పదోతరగతి విద్యార్థి వెన్నెల తల్లిదండ్రులు మధురపూడి విమానాశ్రయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను కలిశారు. తమ కుమార్తె విషయంను పవన్ దృష్టికి వెన్నెల కుటుంబ సభ్యులు తీసుకెళ్లారు. వెన్నెల ఆత్మహత్యకు పాఠశాల యాజమాన్యమే కారణమని తల్లిదండ్రులు ఆరోపించారు. తమకు న్యాయం చేయాలంటూ నేడు పవన్ కాన్వాయ్కి అడ్డుపడ్డారు. మధ్యాహ్నం వచ్చి మాట్లాడతానని డిప్యూటీ సీఎం పవన్ వారికి భరోసా ఇచ్చారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం చెముడు లంకకు చెందిన వెన్నెల.. సెలవు రోజుల్లో […]
దేశవ్యాప్తంగా ‘దీపావళి’ పండుగ అంగరంగ వైభవంగా జరిగింది. పూజలు, నోములు, దీపాలతో యావత్ దేశం ఘనంగా దీపావళి జరుపుకుంది. గురువారం రాత్రి అయితే పటాసుల పేలుళ్లతో దేశం మొత్తం మార్మోగిపోయింది. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా బాణసంచాను కాల్చి పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. అయితే దీపావళి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో ఓ వింత ఆచారంను పాటించారు. దోర్నాల మండలం వై.చర్లోపల్లిలో దీపావళి పండుగ సందర్భంగా ఓ వింత ఆచారాన్ని గ్రామస్తులు ఆనవాయితీగా […]
శ్రీకాకుళం జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కూలీలతో వెళ్తున్న ఆటో.. కంచిలి మండలం బారువా సమీపంలో బోల్తా పడింది. ఈ ఘటనలో 12 మందికి గాయాలు అయ్యాయి. నలుగురు కూలీలకు తీవ్ర గాయాలు కాగా.. వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలంకు చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. ఆటో అదుపు తప్పడం వలనే ఈ ప్రమాదం జరిగుండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఇస్సకోడేరులో […]
అనంతపురం కలెక్టరేట్లో వెపన్ మిస్ ఫైర్ ఘటన కలకలం సృష్టించింది. తెల్లవారుజామున 5:30 గంటల సమయంలో కలెక్టరేట్లో గార్డు డ్యూటీలో ఉన్న (1996 బ్యాచ్ AR HC 2242) సుబ్బరాజు 303 వెపన్ క్లీన్ చేస్తుండగా మిస్ ఫైర్ అయింది. ఛాతీలో నుంచి బుల్లెట్ బయటకు వెళ్లిపోయింది. త్రీవంగా గాయపడిన సుబ్బరాజును అక్కడే ఉన్న గార్డు సిబ్బంది చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వ ఆస్పుత్రికి తరలించారు. Also Read: Ind vs NZ: టాస్ గెలిచి బ్యాటింగ్ […]
శ్రీకాకుళం జిల్లాలో సీఎం పర్యటన: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి సీఎం చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. దీపావళి పండుగ రోజు సీఎం దీపం పథకం 2.0 గురించి చెప్పారు. దీపావళి కానుకగా శ్రీకాకుళం జిల్లా నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేసేందుకు సిద్ధం అయ్యారు. ఈ క్రమంలో శుక్రవారం శ్రీకాకుళం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఇచ్ఛాపురం నియోజకవర్గం, ఈదుపురంలో దీపం 2.0 ఉచిత సిలిండర్ల […]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి సీఎం చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. దీపావళి పండుగ రోజు సీఎం దీపం పథకం 2.0 గురించి చెప్పారు. దీపావళి కానుకగా శ్రీకాకుళం జిల్లా నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేసేందుకు సిద్ధం అయ్యారు. ఈ క్రమంలో శుక్రవారం శ్రీకాకుళం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఇచ్ఛాపురం నియోజకవర్గం, ఈదుపురంలో దీపం 2.0 ఉచిత సిలిండర్ల పథకాన్ని సీఎం ప్రారంభించనున్నారు. శ్రీకాకుళం […]
కాకినాడ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కాజులూరు మండలం శలపాకలో రెండు కుటుంబాల మధ్య జరిగిన కత్తుల దాడిలో ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందారు. పక్క పక్క నే ఉంటున్న రెండు కుటుంబాల మధ్య విభేదాల కారణంగానే ఈ గొడవ జరిగినట్లు తెలుస్తోంది. ఒక మహిళ విషయమై రెండు కుటుంబాల మధ్య ఘర్షణ జరిగిందని సమాచారం. చనిపోయిన ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన వారు. శలపాక గ్రామంలో గురువారం రాత్రి 9 గంటల సమయంలో ఒకే సామాజిక […]
నేడు శ్రీకాకుళం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఈదుపురంలో దీపం పథకాన్ని సీఎం ప్రారంభించనున్నారు. దీపం పథకంతో కోటి 50 లక్షల కుటుంబాలు లబ్ధి పొందనున్నాయి. నేడు ఏలూరు ద్వారకా తిరుమల మండలంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. ఐయస్ జగన్నాధపురం శ్రీ లక్ష్మీనరసింహస్వామిని పవన్ దర్శించుకోనున్నారు. అనంతరం దీపం పథకం ద్వారా ఉచిత గ్యాస్ సిలిండర్లు అందజేయనునున్నారు. నేటి నుంచి తూర్పుగోదావరి జిల్లా రేషన్ షాపుల్లో కందిపప్పు, పంచదార, జొన్నలు పంపిణీ చేయనున్నారు. పాయింట్లకు […]
బీపీఎల్ గ్రూప్ ఛైర్మన్ టీపీ గోపాలన్ నంబియార్ మృతి పట్ల ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. భారతీయ ఎలక్ట్రానిక్స్‌కు మార్గదర్శకుడైన నంబియార్‌కు కోల్పయినందుకు తనకు చాలా బాధగా ఉందన్నారు. తన అద్భుత నాయకత్వంతో బీపీఎల్‌ను అందరి ప్రియమైన బ్రాండ్‌గా మార్చాడన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థకు అందించిన ఆయన సేవలు ఎల్లప్పుడూ గుర్తుండిపోతాయని సీఎం చంద్రబాబు ఎక్స్‌లో పేర్కొన్నారు. ‘బీపీఎల్ గ్రూప్ ఛైర్మన్, భారతీయ ఎలక్ట్రానిక్స్‌కు మార్గదర్శకుడైన టీపీ గోపాలన్ నంబియార్‌ను కోల్పయినందుకు చాలా బాధగా […]
ఆగని ఇసుక మాఫియా ఆగడాలు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎన్టీఆర్ జిల్లాలో ఇసుక మాఫియా ఆగడాలు పెరిగిపోతున్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండా.. ఇసుకను యథేచ్ఛగా తరలిస్తున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారినా ఇసుక అక్రమాలు మాత్రం ఆగడం లేదు. తాజాగా ఇసుక అక్రమ తవ్వకాలకు పెనుగంచిప్రోలు మండలం అనిగండ్లపాడు కేంద్రంగా మారింది. అనిగండ్లపాడు రీచ్ వద్ద ఇసుక మాఫీయా హల్చల్ చేసింది. గ్రామ సరిహద్దు వద్ద ర్యాంపు నుంచి ఇసుకను తెలంగాణకు తరలిస్తున్నాయి. అన్నిండ్లపాడు గ్రామ సరిహద్దు వద్ద ర్యాంపులో […]