ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ 2024 విజేతగా దొమ్మరాజు గుకేశ్ నిలిచాడు. గురువారం జరిగిన చివరి రౌండ్లో డిఫెండింగ్ ఛాంపియన్, చైనా స్టార్ డింగ్ లిరెన్‌ను ఓడించి విశ్వ విజేతగా నిలిచాడు. దాంతో ప్రపంచ చెస్ ఛాంపియన్ టైటిల్ గెలుచుకున్న అత్యంత పిన్న వయస్కుడిగా (18 ఏళ్ల 8 నెలల 14 రోజులు) రికార్డు సాధించాడు. అంతకుముందు గారీ కాస్పరోవ్ 22 ఏళ్ల 6 నెలల 27 రోజుల వయస్సులో ఛాంపియన్‌గా నిలిచాడు. Also Read: Virat Kohli: […]
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25 భాగంగా డిసెంబరు 14 నుంచి గబ్బా వేదికగా ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య మూడో టెస్ట్ మ్యాచ్ జరగనుంది. భారత కాలమాన ప్రకారం శనివారం ఉదయం 5.50 గంటలకు మ్యాచ్ ఆరంభం అవుతుంది. పెర్త్ టెస్టులో భారత్ 295 పరుగుల తేడాతో విజయం సాధించగా.. అడిలైడ్ టెస్టులో ఆస్ట్రేలియా 10 వికెట్స్ తేడాతో జయకేతనం ఎగురవేసింది. ప్రస్తుతం 1-1 సిరీస్ సమంగా ఉన్న నేపథ్యంలో గబ్బా టెస్ట్ కీలకంగా మారింది. ఈ టెస్టులో […]
సాధారణంగా దొంగలు ఇంట్లోని డబ్బు, నగలను దొంగిలిస్తుంటారు. ఏమీ దొరకని సమయంలో విలువైన వస్తువులను ఎత్తుకెళుతుంటారు. అయితే ఇటీవలి కాలంలో కొందరు ఇంటి బయట ఆరేసిన బట్టలను కూడా దొంగలించారు. ఇదే వింత అనుకుంటే.. తాజాగా మరో వింత చోటుచేసుకుంది. ఇంటి బయట వదిలిన షూస్ ఎత్తుకెళుతున్నాడో వింత దొంగ. 100కు పైగా ఇళ్లలో షూస్ దొంగతనం చేసి.. చివరకు పట్టుపడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని రామంతపూర్‌లో చోటుచేసుకుంది. ఉప్పల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మల్లేష్ […]
వ్యక్తిగత కారణాలతో పెర్త్ టెస్ట్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆడలేదు. యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు. తొలి మ్యాచ్ విజయంలో వీరిద్దరూ కీలక పాత్ర పోషించారు. దీంతో అడిలైడ్ టెస్ట్‌కు రోహిత్ అందుబాటులోకి వచ్చినా.. జైస్వాల్-రాహుల్ జోడిని కొనసాగించారు. దాంతో హిట్‌మ్యాన్ 6వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగాడు. ఆ స్థానంలో రోహిత్ ఘోరంగా విఫలం అయ్యాడు. అటు ఓపెనర్‌గా రాహుల్ కూడా విఫలమయ్యాడు. దీంతో తాజాగా టీమిండియా తన వ్యూహాన్ని మార్చుకొన్నట్లు తెలుస్తోంది. […]
ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వాలి. భద్రతా కారణాల దృష్ట్యా పాక్‌లో పర్యటించేది లేదని బీసీసీఐ ఇప్పటికే తేల్చి చెప్పింది. తాము ఆడే మ్యాచ్‌లను తటస్థ వేదికలకు మార్చి.. హైబ్రిడ్ మోడల్లో టోర్నీని నిర్వహించాలని ఐసీసీని కోరింది. హైబ్రిడ్ మోడల్‌కు పీసీబీ ముందుగా ఒప్పుకోకున్నా.. ఐసీసీ దెబ్బకు దిగొచ్చింది. అయితే హైబ్రిడ్ మోడల్లో నిర్వహించే విషయంపై పీసీబీ తన స్పష్టమైన వైఖరిని ఇప్పటికీ అధికారికంగా వెల్లడించలేదు. దీంతో షెడ్యూల్ విడుదల వాయిదా పడుతూ వస్తోంది. ఛాంపియన్స్ […]
సత్యదేవ్, డాలీ ధనంజయ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘జీబ్రా: లక్ ఫేవర్స్ ది బ్రేవ్’. ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఎస్ఎన్ రెడ్డి, బాల సుందరం, ఎస్ పద్మజ, దినేశ్ సుందరం సంయుక్తంగా నిర్మించారు. ప్రియా భవానీ శంకర్, జెన్నిఫర్ కథానాయికలుగా నటించిన ఈ చిత్రంలో సునీల్, సత్యరాజ్ కీలకపాత్రలు చేశారు. క్రైమ్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిన జీబ్రా.. నవంబర్ 22న రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ తెచ్చుకుంది. Also […]
టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పి కేవలం ఐపీఎల్లో మాత్రమే ఆడుతున్న మహీకి ఏమాత్రం ఫ్యాన్‌బేస్ తగ్గలేదు. భారత ఫాన్స్ మాత్రమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ధోనీని అభిమానిస్తారు. ఫాన్స్ మాత్రమే కాదు.. ఐపీఎల్ యజమానులు కూడా మిస్టర్ కూల్‌ను గౌరవిస్తారు. మహీని లక్నో సూపర్ జెయింట్స్ యజమాని సంజీవ్ గోయెంకా అభిమానిస్తారు. ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న గోయెంకా.. ధోనీపై ప్రశంసల […]
సిద్ధార్థ్ హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ డ్రామా ‘మిస్ యూ’. ఆషికా రంగనాథ్ హీరోయిన్. తమిళ డైరెక్టర్ రాజశేఖర్ దర్శకత్వం వహించగా.. 7 మైల్స్ పర్ సెకండ్ సంస్థ నిర్మించింది. ఈ సినిమా ఏషియన్ సురేశ్ ఎంటర్టైన్మెంట్ లిమిటెడ్ సంస్థ ద్వారా డిసెంబర్ 13న తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. నిజానికి మిస్ యూ నవంబర్ 29న రిలీజ్ కావాలి కానీ.. ‘పుష్ప 2’ కారణంగా వాయిదా పడింది. మిస్ యూ ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్న సిద్ధార్థ్.. ఇటీవల […]
ఇటీవల తగ్గిన బంగారం ధరలు.. మళ్లీ పెరుగుతున్నాయి. గోల్డ్ లవర్స్‌కి షాక్ ఇస్తూ.. వరుసగా మూడు రోజులు పెరిగాయి. రూ.160, రూ.820, రూ.870 పెరగడంతో.. గోల్డ్ రేట్ మరలా 80 వేలకు చేరువైంది. పెరుగుదలలో హ్యాట్రిక్ కొట్టిన బంగారం ధరలు.. నేడు స్థిరంగా ఉన్నాయి. బులియన్ మార్కెట్లో గురువారం (డిసెంబర్ 12) 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.72,850 కాగా.. 24 క్యారెట్ల ధర రూ.79,470గా ఉంది. మరోవైపు వెండి ధర మాత్రం భారీగా […]
ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య ఐదు టెస్ట్‌ల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25 జరుగుతోంది. పెర్త్ టెస్టులో 295 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించగా.. అడిలైడ్ టెస్టులో ఆస్ట్రేలియా 10 వికెట్స్ తేడాతో అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక డిసెంబర్ 14 నుంచి బ్రిస్బేన్‌లోని గబ్బా స్టేడియంలో మూడో టెస్ట్ ఆరంభం కానుంది. ఈ టెస్ట్ మ్యాచ్‌కు ముందు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ ఇరు జట్లలో బెస్ట్ ప్లేయర్లతో అత్యుత్తమ జట్టును […]