IND vs NZ: భారత్‌పై విజయం డబ్ల్యూటీసీ ఫైనల్ కంటే ఎక్కువ.. సౌథీ ఆసక్తికర వ్యాఖ్యలు!
- 2-0 తేడాతో టెస్టు సిరీస్ కైవసం
- సౌథీ ఆసక్తికర వ్యాఖ్యలు
- డబ్ల్యూటీసీ ఫైనల్ కంటే ఎక్కువ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత గడ్డపై టీమిండియాపై విజయంను తాము డబ్ల్యూటీసీ ఫైనల్‌లో సాధించిన గెలుపు కంటే ఎక్కువని భావిస్తున్నాం అని న్యూజిలాండ్ స్టార్ పేసర్ టిమ్ సౌథీ తెలిపాడు. బెంగళూరు టెస్టులో టాస్‌తో అదృష్టం కలిసొచ్చిందని, ఒకవేళ భారత్ మొదట బౌలింగ్ తీసుకొని ఉంటే తమకు కష్టాలు ఉండేవే అని చెప్పాడు. రెండో టెస్టులో మాత్రం తాము అనుకున్నట్లుగానే ఆడి ఫలితం రాబట్టాం అని సౌథీ చెప్పుకొచ్చాడు. భారత్‌తో మూడు టెస్టుల సిరీస్‌ను మరో మ్యాచ్ ఉండగానే.. న్యూజిలాండ్ 2-0 తేడాతో కైవసం చేసుకుంది. మూడో టెస్ట్ మ్యాచ్ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో సౌథీ మీడియాతో మాట్లాడాడు.
‘భారత్ సొంతగడ్డపై గత 12 ఏళ్ల నుంచి వరుసగా 18 సిరీస్‌లు గెలిచింది. ఏ జట్టుకైనా భారత్‌లో ఆడటం చాలా కష్టం. నేను ఇక్కడ చాలా మ్యాచ్‌లు ఆడాను. ఆస్ట్రేలియాలో కూడా ఆడటం కూడా చాలా కష్టమే. అక్కడి పరిస్థితులు విభిన్నంగా ఉంటాయి. ఇరు ప్రత్యర్థులు కూడా నాణ్యమైన క్రికెట్ ఆడతారు. అందుకే విదేశీ జట్లకు గెలుపు అంత తేలిక కాదు. భారత్‌లో మేం విజేతగా నిలిచాం. చాలా సంతోషంగా ఉన్నాం. ఈ విజయం మేం డబ్ల్యూటీసీ ఫైనల్‌లో సాధించిన గెలుపు కంటే ఎక్కువని భావిస్తున్నాం’ అని టిమ్ సౌథీ చెప్పాడు.
Also Read
- Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
- Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
- Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
- Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
Also Read: Ola Boss Offer: 72 గంటల రష్ సేల్.. ఓలా ఎస్1 పోర్ట్‌ఫోలియోపై 25 వేల తగ్గింపు!
‘బెంగళూరు టెస్టులో మాకు టాస్ ద్వారా అదృష్టం కలిసొచ్చింది. ఒకవేళ టీమిండియా మొదట బౌలింగ్ తీసుకొని ఉంటే.. మాకు కష్టాలు తప్పక పోవచ్చు. బెంగళూరు వికెట్ అలా స్పందిస్తుందని ఎవరూ ఊహించరు. పరిస్థితులను ఉపయోగించుకుని.. మేం పైచేయి సాధించాం. పూణే టెస్టులో మాత్రం ప్రణాళికల ప్రకారం ఆడి విజయం సాధించాం. ఏ మ్యాచ్‌కైనా మరీ ఎక్కువగా ప్రీప్లాన్ చేయకూడదు. మేం అలా ఎప్పుడూ చేయం. అదే మా బలం అని నేను అనుకుంటున్నా. పరిస్థితులకు తగ్గట్టుగా ఆడటం వలనే మెరుగ్గా రాణిస్తున్నాం’ అని సౌథీ పేర్కొన్నాడు. 12 ఏళ్ల కిందట చివరిసారిగా స్వదేశంలో భారత్ ఓడింది. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ జట్లు కూడా ఇక్కడ టెస్ట్ సిరీస్‌ను సాధించలేకపోయాయి. చివరకు కివీస్ టెస్ట్ సిరీస్‌ను కైవసం చేసుకుంది.
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!