తనకు లాస్ ఏంజిల్స్‌లో ఆడాలనుందని ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ తెలిపాడు. ఒలింపిక్స్ పోటీలను చూసినప్పుడు చాలా ఉత్సాహంగా ఉంటుందని, అందులో భాగం కావాలనుందని చెప్పాడు. ఇటీవల పారిస్ నగరంలో ఒలింపిక్స్ ముగిసిన విషయం తెలిసింది. ఇక లాస్ ఏంజిల్స్ వేదికగా 2028లో ఒలింపిక్స్ జరగనున్నాయి. 1900 సంవత్సరం తర్వాత విశ్వ క్రీడల్లో క్రికెట్‌కు చోటు కల్పిస్తూ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) నిర్ణయం తీసుకుంది.
Also Read: Kandula Durgesh: పోలవరం ప్రాజెక్టు దస్త్రాల దహనం.. అధికారులపై మంత్రి కందుల దుర్గేశ్ ఆగ్రహం!
తాజాగా పాట్ కమిన్స్ మాట్లాడుతూ ఆస్ట్రేలియా తరఫున ఒలింపిక్స్‌లో ఆడాలనే కోరిక ఉందని చెప్పాడు. ‘ఒలింపిక్స్ పోటీలను చూసినప్పుడు ఎంతో ఉత్సాహంగా ఉంటుంది. నాకు విశ్వ క్రీడల్లో భాగం కావాలని ఉంది. 2028లో ఒలింపిక్స్ జరగనున్నాయి. అప్పటికి నాకు 35 ఏళ్లు వస్తాయి. అప్పుడు ఆస్ట్రేలియా తరఫున ఆడతాననే అనుకుంటున్నా. దానికి ఇంకా చాలా రోజుల సమయం ఉంది. ఒలింపిక్స్ దగ్గరపడినప్పుడు సన్నాహాలు ప్రారంభిస్తాం. ఒలింపిక్స్ సమయానికి ఫిట్‌గా, ఫామ్‌లో ఉండే వారికి జట్టులో అవకాశం దొరుకుతుంది’ అని కమిన్స్ అన్నాడు. 2028 ఒలింపిక్స్‌లో ఏ ఫార్మాట్లో క్రికెట్ మ్యాచ్‌లు నిర్వహిస్తారనేది ఇంకా తెలియదు. అయితే టీ20 ఫార్మాట్‌లోనే ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇటీవల ఆస్ట్రేలియాకు కమిన్స్ వన్డే ప్రపంచకప్ అందించిన విషయం తెలిసిందే.