కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై పీసీ ఘోష్ కమిషన్ విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా నేడు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కమిషన్ ముందు బహిరంగ విచారణకు హాజరయ్యారు. ఉదయం శామీర్‌పేట నివాసం నుంచి బీఆర్కే భవన్‌కు చేరుకున్న ఈటలను ఓపెన్ కోర్టులో కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది. 20 నిమిషాల పాటు బహిరంగ విచారణలో అంతా నిజమే చెప్తానని ఈటల ప్రమాణం చేశారు. కమిషన్ ముందు 113వ సాక్షిగా ఈటల హాజరు కాగా.. బ్యారేజీ నిర్మాణం, […]
ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) పార్టీ అధినేత కమల్ హాసన్ రాజ్యసభ సీటుకు నామినేషన్ దాఖలు చేశారు. కమల్ హాసన్ నామినేషన్ కార్యక్రమానికి తమిళనాడు సీఎం స్టాలిన్ హాజరయ్యారు. జూన్ 4నే నామినేషన్ దాఖలు చేయాల్సి ఉండగా.. ‘థగ్ లైఫ్’ సినిమా ఈవెంట్లో కన్నడ భాషపై లోకనాయకుడు చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగడంతో వాయిదా పడింది. సీనియర్ న్యాయవాది పీ విల్సన్, తమిళ రచయిత రోకియా మాలిక్ అలియాస్ సల్మా, మాజీ ఎమ్మెల్యే శివలింగం […]
దేశంలో మహమ్మారి కరోనా వైరస్ కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. కరోనా బారిన పడిన వారి సంఖ్య నేటికి ఐదు వేలు దాటింది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 5,364గా ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. పలు రాష్ట్రాలలో 4,724 మంది కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారని.. ఇప్పటివరకు వైరస్‌తో దేశవ్యాప్తంగా 55 మంది మరణించినట్లు పేర్కొంది. గత 24 గంటల్లో 498 కొత్త కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో […]
టాలీవుడ్ హీరో శ్రీవిష్ణు వరుస హిట్స్ ఖాతాలో వేసుకుంటున్నారు. సామజవరగమన, ఓం భీమ్ బుష్, స్వాగ్ చిత్రాలతో హ్యాట్రిక్ కొట్టారు. ఈ ఏడాది ‘సింగిల్’ సినిమాతో మరో హిట్ అందుకున్నారు. కామెడీ, రొమాంటిక్ ఎంటర్టైనర్గా వచ్చిన సింగిల్ సినిమా మే 9న రిలీజ్ అయి.. బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబట్టింది. ఈ వేసవిలో శ్రీవిష్ణు తనదైన నటనతో ప్రేక్షకులను ఆద్యంతం నవ్వించారు. కార్తీక్ రాజు దర్శకత్వం వహించిన సింగిల్ మూవీలో ఇవానా, కేతిక శర్మ హీరోయిన్లుగా […]
ఈ వారంలో బంగారం ధరలకు రెక్కలొచ్చాయి. వరుసగా పెరిగిన పసిడి.. మళ్లీ లక్ష రూపాయలకు చేరుకుంది. వరుసగా నాలుగు రోజులు పెరిగిన గోల్డ్ ధరలు నేడు స్థిరంగా ఉన్నాయి. బులియన్ మార్కెట్లో శుక్రవారం (జూన్ 6) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.91,300గా.. 24 క్యారెట్ల ధర రూ.99,600గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడల్లో ఇదే ధరలు కొనసాగుతున్నాయి. అయితే జీఎస్టీ, ఇతర ఛార్జీలతో కలిపి తులం బంగారం […]
టాలీవుడ్ హీరోలు, ప్రొడ్యూసర్స్, ఎగ్జిబిటర్స్ మధ్య వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ‘హరిహర వీరమల్లు’ సినిమా రిలీజ్‌పై నెలకొన్న వివాదంపై ప్రముఖ నిర్మాత బన్నీ వాసు ఎక్స్ వేదికగా స్పందించారు. ప్రేక్షకులను తిరిగి థియేటర్లకు రప్పించడం ఎలా అని ప్రొడ్యూసర్స్, ఎగ్జిబిటర్స్ పునరాలోచించుకోవాల్సిన అసవరం ఉందన్నారు. పర్సంటేజ్ సిస్టమ్‌లో మార్పుల కోసం పోరాడటం కంటే.. ప్రేక్షకులను తిరిగి థియేటర్లకు ఎలా రప్పించాలనే దానిపై దృష్టి సారించాలని సినీ పెద్దలకు విజ్ఞప్తి […]
తాను ఆటగాళ్ల కెప్టెన్‌గా ఉంటానని టీమిండియా టెస్ట్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తెలిపాడు. కెప్టెన్‌గా ప్రత్యేకమైన శైలి అంటూ ఏమీ లేదన్నాడు. టెస్ట్ కెప్టెన్సీ సవాల్‌తో కూడుకున్నదని, ఛాలెంజ్‌ను స్వీకరించేందుకు తాను సిద్దంగా ఉన్నానని చెప్పాడు. ఓ బ్యాటర్‌గా జట్టును ముందుండి నడిపించాలని అనుకుంటున్నానని పేర్కొన్నాడు. భారత జట్టులో నాణ్యమైన పేసర్లు ఉన్నారని గిల్ చెప్పుకొచ్చాడు. ఇంగ్లండ్ పర్యటన నేపథ్యంలో టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌తో కలిసి గిల్ గురువారం మీడియా సమావేశంలో పాల్గొన్నాడు. ఈ […]
టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకు ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో కొన్ని మ్యాచ్‌ల నుంచి విశ్రాంతినిచ్చే అవకాశముంది. పనిభార నిర్వహణలో భాగంగా బుమ్రా మూడు మ్యాచ్‌ల్లో మాత్రమే ఆడనున్నాడు. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో బుమ్రా అన్ని మ్యాచ్‌లూ ఆడే అవకాశం లేదని జట్టు ఎంపిక సందర్భంలోనే చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ చెప్పారు. తాజాగా టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్ మాట్లాడుతూ.. బుమ్రా లేకున్నా భారత జట్టుపై ప్రభావం పడదని, అతడి గైర్హాజరీలోనూ రాణించే పేస్ విభాగం […]
ఐపీఎల్ ప్రాంచైజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) గెలుపు సంబరాల సందర్భంగా బెంగళూరులో జరిగిన తొక్కిసలాట ఘటన యావత్ దేశాన్ని దిగ్ర్భాంతికి గురి చేసింది. ఈ విషాద ఘటనపై ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. తాజాగా టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సంబరాల కంటే జనం ప్రాణాలు ముఖ్యమని పేర్కొన్నారు. క్రీడా విజయాలను ఉత్సవంగా జరపడానికి రోడ్ షోలు అవసరం లేదన్నారు. ఇంగ్లండ్‌తో భారత్ టెస్టు సిరీస్ నేపథ్యంలో ముంబైలో కెప్టెన్ శుభ్‌మన్ […]
త్వరలో ఇంగ్లండ్, భారత్ మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ జరగనుంది. జూన్ 20 నుంచి లీడ్స్ వేదికగా మొదటి టెస్ట్ ఆరంభం కానుంది. ఈ సిరీస్ కోసం ఇరు జట్లు సిద్ధమవుతున్నాయి. ఇంగ్లండ్ సిరీస్ కోసం బీసీసీఐ జట్టును ప్రకటించింది. తొలి టెస్ట్ కోసం 14 మంది సభ్యుల ఇంగ్లండ్ జట్టును ఈసీబీ ప్రకటించింది. అయితే ఇంగ్లండ్, భారత్ మధ్య టెస్టు సిరీస్ విజేతకు ఇచ్చే ట్రోఫీకి టెండ్యూలర్-అండర్సన్ ట్రోఫీగా నామకరణం చేశారు. త్వరలోనే ఈ […]