అండర్ -19 ప్రపంచ కప్ హీరోగా జట్టులోకి వచ్చి.. విలువైన ఆటగాడిగా, సమర్ధుడైన నాయకుడిగా భారత జట్టుపై తన ముద్ర వేశాడు. అంతేకాదు ప్రపంచ క్రికెట్లో రన్ మెషీన్‌గా.. రికార్డులు బద్ధలు కొట్టే రారాజుగా.. క్రికెట్ ఛేజ్ మాస్టర్‌గా గుర్తింపు పొందాడు. తన క్లాస్ ఇన్నింగ్స్‌లతో అభిమానుల గుండెల్లో చెలరేగని స్థానం సంపాధించిన భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ పుట్టిన రోజు నేడు. నేటితో కోహ్లీ 36వ ఏడాదిలోకి అడుగుపెట్టాడు. ప్రపంచవ్యాప్తంగా అభిమానులు కోహ్లీ పుట్టినరోజు […]
నేడు టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ పుట్టినరోజు. నేటితో కింగ్ కోహ్లీ 36వ ఏడాదిలోకి అడుగుపెట్టాడు. భారత్ మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు విరాట్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. కోహ్లీపై అభిమానంతో ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ అద్భుత ఆర్ట్‌ను రూపొందించారు. ఒడిశాలోని పూరీ బీచ్‌లో 5 అడుగుల సైకత శిల్పాన్ని రూపొందించారు. దాదాపు నాలుగు టన్నుల ఇసుకతో తయారు చేసినట్లు సుదర్శన్ తెలిపారు. Also Read: […]
మగువలకు శుభవార్త. పండగలు, వివాహాది శుభకార్యాల నేపథ్యంలో ఇటీవల వరుసగా దూసుకెళ్లిన బంగారం ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. వరుసగా రెండు రోజులు తగ్గి, మరో రెండు రోజులు స్థిరంగా ఉన్న పసిడి రేట్స్.. నేడు కాస్త దిగొచ్ఛాయి. బులియన్ మార్కెట్లో మంగళవారం (నవంబర్ 5) 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై రూ.150 తగ్గి.. రూ.73,550గా నమోదైంది. 24 క్యారెట్లపై రూ.160 తగ్గి.. రూ.80,240గా ఉంది. మరోవైపు బంగారం బాటలోనే వెండి ధరలు కూడా పయనిస్తున్నాయి. […]
గేమింగ్ ప్రియుల కోసం తైవాన్‌కు చెందిన ప్రముఖ మొబైల్ కంపెనీ ‘ఆసుస్’ తన రోగ్ సిరీస్‌లో మరో కొత్త 5జీ మోడల్‌ను విడుదల చేయడానికి సిద్దమైంది. ‘రాగ్ ఫోన్ 9’ను గ్లోబల్ మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు ఆసుస్ సన్నాహాలు చేస్తోంది. నవంబర్ 19వ తేదీన రాగ్ ఫోన్ 9 స్మార్ట్ ఫోన్‌ను మార్కెట్లోకి లాంచ్ చేయనున్నారు. భారత్‌లోనూ ఈ ఫోన్‌ను ఆసుస్ లాంచ్ చేయనుంది. ఆసుస్ రాగ్ ఫోన్ 9కు సంబంధించి కొన్ని ఫీచర్లను కంపెనీ ప్రకటించింది. ఈ […]
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఎస్ శంకర్ల కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా ‘గేమ్ ఛేంజర్’. ఈ సినిమా అప్డేట్స్ కోసం మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. దసరా, దీపావళికి టీజర్ విడుదల అవుతుందని వార్తలు వచ్చినా.. అది జరగలేదు. తాజాగా గేమ్ ఛేంజర్ టీజర్ డేట్ లాక్ అయింది. నవంబర్ 9న టీజర్ లాంచ్ ఈవెంట్ లక్నోలో జరగనుంది. గేమ్ ఛేంజర్ టీజర్ లాంచ్ ఈవెంట్‌కు రామ్ చరణ్, ఎస్ శంకర్ సహా టీమ్ మొత్తం […]
‘నథింగ్’ ఫోన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అసవరం లేదు. ట్రాన్స్పరెంట్ లుక్‌తో మొబైల్ మార్కెట్లో సంచలనం రేపింది. స్మార్ట్‌ఫోన్ అంటే ఇలానే ఉండాలనే కట్టుబాట్లకు తన ట్రాన్స్పరెంట్ లుక్‌తో నథింగ్ చెక్ పెట్టింది. ఇక ఇప్పుడు మరో నథింగ్ ప్రయోగానికి సిద్ధమైంది. ఆపరేటింగ్ సిస్టమ్ (ఓఎస్)లో ఆండ్రాయిడ్, ఐఓఎస్‌ల ఆధిపత్యం కొనసాగుతున్న ఈ సమయంలో సొంతంగానే ఓ ఓఎస్‌ను రూపొందించాలని ప్లాన్ చేస్తోంది. ఈ విషయాన్ని కంపెనీ వ్యవస్థాపకుడు కార్ల్ పై వెల్లడించారు. ఓ సదస్సులో కార్ల్ […]
స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో భారత్ 3-0 తేడాతో ఓడిపోయింది. టెస్టు చరిత్రలో భారత గడ్డపై రెండో వైట్‌వాష్‌ను ఎదుర్కొంది. దీనికి కారణం స్పిన్‌లో మనోళ్లు తేలిపోవడమే. స్వదేశంలో స్పిన్ పిచ్‌లపై ప్రత్యర్థి జట్లను చిత్తు చేయడం టీమిండియాకు అలవాటు. ఇప్పుడు మన బలమే బలహీనతగా మారింది. మన స్పిన్ ఉచ్చు మన మెడకే చుట్టుకుంటోంది. దాంతో రోహిత్ సేనపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో న్యూజిలాండ్ మాజీ బౌలర్ సైమన్ డౌల్ స్పందించాడు. […]
ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం ప్రారంభమైంది. దీపం 2.0లో భాగంగా శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం ఈదుపురంలో సీఎం చంద్రబాబు దీన్ని ప్రారంభించారు. ఈదుపురంలో మహిళా లబ్ధిదారు శాంతమ్మ ఇంటికి వెళ్లిన సీఎం.. ఉచిత గ్యాస్ సిలిండర్ అందజేశారు. అనంతరం జానకమ్మ అనే మహిళకు బాబు ఒంటరి మహిళ పింఛను అందజేశారు. సీఎం తన ఇంటికి రావడంతో జానకమ్మ సంతోషం వ్యక్తం చేశారు. Also Read: CSK- IPL 2025: రిటెన్షన్‌ను సీఎస్కే చాలా అద్భుతంగా […]
ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంను సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలంలోని ఈదుపురం నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఈరోజు ఈదుపురంలో లబ్ధిదారల ఇంటికి వెళ్లిన బాబు.. దీపం 2.0 పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్‌ను అందజేశారు. శాంతమ్మ అనే మహిళ ఇంట్లో స్వయంగా స్టవ్ వెలిగించిన సీఎం.. టీ చేసి తాగారు. శాంతమ్మ కుటుంబసభ్యులతో మాట్లాడుతూ.. వారి కష్టసుఖాలను తెలుసుకున్నారు. Also Read: Vikkatakavi […]
వెన్నెల సంఘటనపై స్పందించిన పవన్: పదోతరగతి విద్యార్థి వెన్నెల తల్లిదండ్రులు మధురపూడి విమానాశ్రయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను కలిశారు. తమ కుమార్తె విషయంను పవన్ దృష్టికి వెన్నెల కుటుంబ సభ్యులు తీసుకెళ్లారు. వెన్నెల ఆత్మహత్యకు పాఠశాల యాజమాన్యమే కారణమని తల్లిదండ్రులు ఆరోపించారు. తమకు న్యాయం చేయాలంటూ నేడు పవన్ కాన్వాయ్కి అడ్డుపడ్డారు. మధ్యాహ్నం వచ్చి మాట్లాడతానని డిప్యూటీ సీఎం పవన్ వారికి భరోసా ఇచ్చారు. ఇదో ఆచారమట మరి: దీపావళి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని […]