దేశంలో గత రెండు సంవత్సరాలుగా బంగారం, వెండి ధరలు రోజురోజుకు పెరుగుతూ పోతున్నాయి. ఈ క్రమంలో కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రికార్డు స్థాయిలో 81 వేలు దాటింది. మరోవైపు కిలో వెండి లక్ష దాటేసింది. ఇప్పుడు బంగారానికి ఉన్న క్రేజ్ డాలర్‌కు కూడా లేదనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. గోల్డ్ అన్‌స్టాపబుల్ మార్కెట్ స్పీడ్‌కు మద్యతరగతి ప్రజలకు చుక్కలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తుంటే ధరలు […]
ఫ్రాంచైజీలు తమ రిటైన్డ్ ప్లేయర్ జాబితాలను సమర్పించేందుకు అక్టోబర్ 31ని గడువుగా ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ నిర్ణయించింది. ఐపీఎల్ 2025 కోసం ఓ ఫ్రాంచైజీ ఆరుగురు ప్లేయర్లను రిటైన్ చేసుకోవచ్చు. అందులో గరిష్టంగా అయిదుగురు క్యాప్డ్ ప్లేయర్లు, ఇద్దరు అన్క్యాప్డ్ ప్లేయర్స్ ఉండాలి. ఆరుగురినినేరుగా రిటైన్ చేసుకోవచ్చు, లేదా ఆర్టీఎమ్ కార్డ్‌తో వేలంలో దక్కించుకోవచ్చు. రిటైన్ లిస్ట్‌ను సమర్పించడానికి ఫ్రాంచైజీలకు మరికొన్ని గంటలు మాత్రమే గడువు ఉంది. ఇప్పటికే ఫ్రాంచైజీలు దాదాపుగా తమ రిటైన్ లిస్ట్‌ను ఖరారు […]
ఐపీఎల్ 2025కి ముందు మెగా వేలం జరగనున్న విషయం తెలిసిందే. ఈసారి ఆరుగురు ఆటగాళ్లను అట్టిపెట్టుకోవడానికి ఫ్రాంఛైజీలకు ఇప్పటికే ఐపీఎల్ పాలక వర్గం అనుమతించింది. ఇందులో ఒక రైట్ టు మ్యాచ్ (ఆర్టీఎం) ఉంటుంది. రిటైన్ జాబితాను ప్రకటించడానికి అక్టోబర్ 31 తుది గడువు. రిటైన్ ప్లేయర్ల లిస్ట్‌ను సమర్పించడానికి ఫ్రాంచైజీలకు మరికొన్ని గంటలు మాత్రమే ఉన్నా.. ఇప్పటివరకు ఏ జట్టు కూడా అధికారికంగా జాబితాను విడుదల చేయలేదు. అయితే రాజస్థాన్ రాయల్స్ ఆరుగురిని రిటైన్ చేసుకుందని […]
ఐపీఎల్ 2025కి ముందు మెగా వేలం జరగనుంది. ప్రాంఛైజీలు తమ రిటెన్షన్ జాబితాను అక్టోబర్ 31 లోపు సమర్పించాల్సి ఉంది. తుది గడువుకు మరికొన్ని గంటలే ఉన్న నేపథ్యంలో అభిమానుల దృష్టి అంతా రిటెన్షన్ జాబితాపైనే ఉంది. ఏ ప్రాంచైజీ ఏయే ఆటగాళ్లను అట్టిపెట్టుకుంటుంది, ఎవరిని వేలంలోకి వదిలేస్తుందన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. తుది గడువు సమీపిస్తున్నా కొద్దీ.. స్టార్ ఆటగాళ్ల చుట్టూ పలు ఆసక్తికర కథనాలు చక్కర్లు కొడుతున్నాయి. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరోసారి […]
న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన స్థాయికి తగ్గట్టుగా ఆడలేకపోతున్నాడు. తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో వర్షం ప్రభావం కారణంగా ఇబ్బంది పడి డకౌట్ కాగా.. రెండో ఇన్నింగ్స్‌లో (70) హాఫ్ సెంచరీ చేసినా జట్టును మాత్రం ఆదుకోలేదు. రెండో టెస్టులో 1, 17 రన్స్ చేసి పెవిలియన్ చేరాడు. స్పిన్‌ను ఉతికారేసే కోహ్లీ.. సొంతగడ్డపై స్పిన్నర్లకే వికెట్లను ఇచ్చేయడం అందరిని నిరాశకు గురిచేస్తోంది. విరాట్ ఆట తీరుపై ఆస్టేలియా మాజీ […]
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ కిదాంబి శ్రీకాంత్ కలిశారు. మంగళవారం జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసానికి వెళ్లి సీఎంను మర్యాదపూర్వకంగా కలిసిన శ్రీకాంత్.. తన వివాహానికి హాజరుకావాలని ఆహ్వానించారు. శ్రీకాంత్, ఆయనకు కాబోయే భార్య శ్రావ్య వర్మలు సీఎంకు శుఖలేఖను అందజేశారు. ఇందుకు సంబందించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ 2018లో పద్మశ్రీ అందుకున్నాడు. 2015లో అర్జున అవార్డు సైతం అతడికి దక్కింది. కెరీర్ ఆరంభంలో అనూహ్య […]
గత రెండు సంవత్సరాలుగా దేశంలో బంగారం, వెండి ధరలు స్ధిరంగా ఉండటం లేదు. రోజురోజుకు పెరుగుతూ పోతున్నాయి. ఈ క్రమంలో నిరంతరం కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ఇప్పటికే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రికార్డు స్థాయిలో 80 వేలు దాటింది. అయినా కూడా పెరుగుదల ఆగడం లేదు. వరుసగా రెండోరోజు గోల్డ్ రేట్స్ భారీగా పెరిగాయి. బులియన్ మార్కెట్లో బుధవారం (అక్టోబర్ 29) 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై రూ.650 పెరిగి.. రూ.74,400గా […]
టీమిండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీకి ఐపీఎల్ ప్రాంచైజీ గుజరాత్ టైటాన్స్ భారీ షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2025 మెగా వేలంలోకి షమీని వదిలేందుకు సిద్దమైందని సమాచారం. గుజరాత్ రిటైన్ లిస్టులో షమీ పేరు లేదని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. చీలమండ గాయం కారణంగా ఏడాదికి పైగా షమీ ఆటకు దూరమవడంతోనే గుజరాత్ మేనేజ్మెంట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మహహ్మద్ షమీ చీలమండ గాయంతో భారత జట్టుకు దూరమయ్యాడు. ఈ ఏడాదిలో ఒక్క […]
భారత గడ్డపై టీమిండియాపై విజయంను తాము డబ్ల్యూటీసీ ఫైనల్లో సాధించిన గెలుపు కంటే ఎక్కువని భావిస్తున్నాం అని న్యూజిలాండ్ స్టార్ పేసర్ టిమ్ సౌథీ తెలిపాడు. బెంగళూరు టెస్టులో టాస్‌తో అదృష్టం కలిసొచ్చిందని, ఒకవేళ భారత్ మొదట బౌలింగ్ తీసుకొని ఉంటే తమకు కష్టాలు ఉండేవే అని చెప్పాడు. రెండో టెస్టులో మాత్రం తాము అనుకున్నట్లుగానే ఆడి ఫలితం రాబట్టాం అని సౌథీ చెప్పుకొచ్చాడు. భారత్‌తో మూడు టెస్టుల సిరీస్‌ను మరో మ్యాచ్ ఉండగానే.. న్యూజిలాండ్ 2-0 […]
పండుగ సీజన్ వేళ విద్యుత్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ‘ఓలా ఎలక్ట్రిక్’ బిగ్గెస్ట్ సేల్‌ను తీసుకొచ్చింది. బాస్ ఆఫర్లలో భాగంగా ’72 గంటల రష్’ సేల్‌ను ప్రకటించింది. కస్టమర్లు ఎస్1 పోర్ట్‌ఫోలియోపై రూ.25000 వరకు తగ్గింపులను పొందవచ్చు. అలానే స్కూటర్లపై రూ.30,000 వరకు విలువైన అదనపు ప్రయోజనాలను పొందవచ్చు. అక్టోబర్ 31 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ఓలా ఈవీలు కొనడానికి ఇదే మంచి సమయం అని చెప్పాలి. బాస్ ప్రయోజనాలు: బాస్ ధరలు: […]