ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య ఐదు టెస్ట్‌ల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25 జరుగుతోంది. పెర్త్ టెస్టులో 295 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించగా.. అడిలైడ్ టెస్టులో ఆస్ట్రేలియా 10 వికెట్స్ తేడాతో అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక డిసెంబర్ 14 నుంచి బ్రిస్బేన్‌లోని గబ్బా స్టేడియంలో మూడో టెస్ట్ ఆరంభం కానుంది. ఈ టెస్ట్ మ్యాచ్‌కు ముందు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ ఇరు జట్లలో బెస్ట్ ప్లేయర్లతో అత్యుత్తమ జట్టును ఎంపిక చేశాడు. అందులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు చోటు దక్కలేదు.
టీమిండియా దిగ్గజ స్పిన్నర్లు అనిల్ కుంబ్లే, హర్భజన్ సింగ్‌తో పాటు స్టార్ స్పిన్నర్ ఆర్ అశ్విన్‌కు మైకేల్ క్లార్క్ జట్టులో చోటుదక్కలేదు. ఓపెనర్లుగా వీరేంద్ర సెహ్వాగ్, మాథ్యూ హెడెన్‌ను క్లార్క్ ఎంచుకున్నాడు. మూడో స్థానంలో రికీ పాంటింగ్, నాలుగులో సచిన్ టెండూల్కర్, ఐదులో విరాట్ కోహ్లీని తీసుకున్నాడు. ఇక ఆరవ స్థానంలో స్టీవ్ స్మిత్ ఉన్నాడు. వికెట్ కీపర్‌గా ఆడమ్ గిల్‌క్రిస్ట్‌ను ఎంచుకున్న క్లార్క్.. ఎంఎస్ ధోనీని బ్యాకప్ కీపర్‌గా జట్టులో ఉంచాడు. భారత్ కండిషన్స్‌కు మహీని ఆడిస్తానని చెప్పాడు. ఉపఖండ పిచ్‌లపై ధోనీని జట్టులో తీసుకుంటాని చెప్పకనే చెప్పాడు.
మైకేల్ క్లార్క్ తన జట్టులో స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా దివంగత దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్‌ను తీసుకున్నాడు. పేసర్లుగా ర్యాన్ హర్రీస్, గ్లెన్ మెక్‌గ్రాత్, జస్‌ప్రీత్ బుమ్రాలను ఎంచుకున్నాడు. ఇక 12వ ఆటగాడిగా మిచెల్ జాన్సన్, జహీర్ ఖాన్‌లకు అతడు చోటిచ్చాడు. రోహిత్ శర్మకు చోటు ఇవ్వలేదని ఫాన్స్ మండిపడుతున్నా.. నిజానికి అతడి టెస్ట్ రికార్డ్స్ అంతగా లేవనే చెప్పాలి. ఇప్పటివరకు 65 టెస్టులో 4279 రన్స్ మాత్రమే చేశాడు. ఆస్ట్రేలియాతో ఎక్కువగా టెస్టులు ఆడకపోవడం కూడా క్లార్క్ అతడిని పక్కన పెట్టేశాడు.
Also Read: Jasprit Bumrah: స్పిన్నర్‌గా మారిన జస్ప్రీత్ బుమ్రా.. వీడియో వైరల్! అన్ని రూమర్లకు చెక్
మైకేల్ క్లార్క్ జట్టు:
వీరేంద్ర సెహ్వాగ్, మాథ్యూ హెడెన్, రికీ పాంటింగ్, సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, స్టీవ్ స్మిత్, ఆడమ్ గిల్‌క్రిస్ట్/ఎంఎస్ ధోనీ, షేన్ వార్న్, ర్యాన్ హారిస్, జస్ప్రీత్ బుమ్రా, గ్లెన్ మెక్‌గ్రాత్.