సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో ఘోర పరాభవం చవిచూసిన భారత్.. ఇప్పుడు కీలక సమరానికి సిద్ధమవుతోంది. నవంబర్ 22 నుంచి ప్రారంభం కానున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024లో ఆస్ట్రేలియాతో తలపడనుంది. గత రెండు సిరీస్‌లు గెలుచుకున్న టీమిండియా.. హ్యాట్రిక్‌పై కన్నేసింది. డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే ఆస్ట్రేలియాపై భారత్ ఐదు మ్యాచ్‌ల్లో కనీసం నాలుగింటిలోనైనా గెలవాలి. కీలక సిరీస్ కాబట్టి భారత ఆటగాళ్లు ముందుగానే కంగారో గడ్డపై అడుగుపెడుతున్నారు. ఇప్పటికే బ్యాటర్లు కేఎల్ రాహుల్, ధ్రువ్ జురెల్‌లు ఆస్ట్రేలియా చేరుకున్నారు. […]
ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ప్రాంచైజీ ముగ్గురిని మాత్రమే రిటైన్ చేసుకుంది. విరాట్ కోహ్లీ (రూ.21 కోట్లు), రజత్ పాటిదార్ (రూ.11 కోట్లు), యశ్ దయాళ్ (రూ.5 కోట్లు)ను ఆర్సీబీ అట్టిపెట్టుకుంది. చాలామంది స్టార్ ఆటగాళ్లను వేలంలోకి వదిలేసింది. 2021 నుంచి జట్టులో ఉన్న ఆస్ట్రేలియా హిట్టర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ను ఆర్సీబీ రిటైన్ చేసుకోలేదు. ఇది చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఆర్సీబీ తనను అట్టిపెట్టుకోవడంపై తాజాగా మ్యాక్సీ స్పందించాడు. […]
‘పరుగుల రారాజు’ విరాట్ కోహ్లీ గత కొన్నేళ్లుగా సరైన ప్రదర్శన చేయలేకపోతున్నాడు. ఒకప్పుడు అలవోకగా సెంచరీలు బాదిన విరాట్.. ఇప్పుడు క్రీజులో నిలబడడానికే నానా తంటాలు పడుతున్నాడు. ఎప్పుడో ఓసారి మెరుపులు తప్పితే.. మునుపటి కోహ్లీ మనకు కనబడుట లేదు. గతంలో అన్ని ఫార్మాట్లలోనూ నంబర్‌వన్ ర్యాంకు అందుకున్న కింగ్.. ప్రస్తుతం ర్యాంకింగ్స్‌లో కిందికి పడిపోతున్నాడు. ఎంతలా అంటే టాప్-20 నుంచి కూడా ఔట్ అయ్యాడు. బుధవారం ఐసీసీ ప్రకటించిన టెస్టు బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో విరాట్ కోహ్లీ […]
న్యూజిలాండ్‌తో జరిగిన మూడు టెస్టులూ ఓడిపోయి భారత్ తీవ్ర పరాభవంను మూటగట్టుకుంది. భారత టెస్టు క్రికెట్ చరిత్రలో సొంతగడ్డపై మూడు లేదా అంతకంటే ఎక్కువ మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ తొలిసారి వైట్‌వాష్‌కు గురైంది. రెండు టెస్టుల్లో ఓటమితో పాఠాలు నేర్వని రోహిత్ సేన.. మూడో టెస్టులో సైతం ఓడడంపై విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. కెప్టెన్ రోహిత్ శర్మ, సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సహా కోచ్ గౌతమ్ గంభీర్‌లు ఓటమికి బాధ్యత వహించాలని మాజీ క్రికెటర్లు అంటున్నారు. […]
దక్షిణాఫ్రికా, భారత్ జట్ల మధ్య నవంబర్ 8 నుంచి టీ20ల సిరీస్ ప్రారంభం కానుంది. నాలుగు టీ20ల సిరీస్‌లో భాగంగా నవంబర్ 8న తొలి మ్యాచ్ డర్బన్ వేదికగా జరగనుంది. ఈ సిరీస్ కోసం ఇప్పటికే దక్షిణాఫ్రికాకు చేరుకొన్న భారత జట్టు ప్రాక్టీస్‌లో నిమగ్నమైంది. భారత జట్టుకు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. సిరీస్ లక్ష్యంగా భారత్ బరిలోకి దిగుతోంది. టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని దక్షిణాఫ్రికా భావిస్తోంది. దక్షిణాఫ్రికా, భారత్ టీ20ల […]
ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ‘పుష్ప: ది రూల్’. 2021లో విడుదలై బ్లాక్ బస్టర్‌గా నిలిచిన ‘పుష్ప’ చిత్రానికి సీక్వెల్‌గా ఇది వస్తోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అవుతోంది. రిలీజ్‌కు ముందే ఇప్పటికే పలు రికార్డులను సొంతం చేసుకున్న పుష్ప 2.. తాజాగా మరో రికార్డును ఖాతాలో వేసుకుంది. పుష్ప: ది రూల్ చిత్రం డిసెంబర్ […]
దక్షిణాఫ్రికా, భారత్ జట్ల మధ్య నాలుగు టీ20ల సిరీస్ జరగనున్న విషయం తెలిసిందే. నవంబర్ 8న డర్బన్ వేదికగా మొదటి మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే దక్షిణాఫ్రికాకు చేరుకున్న టీమిండియా ప్రాక్టీస్ చేస్తోంది. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత జట్టు ప్రొటీస్ గడ్డపై టీ20 సిరీస్ గెలవాలని చూస్తోంది. మరోవైపు టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని దక్షిణాఫ్రికా భావిస్తోంది. ఈ నేపథ్యంలో రసవత్తర పోరు ఖాయంగా కనిపిస్తోంది. ఈ టీ20 సిరీస్‌లో టీమిండియా స్టార్ […]
ప్రముఖ మెసేజింగ్ యాప్ ‘వాట్సాప్’ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను తీసుకొస్తున్న విషయం తెలిసిందే. యూజర్ల భద్రత కోసం ఇప్పటికే ఎన్నో ఫీచర్లను తీసుకొచ్చిన వాట్సాప్.. తాజాగా మరో ఫీచర్‌ను తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. ఇమేజ్‌ల మూలాలను గుర్తించేందుకు రివర్స్ ఇమేజ్ సెర్చ్ సదుపాయాన్ని ప్రవేశపెట్టింది. వాట్సప్‌లోని చిత్రాల కోసం ‘సెర్చ్ ఆన్ వెబ్’ (Search on web) ఆప్షన్‌ను తీసుకొస్తోంది. ఈ ఆప్షన్ సాయంతో వాట్సప్‌లోనే నేరుగా ఇమేజ్ గురించి సెర్చ్ చేయొచ్చు. వాట్సాప్‌లో నేరుగా ఇమేజ్ గురించి […]
17 ఏళ్ల వయసులోనే తన తండ్రి దూరమైనట్లు, అప్పటినుంచి ఆయన జ్ఞాపకాలతోనే జీవిస్తున్నట్లు హీరో శివ కార్తికేయన్ తెలిపారు. తన తండ్రి మరణించిన అనంతరం తాను ఎన్నో బాధలు పడినట్లు చెప్పారు. ‘అమరన్’ సినిమా చేయడానికి ప్రధాన కారణం తన తండ్రే అని భావోద్వేగానికి గురయ్యారు. మేజర్ ముకుంద్ వరదరాజన్‌కు, తన నాన్నకు మధ్య చాలా పోలికలు ఉన్నాయని శివ కార్తికేయన్ చెప్పుకొచ్చారు. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో శివ కార్తికేయన్ నటించిన చిత్రం అమరన్. అక్టోబర్ 31న […]
ఐపీఎల్ 2025 మెగా వేలం నవంబర్ 24, 25వ తేదీల్లో సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరగనుంది. సోమవారం (నవంబర్ 4)తో ఆటగాళ్ల నమోదు అధికారికంగా ముగియగా.. మొత్తం 1,574 మంది క్రికెటర్లు వేలం కోసం పేర్లు రిజిస్టర్ చేసుకున్నారు. ఇందులో 1,165 మంది భారతీయ క్రికెటర్స్ ఉండగా.. 409 మంది విదేశీయులు ఉన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి వేలంలో చాలా మంది టీమిండియా స్టార్ ఆటగాళ్లు ఉన్నారు. వీరు మెగా వేలంలో భారీ ధర పలికే […]