Gautam Gambhir: ఇక నా లక్ష్యం అదే: గౌతమ్ గంభీర్
- ద్రవిడ్ వారసుడిగా గౌతీ
- శ్రీలంక పర్యటనతో బాధ్యతలు
- ప్రతి భారతీయుడూ గర్వపడేలా చేస్తా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gautam Gambhir Tweet After Elected as Team India Coach: టీమిండియా హెడ్ కోచ్‌గా భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ఎంపికయ్యాడు. ‘ది వాల్’ రాహుల్ ద్రవిడ్ స్థానంలో గంభీర్‌ను ఎంపిక చేసినట్లు బీసీసీఐ మంగళవారం ప్రకటించింది. ద్రవిడ్ వారసుడిగా గౌతీనే కోచ్ బాధ్యతలు అందుకుంటాడని ముందునుంచే ప్రచారం జరిగింది. అయితే భారత మాజీ క్రికెటర్ డబ్ల్యూవీ రామన్ కూడా బీసీసీఐ అడ్వైజరీ కమిటీ ఇంటర్వ్యూకు హాజరైనా.. గంభీర్‌కే అందరూ ఓటేశారు. జులై చివరలో ఆరంభమయ్యే శ్రీలంక పర్యటనతో కోచ్‌గా గంభీర్ బాధ్యతలు చేపట్టనున్నాడు.
హెడ్ కోచ్‌గా బీసీసీఐ అధికారికంగా ప్రకటించిన అనంతరం గౌతమ్ గంభీర్ సోషల్ మీడియాలో తన ఆనందాన్ని పంచుకున్నాడు. భారత్ తన గుర్తింపు అని, ప్రతి భారతీయుడు గర్వపడేలా చేయడమే తన లక్ష్యమని గౌతీ అన్నాడు. ‘భారత్ నా గుర్తింపు. దేశానికి సేవ చేయడం గొప్ప గౌరవం. ఈసారి నా పాత్ర భిన్నమైంది. కానీ నా లక్ష్యం మాత్రం ఎప్పటిలాగే ప్రతి భారతీయుడూ గర్వపడేలా చేయడం. భారత జట్టు 140 కోట్ల మంది భారతీయుల కలల భారాన్ని మోస్తోంది. ఆ కలలను నిజం చేయడానికి శాయశక్తులా ప్రయత్నిస్తా. టీమిండియా హెడ్ కోచ్‌గా బాధ్యతలను స్వీకరించాలనే ఉత్సాహంతో ఉన్నా. ఆటగాడిగా టీమిండియా జెర్సీని ధరించినందుకు గర్వపడ్డా. కొత్త పాత్రలోనూ అలాగే ఫీల్ అవుతా. బీసీసీఐ, ఎన్‌సీఏ హెడ్ వీవీఎస్ లక్ష్మణ్, సహాయ సిబ్బంది, ఆటగాళ్లతో కలిసి పని చేయడం కోసం ఎదురుచూస్తున్నా’ అని గంభీర్ చెప్పాడు.
Also Read
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
- CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
Also Read: Ntr Devara Update: దేవర ముంగిట వారం రోజులు మాత్రమే..
42 ఏళ్ల గౌతమ్ గంభీర్ భారత్ తరఫున 58 టెస్టులు, 147 వన్డేలు, 37 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్ గెలిచిన జట్లలో గౌతీ సభ్యుడు. అంతేకాదు ఆ రెండు టోర్నీల ఫైనల్స్‌లో టాప్ స్కోరర్ కూడా. ఐపీఎల్‌లో కెప్టెన్‌గా 2012, 2014లో కోల్‌కతాకు టైటిళ్లను అందించాడు. ఇక 2024లో ఐపీఎల్ టైటిల్ నెగ్గిన కోల్‌కతాకు మెంటర్‌గా గౌతీ నిరూపించుకున్నాడు.
తాజావార్తలు
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
-
Supreme Court: సీజేపీ నిరసనలపై సుప్రీంకోర్టు సీరియస్.. ఆదివారం ప్రత్యేక విచారణ..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!