Sampath Kumar
Author- NTV Telugu-
RR vs CSK: నేను తెలుగు సినిమాలు చూస్తా.. ‘పుష్ప’ సూపర్: శ్రీలంక బౌలర్
భారత్‌లో తెలుగు, మలయాళం, తమిళ సినిమాలు తాను చూస్తుంటా అని శ్రీలంక బౌలర్ వనిందు హసరంగ తెలిపాడు. పుష్ప సినిమా బాగుందని, అప్పటి నుంచి తాను ఎక్కువగా తెలుగు చిత్రాలు వీక్షిస్తున్నానని చెప్పాడు. మైదానంలో పుష్ప తరహాలో సంబరాలు చేసుకోవడం బాగుందని హసరంగ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ 2025లో భాగంగా గువాహటి వేదికగా ఆదివారం రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో చెన్నై బ్యాటర్ శివమ్ దూబెను ఔట్ చేసిన […] -
MS Dhoni-Rahul Dravid: రాహుల్ ద్రవిడ్‌ను పరామర్శించిన ఎంఎస్ ధోనీ!
ఐపీఎల్ 2025లో భాగంగా గువాహటి వేదికగా ఆదివారం రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. చెన్నై విజయానికి 20వ ఓవర్లో 20 పరుగులు అవసరం కాగా.. క్రీజ్‌లో ఎంఎస్ ధోనీ, రవీంద్ర జడేజా ఉన్నారు. రాజస్థాన్ బౌలర్ సందీప్ శర్మ తొలి బంతికే ధోనీని అవుట్ చేశాడు. ఆపై 13 పరుగులే చేయడంతో చెన్నైకి ఓటమి తప్పలేదు. ఈ మ్యాచ్ […] -
Tirumala: తిరుమల అలిపిరి చెక్ పాయింట్ దగ్గర వ్యక్తి హల్ చల్!
తిరుమల అలిపిరి చెకింగ్ పాయింట్ వద్ద మరోసారి భద్రతా వైఫల్యం బట్టబయలైంది. అలిపిరి చెకింగ్ పాయింట్ వద్ద ద్విచక్ర వాహనాన్ని నిలపకుండానే ఓ వ్యక్తి దూసుకెళ్లాడు. అతడిని నిలువరించేందుకు యత్నించిన సమయంలో ద్విచక్ర వాహనంతో భద్రతా సిబ్బందిపై దూసుకెళ్లాడు. ఘాట్ రోడ్డులో ర్యాష్ డ్రైవింగ్‌తో పలు వాహనాలను ఢీకొట్టాడు. చివరకు తిరుమల లోని జీఎన్సీ టోల్ గేట్ వద్ద విజిలెన్స్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. సింగాలగుంటకి చెందిన అమీర్ అంజద్ ఖాన్ అలిపిరి చెకింగ్ పాయింట్ వద్ద […] -
RR vs CSK: కాస్త లేట్ అయింది.. నా కెప్టెన్సీలో విజయం సాధించడం సంతోషం!
కాస్త లేట్ అయినా.. తన కెప్టెన్సీలో విజయం సాధించడం సంతోషంగా ఉందని రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ తెలిపాడు. మ్యాచ్‌లో తాము 20 పరుగులు తక్కువగా చేశామన్నాడు. చెన్నైకి ఏమాత్రం అవకాశం అవ్వకుండా.. తమ బౌలర్లు చక్కటి ప్రదర్శన చేశారని ప్రశంసించాడు. నితీశ్ రాణా బ్యాటింగ్‌లో ఇచ్చిన మెరుపు ఆరంభం చాలా కీలకంగా మారిందని రియాన్ పరాగ్ చెప్పుకొచ్చాడు. ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్స్ 6 పరుగుల తేడాతో గెలిచింది. రాజస్థాన్ […] -
RR vs CSK: మా ఓటమికి కారణం అదే: రుతురాజ్
పవర్ ప్లేలో అదనంగా పరుగులు ఇవ్వడం, ఫీల్డింగ్ తప్పిదాలతో పాటు ఓపెనర్ల వైఫల్యం తమ విజయవకాశాలను దెబ్బతీసిందని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ తెలిపాడు. రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ నితీశ్ రాణా (81; 36 బంతుల్లో 10×4, 5×6) అద్భుత బ్యాటింగ్ చేశాడని ప్రశంసించాడు. రాజస్థాన్ ఇచ్చిన టార్గెట్ ఛేదించదగినదే అని, గౌహతి బ్యాటింగ్‌కు మంచి వికెట్ అని చెప్పాడు. మ్యాచ్‌లో ఓడినా తమకు సానుకూల అంశాలు ఉన్నాయని రుతురాజ్ పేర్కొన్నాడు. ఆదివారం గౌహతిలో […] -
Rohit Sharma: రోజురోజుకూ రోహిత్ ఆట పడిపోతోంది.. ఏదో నెట్టుకొస్తున్నాడు అంతే!
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్‌లో ఏదోలా నెట్టుకొస్తున్నాడని, హిట్‌మ్యాన్‌లో ఒకప్పటి ఫామ్ లేదని భారత మాజీ ఆటగాడు సంజయ్ మంజ్రేకర్ అన్నారు. 3-4 ఏళ్ల క్రితం నాటి రోహిత్ అయితే కాదని, రోజు రోజుకూ అతడి ఆట పడిపోతోందన్నారు. పరిస్థితులకు తగ్గట్లు మారకుండా.. ఇప్పటికీ తన సహజసిద్ధమైన బ్యాటింగ్ నైపుణ్యంపైనే ఆధారపడుతున్నాడని విమర్శించారు. రోహిత్ ఇప్పటికైనా కఠోర సాధన చేసి అత్యుత్తమంగా రాణించడంపై దృష్టి సారించాలని మంజ్రేకర్ సూచించారు. జియోస్టార్‌లో సంజయ్ మంజ్రేకర్ మాట్లాడుతూ… ‘ప్రస్తుతం […] -
SRH-HCA: సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆరోపణలపై స్పందించిన హెచ్‌సీఏ!
ఈరోజు ఉదయం నుంచి హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) పేరు అటు సోషల్ మీడియాలో, ఇటు టీవీల్లో మార్మోగిన విషయం తెలిసిందే. ఉచిత టిక్కెట్ల కోసం హెచ్‌సీఏ తమను దారుణంగా హింసిస్తోందని, వేధింపులు ఇలానే కొనసాగితే హైదరాబాద్ నగరాన్ని ఫ్రాంఛైజీ వీడిపోవడానికి సిద్ధంగా ఉందని సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) ఓ లేఖ రాసినట్లు న్యూస్ చక్కర్లు కొట్టాయి. ఈ వార్తలపై హెచ్‌సీఏ అధికార ప్రకటన విడుదల చేసింది. ఆ వార్తల్లో వాస్తవం లేదని స్పష్టం చేసింది. ‘ఎస్ఆర్హెచ్యాజమాన్యం […] -
CM Chandrababu: ఉగాది రోజున సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం!
ఉగాది పండగ రోజున పేదలకు సాయంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. రూ.38 కోట్ల సీఎం సహాయ నిధి ఫైలుపై సంతకం చేశారు. దాంతో 3,456 మంది లబ్ధిదారులకు మేలు జరగనుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటివరకు సీఎంఆర్ఎఫ్ ద్వారా రూ.281 కోట్లు విడుదల చేసింది. వైద్యం చేయించుకుని ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న పేద కుటుంబాలను ఆదుకునేందుకు సీఎం సహాయ నిధి ఉపయోగపడుతుంది. Also Read: Hardik Pandya: హార్దిక్ పాండ్యాకు […] -
Top Headlines @1PM: టాప్ న్యూస్!
ప్రస్తుతం టెక్నాలజీ మీద ప్రపంచం ఆధారపడి ముందుకెళ్తోంది: విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండగను ప్రజలు సుఖసంతోషాలతో జరుపుకోవాలని కోరారు. ఇక, సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన సమన్వయ పరుస్తున్నాం.. ప్రజలు ముందుకు అనే నినాదంతో ముందుకెళ్తున్నామని సీఎం చంద్రబాబు చెప్పారు. ఇక […] -
Hardik Pandya: హార్దిక్ పాండ్యాకు షాక్.. మొదటి మ్యాచ్‌లోనే..!
ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు షాక్ తగిలింది. ఐపీఎల్ 2025లో ఆడిన మొదటి మ్యాచ్‌లోనే హార్దిక్‌కు జరిమానా పడింది. శనివారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా అతడికి రూ.12 లక్షలు ఫైన్‌ను ఐపీఎల్ విధించింది. ఈ సీజన్లో తొలి తప్పిదం కాబట్టి ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆర్టికల్ 2.2 ప్రకారం స్లో ఓవర్ రేట్ కారణంగా హార్దిక్‌కు రూ.12 లక్షల జరిమానా విధించాం అని ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ […]
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!