Pawan Kalyan: మంగళగిరిలో నిర్వహించిన కానిస్టేబుల్ నియామక పత్రాల ప్రధాన కార్యక్రమంలో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి కానిస్టేబుల్‌గా ఎంపికైన లాకే బాబూరావు వేదికపై తన గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని సీఎంకు విన్నపం అందజేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు ఆ రోడ్డు బాధ్యతను వేదికపై ఉన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన డిప్యూటీ సీఎం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
READ ALSO: Dhurandhar Telugu Release: ‘ధురంధర్’ తెలుగు వెర్షన్‌కు కొత్త టెన్షన్.. అదే జరిగితే!
అధికారులు స్పందించి కానిస్టేబుల్ లాకే బాబూరావు స్వగ్రామం అయిన తెనుములబండ నుంచి ఎలుగురాతిబండ మధ్య 2 కిలోమీటర్ల బీటీ రోడ్డు ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ సందర్భంగా అధికారులు రెండు కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి రూ. 2 కోట్లతో అంచనాలు సిద్ధం చేసి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. నిమిషాల్లో నిర్ణయం తీసుకున్న డిప్యూటీ సీఎం సభ ముగిసేలోగా పరిపాలనా అనుమతులు మంజూరు చేశారు. ఈ ప్రతిపాదనలకు ఏఎస్ఆర్ జిల్లా కలెక్టర్ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చింది. సభలో సీఎం దృష్టికి వచ్చిన విన్నపాన్ని కార్యక్రమం ముగిసేలోగా పరిష్కరించిన ప్రభుత్వ పెద్దలకు ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
READ ALSO: TTD News: ధ్వజస్తంభాలు, రథాల కోసం 100 ఎకరాల్లో దివ్య వృక్షాల ప్రాజెక్టు!