APMDC Office Opened in AP Today: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ), మైనింగ్ డైరెక్టర్ కార్యాలయాలు తెరుచుకున్నాయి. మైనింగ్ శాఖ ఇంఛార్జి బాధ్యతలను సోమవారం యువరాజ్ చేపట్టగా.. ఈ రోజు రెండు కార్యాలయాలు తెరవటానికి అధికారులు సిద్ధమయ్యారు. ఇప్పటికే మైనింగ్ డైరెక్టర్ కార్యాలయం ఓపెన్ చేయగా.. ఉద్యోగులు విధుల్లో చేరారు. మరోవైపు ఏపీఎండీసీ కార్యాలయం కొద్దిసేపట్లో ఓపెన్ కానుంది. విధుల్లో చేరేందుకు ఉద్యోగులు కార్యాలయం ముందు ఎదురు చూస్తున్నారు. జూన్ 9న ఏపీఎండీసీ, […]
Pawan Kalyan Meets Janasena MLA’s in Vijayawada: 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం అనంతరం డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.. నేడు తన పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. త్వరలో అసెంబ్లీ సమావేశాలు ఉన్న నేపథ్యంలో ఎమ్మెల్యేలతో పవన్ సమావేశం అయ్యారు. అసెంబ్లీలో వ్యవహరించాల్సిన తీరు, అసెంబ్లీ కార్యక్రమాలపై ఎమ్మెల్యేలకు జనసేనాని అవగాహన కల్పించారు. వారాహి అమ్మవారి దీక్ష చేపట్టిన పవన్.. దీక్షా వస్త్రాలు ధరించి ఎమ్మెల్యేల అవగాహన […]
T20 World Cup 2024 Semi Final Schedule: టీ20 ప్రపంచకప్ 2024 సెమీస్‌లో ఆడే జట్లు ఏవో తేలిపోయాయి. సూపర్-8 గ్రూప్ 2 నుంచి దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ జట్లు సెమీస్ చేరుకోగా.. తాజాగా సూపర్-8 గ్రూప్ 1 నుంచి భారత్, అఫ్గానిస్థాన్ సెమీస్‌కు అర్హత సాధించాయి. సెమీస్‌కు చేరడం అఫ్గాన్‌కు ఇదే మొదటిసారి కావడం విశేషం. పొట్టి కప్‌లో గ్రూప్ దశ నుంచే సంచలన విజయాలు నమోదు చేస్తూ వస్తున్న అఫ్గాన్.. సూపర్-8లో కూడా పట్టు […]
Australia Out From T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్ 2024లో పసికూన అఫ్గానిస్థాన్ సంచలనం సృష్టించింది. చివరి బంతి వరకూ ఉత్కంఠగా సాగిన సూపర్-8 మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై ఊహించని విజయం సాధించింది. బంగ్లాను 105 పరుగులకే ఆలౌట్ చేసి.. 8 పరుగుల తేడాతో (డక్‌వర్త్‌లూయిస్ పద్ధతి ప్రకారం) విజయం సాధించింది. ఈ విజయంతో నేరుగా గ్రూప్ 1 నుంచి అఫ్గాన్ సెమీస్ చేరింది. అఫ్గాన్ విజయంతో సెమీస్ రేసు నుంచి ఆస్ట్రేలియా నిష్క్రమించింది. ఇప్పటికే […]
AP TET Results 2024 Today: ఏపీ టెట్ (టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్) 2024 ఫలితాలు ఈరోజు విడుదల కానున్నాయి. ఈ మేరకు విద్యాశాఖ ఉన్నతాధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. అయితే టెట్ ఫలితాలు ఎన్ని గంటలకు విడుదల చేస్తారనే విషయంపై స్పష్టత ఇవ్వలేదు. మధ్యాహ్నం తర్వాత టెట్ ఫలితాలు విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. 2024 ఫిబ్రవరిలో టెట్ ప్రకటన వెలువడటంతో పాటు ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరించారు. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 6 వరకు […]
రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం: ఏపీ, యానాంలో నైరుతి దిశగా బలమైన గాలులు వీస్తున్నాయి. ఈ క్రమంలోనే బుధవారం (జూన్ 26) బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంటున్నారు. ఈ అల్పపీడనం బలపడుతూ.. ఉత్తర దిశగా ప్రయాణించే అవకాశం ఉంది. అదే రోజున అల్పపీడనం ఏపీ తీరాన్ని తాకనుంది. ఈ అల్పపీడనం ప్రభావంతో బుధవారం సాయంత్రం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మోస్తరు వర్షాలు కురవన్నాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో ముసురు వాతావరణం ఏర్పడనుంది. […]
AP and Telangana Weather Forecast: ఏపీ, యానాంలో నైరుతి దిశగా బలమైన గాలులు వీస్తున్నాయి. ఈ క్రమంలోనే బుధవారం (జూన్ 26) బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంటున్నారు. ఈ అల్పపీడనం బలపడుతూ.. ఉత్తర దిశగా ప్రయాణించే అవకాశం ఉంది. అదే రోజున అల్పపీడనం ఏపీ తీరాన్ని తాకనుంది. ఈ అల్పపీడనం ప్రభావంతో బుధవారం సాయంత్రం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మోస్తరు వర్షాలు కురవన్నాయి. అల్పపీడనం ప్రభావంతో ముఖ్యంగా ఉత్తరాంధ్ర, కోస్తా […]
AP CM Chandrababu Naidu Tour Today: రెండు రోజుల పాటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కుప్పంలో పర్యటించనున్నారు. నాలుగోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చంద్రబాబు తొలిసారిగా తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో మంగళ, బుధవారాల్లో పర్యటించనున్నారు. దీంతో కుప్పంలో కోలాహల వాతావరణం నెలకొంది. సీఎం పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ పర్యటనకు అధికారులు కనీవినీ ఎరుగని ఏర్పాట్లు చేశారట. తొమ్మిది పర్యాయాలు ఎమ్మెల్యేగా కుప్పం నుంచి గెలుస్తున్న చంద్రబాబు […]
Rohit Sharma 92 Help India into T20 World Cup 2024 Semis: టీ20 ప్రపంచకప్ 2024లో భారత్ జైత్రయాత్ర కొనసాగుతోంది. సూపర్-8 చివరి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై గెలిచిన టీమిండియా.. అజేయంగా సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. భారత్ నిర్ధేశించిన 206 పరుగుల ఛేదనలో ఆసీస్ 7 వికెట్లకు 181 పరుగులే చేసింది. ట్రావిస్ హెడ్ (76; 43 బంతుల్లో 9×4, 4×6) మరోసారి భారత్‌ను బయపెట్టగా.. మిచెల్ మార్ష్ (37; 28 బంతుల్లో 3×4, 2×6) […]
నేటి నుంచి రెండు రోజుల పాటు సీఎం చంద్రబాబు నాయుడు కుప్పంలో పర్యటించనున్నారు. ఈరోజు మధ్యాహ్నం 12.30కు సీఎం పర్యటన మొదలవనుండగా.. సాయంత్రం 4.35కు ముగుస్తుంది. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డిలు ఈరోజు విజయవాడలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండవ రోజు జూనియర్ డాక్టర్ల సమ్మె కొనసాగనుంది. సోమవారం మధ్యాహ్నం వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహతో చర్చలు అసంపూర్ణం అవ్వడం […]