మరణశిక్ష అమలులో నయా రికార్డ్ సృష్టించిన ముస్లిం దేశం..
ఈ ముస్లిం దేశం శిరచ్ఛేదం(మరణశిక్ష) అమలులో నయా రికార్డు సృష్టించింది. ఇంతకీ ఆ ముస్లిం దేశం ఏంటో తెలుసా.. సౌదీ అరేబియా. AFP లెక్కల ప్రకారం.. ఈ దేశం ఒకే సంవత్సరంలో రికార్డు స్థాయిలో మరణశిక్ష అమలు చేసింది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 340 మందికి మరణశిక్ష అమలు చేసింది. ఇది సౌదీ చరిత్రలో అత్యధికంగా విధించిన మరణశిక్ష సంఖ్య. 2024లో ఈ సంఖ్య 338 మందిగా ఉండేది. తాజా లెక్కలతో ఈ దేశం తన రికార్డును తానే అధిగమించినట్లు అయ్యింది. సోమవారం మక్కాలో హత్య కేసులో ముగ్గురికి మరణశిక్ష విధించినట్లు సౌదీ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ధృవీకరించిన తర్వాత తాజా సంఖ్య బయటికి వచ్చింది. నిజానికి సౌదీ అరేబియా తన సొంత రికార్డును బద్దలు కొట్టడం ఇది వరుసగా రెండవ సంవత్సరంగా విశ్లేషకులు చెబుతున్నారు. ఈ సంవత్సరం అమలు చేసిన మరణశిక్షలలో 232 మాదకద్రవ్యాల సంబంధిత నేరాలకు సంబంధించినవిగా సౌదీ అధికారులు తెలిపారు. మానవ హక్కుల సంస్థల ప్రతినిధులు మాట్లాడుతూ.. అంతర్జాతీయ చట్టం ప్రకారం మరణశిక్షను ఉద్దేశపూర్వక హత్య వంటి “అత్యంత తీవ్రమైన నేరాలకు” పరిమితం చేయాలని చెబుతున్నాయి, కానీ సౌదీ అరేబియా మాత్రం ఈ నిబంధనలు నిరంతరం ఉల్లంఘిస్తోందని అన్నారు. అలాగే ఈ దేశంలో అనేక మందిని ఉగ్రవాద ఆరోపణలపై ఉరితీశారని చెప్పారు.
నువ్వానేనా అన్నట్లు పోటీపడ్డ చెన్నై, హైదరాబాద్.. అనామక ఆటగాడికి 14 కోట్లు!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 మినీ వేలంలో దేశవాళీ ఆటగాడు ప్రశాంత్ వీర్‌పై కాసుల వర్షం కురిసింది. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన అన్‌క్యాప్డ్ ప్లేయర్ ప్రశాంత్ కనీస ధర రూ.30 లక్షలు కాగా.. రూ.14.20 కోట్లకు చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) సొంతం చేసుకుంది. 20 ఏళ్ల ప్రశాంత్ కోసం సీఎస్‌కేతో పాటు సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) పోటీ పడ్డాయి. ప్రశాంత్ కోసం ముందుగా ముంబై ఇండియన్స్ బిడ్ వేయగా.. ఆపై లక్నో సూపర్ జెయింట్స్ పోటీ పడింది. 1.3 కోట్ల వద్ద సీఎస్‌కే ఎంట్రీ ఇవ్వగా.. రాజస్థాన్ రాయల్స్ కూడా రేసులోకి వచ్చింది. 6.8 కోట్ల వద్ద ఎస్‌ఆర్‌హెచ్ ఎంట్రీ ఇవ్వడంతో రాజస్థాన్ వెనక్కి తగ్గింది. ప్రశాంత్ వీర్ కోసం సీఎస్‌కే, ఎస్‌ఆర్‌హెచ్ నువ్వానేనా అన్నట్లు పోటీపడ్డాయి. దాంతో అతడి ధర 10 కోట్లు దాటేసింది. చివరకు 14.20 కోట్లకు సీఎస్‌కే దక్కించుకుంది. దాంతో ఐపీఎల్‌లో అత్యధిక ధర పలికిన అన్‌క్యాప్డ్ ఆటగాడిగా ప్రశాంత్ రికార్డుల్లో నిలిచాడు. అంతకుముందు టీమిండియా పేసర్ అవేష్ ఖాన్ రూ.10 కోట్లకు అమ్ముడయ్యాడు. అంతేకాదు ఇప్పటివరకు అమ్ముడైన వారిలో అత్యధిక ధర పలికిన భారతీయుడిగా కూడా వీర్ నిలిచాడు.
క్రిస్మస్ వేళ.. క్లీన్-షేవ్ చేసుకున్న యేసు అరుదైన పెయింటింగ్‌ను కనుగొన్న పురావస్తు శాస్త్రవేత్తలు..
క్రిస్మస్ సెలబ్రేషన్స్ కు వరల్డ్ వైడ్ గా అంతా రెడీ అవుతున్నారు. మరికొన్ని రోజుల్లో క్రిస్మస్ పండగ రానున్న వేళ సందడి వాతావరణం నెలకొన్నది. ఈ క్రమంలో క్లీన్-షేవ్ చేసుకున్న యేసు అరుదైన పెయింటింగ్‌ను కనుగొన్నారు పురావస్తు శాస్త్రవేత్తలు. టర్కీలోని ఇజ్నిక్ (పురాతన నైసియా) ప్రాంతంలో ఆర్కియాలజిస్టులు ఒక అరుదైన ఫ్రెస్కోను కనుగొన్నారు. ఇది 3వ శతాబ్దానికి చెందిన భూగర్భ సమాధిలో ఉంది. ఈ చిత్రంలో యేసును “గుడ్ షెపర్డ్” (మంచి కాపరి)గా చూపించారు. ఆయన యువకుడిగా, గడ్డం లేకుండా, రోమన్ టోగా ధరించి, భుజంపై గొర్రెపిల్లను మోస్తూ ఉన్నారు. ఆగస్టు నెలలో హిసార్డెరే నెక్రోపాలిస్‌లోని భూగర్భ సమాధిలో గుర్తించారు. ఇజ్నిక్ మ్యూజియం ఆర్కియాలజిస్ట్ ఎరెన్ ఎర్టెన్ ఎర్టెమ్ మాట్లాడుతూ, ఈ ఫ్రెస్కోలు లేట్ పాగనిజం నుంచి ప్రారంభ క్రైస్తవ మతానికి మార్పు చెందుతున్న సమయాన్ని చూపిస్తాయని తెలిపారు. సమాధి గోడలు, పైకప్పు పక్షులు, మొక్కలు, గొర్రెలు వంటి మోటిఫ్‌లతో అలంకరించబడి ఉన్నాయి. ఇక్కడ నోబుల్ పురుషులు, మహిళలు, దాసుల చిత్రాలు కూడా ఉన్నాయి. ఈ ఆవిష్కరణకు మరింత ప్రాధాన్యత ఉంది ఎందుకంటే ఇది 3వ శతాబ్దంలో క్రైస్తవులు రోమన్ సామ్రాజ్యంలో హింసకు గురవుతున్న సమయంలో జరిగింది. ఆ కాలంలో క్రూస్ (సిలువ) సంకేతం బదులు “గుడ్ షెపర్డ్” మోటిఫ్ రక్షణ, మోక్షం, దైవిక మార్గదర్శనాన్ని సూచించేదని తెలిపారు.
ఆస్ట్రేలియా కాల్పులకు హైదరాబాద్ లింక్.. పూర్తి వివరాలు ఇవే..!
ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో ఉన్న బోండీ బీచ్ వద్ద ఆదివారం, డిసెంబర్ 14, 2025న నిర్వహించిన ప్రజా హనుక్కా వేడుకల సందర్భంగా జరిగిన భారీ కాల్పుల ఘటనలో 15 మంది అమాయక పౌరులు మృతి చెందగా, దాడి చేసిన ఇద్దరిలో ఒకరు మృతిచెందినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనను ఆస్ట్రేలియా ప్రభుత్వం , పోలీసులు ఉగ్రదాడిగా పరిగణిస్తున్నారు. ఈ దాడికి పాల్పడినవారిగా సజీద్ అక్బర్ (50) , అతని కుమారుడు *నవీద్ అక్బర్ (24)*గా అధికారులు గుర్తించారు. ప్రాథమిక సమాచార ప్రకారం వీరు ఐసిస్ భావజాలం ప్రభావానికి లోనై ఈ దాడికి పాల్పడ్డారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలపై ఆస్ట్రేలియా భద్రతా సంస్థలు దర్యాప్తు కొనసాగిస్తున్నాయి.
కొండగట్టు అంజన్న ఆలయానికి అటవీశాఖ షోకాజ్ నోటీసు…
తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో ఉన్న సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం, కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం ప్రస్తుతం అటవీ శాఖ, దేవాదాయ శాఖ (ఎండోమెంట్) మధ్య కీలక వివాదానికి కేంద్రంగా మారింది. అటవీ శాఖ అధికారులు ఆలయ నిర్వహణ కమిటీకి నేరుగా షోకాజ్ నోటీసులు జారీ చేయడంతో, భక్తులలో మరియు స్థానికులలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. అటవీ శాఖ అధికారులు జారీ చేసిన నోటీసులలో, ఆలయ నిర్వహణ కమిటీ 684 బ్లాక్ అటవీశాఖ పరిధిలోని దాదాపు 6 ఎకరాల అటవీ భూమిని ఆక్రమించారని స్పష్టంగా ఆరోపించారు. ఈ ఆక్రమణ భూమిలో అక్రమ నిర్మాణాలు జరిగాయని, ఇది అటవీ సంరక్షణ చట్టాలను ఉల్లంఘించడమేనని అధికారులు పేర్కొన్నారు. ముఖ్యంగా, ఈ ఆరు ఎకరాల విస్తీర్ణంలోనే అన్నదాన సత్రం, వాటర్ ప్లాంట్, వాహన పూజ షెడ్, ఎగ్జిక్యూటివ్ బిల్డింగ్, సాగర్ గెస్ట్ హౌస్, పబ్లిక్ టాయిలెట్స్ వంటి ఆలయానికి సంబంధించిన ముఖ్యమైన కట్టడాలు ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి.
ఇథియోపియా చేరుకున్న ప్రధాని మోడీ.. ఘన స్వాగతం పలికిన పీఎం అబియ్ అహ్మద్ అలీ
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విదేశీ పర్యటనలో భాగంగా ఇథియోపియాకు చేరుకున్నారు. ఇథియోపియా ప్రధానమంత్రి అబియ్ అహ్మద్ అలీ ప్రత్యేకంగా అడ్డిస్ అబాబా విమానాశ్రయానికి వచ్చి మోడీని హృదయపూర్వకంగా స్వాగతించారు. ఇది రెండు దేశాల మధ్య బలమైన సంబంధాలను సూచిస్తుంది. 2011 తర్వాత భారత ప్రధానమంత్రి ఇథియోపియాను సందర్శించడం ఇదే మొదటిసారి. ప్రధాని మోదీ గౌరవార్థం అడ్డిస్ అబాబా స్వాగత హోర్డింగులు, పోస్టర్లు, భారత జెండాలతో అలంకరించారు. ఈ రెండు రోజుల సందర్శనలో ప్రధాని మోదీ ఇథియోపియా ప్రధానమంత్రి అబియ్ అహ్మద్‌తో విస్తృత చర్చలు జరుపుతారు. రాజకీయ సహకారం, అభివృద్ధి భాగస్వామ్యం, వాణిజ్యం, పెట్టుబడులు, ప్రజల మధ్య సంబంధాలు వంటి అంశాలపై చర్చలు జరుగుతాయి. ఇద్దరు నాయకులు గ్లోబల్ సౌత్‌లో భాగస్వాములుగా ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయాలని కట్టుబడి ఉన్నారు. ఆఫ్రికన్ యూనియన్ ప్రధాన కార్యాలయం ఆడ్డిస్ అబాబాలో ఉండటం వల్ల ఈ సందర్శనకు ప్రాధాన్యత ఉంది. 2023లో భారత G20 అధ్యక్షత్వంలో ఆఫ్రికన్ యూనియన్‌ను శాశ్వత సభ్యత్వం ఇవ్వడం గురించి మోడీ తన విదాయ ప్రకటనలో ప్రస్తావించారు.
జీహెచ్ఎంసీ కౌన్సిల్‌లో వార్డుల పునర్విభజనపై రచ్చ
ఈ రోజు GHMC ప్రత్యేక కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. ఈ సమావేశంలో ప్రధానంగా వార్డుల పునర్విభజన అంశంపై చర్చ కొనసాగింది. జీహెచ్ఎంసీ పరిధిలో ఇటీవల విలీనం చేసిన 27 మునిసిపాలిటీలతో పాటు, ప్రస్తుతం ఉన్న 150 వార్డులను 300 వరకు పెంచేందుకు ప్రభుత్వం చేపట్టిన డీలిమిటేషన్‌పై బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం కార్పోరేటర్లు మరియు నగరవాసులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. చర్చల సమయంలో సభలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. దారుస్సలంలో వార్డుల విభజన జరిగిందంటూ బీజేపీ కార్పోరేటర్లు చేసిన వ్యాఖ్యలపై ఎంఐఎం కార్పోరేటర్లు అభ్యంతరం తెలిపారు. దీంతో ఎంఐఎం, బీజేపీ కార్పోరేటర్ల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.
కోర్టుల్లో కొట్లాడి విజయవంతంగా రిక్రూట్‌మెంట్ పూర్తిచేశాం
ఆంధ్రప్రదేశ్‌లో పోలీస్ కానిస్టేబుల్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, హోం మంత్రి వంగలపూడి అనిత ఘనంగా ప్రశంసించారు. తమ కష్టపడి చదివి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన యువత రాష్ట్రానికి గర్వకారణమని వారు అభినందించారు. పాడేరుకు చెందిన గిరిజన యువకుడు బాబురావును సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా అభినందించారు. బాబురావు భవిష్యత్తులో మరింత ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షిస్తూ, అఖిల భారత సర్వీసు సాధించి జిల్లాకు ఎస్పీ కావాలని సూచించారు. ఈ సందర్భంగా బాబురావు తన స్వగ్రామానికి రహదారి సౌకర్యం కల్పించాలని సీఎంను కోరగా, ఆ బాధ్యతను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీసుకుంటారని చంద్రబాబు తెలిపారు. అలాగే, బలభద్రపురం గ్రామానికి చెందిన మణికంఠ కూడా ఉన్నత స్థానాలకు ఎదగాలని సీఎం ఆకాంక్షించారు. మణికంఠ బీఎస్సీ కెమిస్ట్రీ పూర్తి చేసి కానిస్టేబుల్‌గా ఎంపికయ్యాడని వివరించారు.
పవన్ తమ్ముడికి దారి ఇచ్చేసి.. మనం తర్వాత వద్దామన్నారు!
నందమూరి బాలకృష్ణ మరియు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కిన భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘అఖండ 2: ది తాండవం’ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ సక్సెస్‌తో సంచలనాలు సృష్టిస్తోంది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 12న విడుదలై హౌస్ ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఈ సందర్భంగా దర్శకుడు బోయపాటి శ్రీను విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలను పంచుకున్నారు. సినిమా షెడ్యూల్ మరియు వాయిదా గురించి బోయపాటి ఆసక్తికర విషయాలు చెప్పారు. “నేను 135 రోజుల్లో సినిమా తీశాను. కొబ్బరికాయ కొట్టిన రోజే డేట్ అనౌన్స్ చేస్తామని బాలకృష్ణ గారికి ముందే చెప్పాను. మేము అనుకున్నట్టు సెప్టెంబర్ 25 సినిమా రిలీజ్ అన్నాం. మేము అనుకున్నట్టే కాపీ రెడీ అయిపోయింది.” “అదే సమయానికి ‘ఓజీ’ సినిమా ఉంది.