Sampath Kumar
Author- NTV Telugu-
Today Horoscope: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి ఊహించని రీతిలో డబ్బు!
కన్యా రాశి వారికి ఈరోజు అన్నీ అనుకూలంగా ఉండనున్నాయి. ధార్మికమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్నేహితుల సహకారాన్ని పూర్తిగా పొందుతారు. దూర ప్రాంతాల్లోని మిత్రులతో సంభాషణలు, సమాలోచనలు జరుపుతుంటారు. అనుకోని విధంగా డబ్బు మీ చేతికి వస్తుంది. ఈరోజు కన్యా రాశి వారికి అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు. విష్ణు సహస్రనామ స్తోత్రంను పారాయణం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. -
T20 World Cup 2026: అయ్యో అయ్యయ్యో సంజు శాంసన్.. ఇక అంతే సంగతులు, ఇషాన్‌కు ప్లేస్ ఫిక్స్!
టీ20 వరల్డ్‌కప్ 2026 కోసం బీసీసీఐ ఇప్పటికే భారత జట్టును ప్రకటించింది. జట్టులో మార్పులు చేసుకునేందుకు జనవరి 31 వరకు అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో భారత సెలెక్టర్ల ముందు ఓ కీలక ప్రశ్న నిలిచింది. అదే.. అభిషేక్ శర్మతో కలిసి ఇన్నింగ్స్‌ను ఆరంభించేది ఎవరు?. సంజు శాంసన్?, ఇషాన్ కిషన్?, శుభ్‌మన్ గిల్?.. ఈ ముగ్గురిలో ఓపెనర్‌గా ఎవరు ఆడుతారు?. ప్రస్తుత ఫామ్ చూస్తే.. ఓపెనర్‌గా ఇషాన్ ఆడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. గిల్ ఇప్పుడు […] -
Crime News: విశాఖలో యువకుడి దారుణ హత్య.. మద్యం సీసాలతో కిరాతకంగా పొడిచి..!
విశాఖలోని పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. శివారు ప్రాంతంలో యువకుడి దారుణ హత్య కలకలం రేపింది. ఈ ఘటన మేఘద్రి గెడ్డ సమీపంలో చోటు చేసుకుంది. యువకుడిని మద్యం సీసాలతో కిరాతకంగా పొడిచి, మొఖాన్ని ఛిద్రం చేసి పరారయ్యారు నిందితులు. ఆదివారం రాత్రి మేఘద్రి గెడ్డ వద్ద కొంతమంది యువకులు మందు పార్టీ చేసుకున్నట్లు తెలుస్తుంది. Also Read: Abhishek Sharma: అదేం బ్యాటింగ్‌రా సామీ.. 10 బంతుల్లోనే 50 రన్స్ చేస్తాడు! సంఘఘటనా […] -
Abhishek Sharma: అదేం బ్యాటింగ్‌రా సామీ.. 10 బంతుల్లోనే 50 రన్స్ చేస్తాడు!
క్రికెట్లో టీ20 ఫార్మాట్ వచ్చాక భారత జట్టుకు దూకుడు మరింత అలవాటైంది. ముఖ్యంగా బ్యాటర్లు రెచ్చిపోయి ఆడుతున్నారు. అతి తక్కువ బంతుల్లోనే హాఫ్ సెంచరీలు, సెంచరీలు చేస్తున్నారు. తక్కువ బంతుల్లోనే ఫిఫ్టీ చేయడం చాలామంది బయటర్లకు అలవాటైపోయింది. ఈ క్రమంలో పలువురు భారత ఆటగాళ్లు అంతర్జాతీయ టీ20ల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీలు సాధించి రికార్డులు నెలకొల్పారు. ఈ జాబితాలో టీమిండియా మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్ అగ్రస్థానంలో ఉన్నాడు. 2007 టీ20 వరల్డ్‌కప్‌లో ఇంగ్లాండ్‌పై కేవలం 12 […] -
Tilak Varma Fitness: టీమిండియాకు గుడ్ న్యూస్.. తిలక్ వర్మ వచ్చేస్తున్నాడు!
భారత టాప్ఆర్డర్ బ్యాట్స్‌మన్, తెలుగు ఆటగాడు తిలక్ వర్మ న్యూజిలాండ్‌తో ఐదో టీ20 మ్యాచ్‌కు (జనవరి 31) అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు 2026 టీ20 వరల్డ్‌కప్‌కు కూడా అతడు పూర్తిగా ఫిట్‌గా ఉంటాడని సమాచారం. ఈ న్యూస్ అటు టీమిండియా, ఇటు అభిమానుల్లో ఆనందాన్ని రేకెత్తిస్తోంది. తిలక్ పూర్తి ఫిట్నెస్ సాధించడం భారత జట్టుకు పెద్ద బూస్ట్‌గా మారనుంది. ఎదుకంటే ఇటీవలి కాలంలో తిలక్ కీలక ఇన్నింగ్స్‌లు ఆడుతూ.. టీమిండియాకు అద్భుత విజయాలు […] -
IS Bindra Dead: బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్ ఐఎస్ బింద్రా మృతి!
భారత క్రికెట్‌కు విశేష సేవలు అందించిన మాజీ బీసీసీఐ అధ్యక్షుడు ఇందర్జిత్ సింగ్ బింద్రా (84) కన్నుమూశారు. ఆదివారం న్యూఢిల్లీలో ఆయన తుదిశ్వాస విడిచారు. ఇంద్రజిత్ బింద్రా మరణంతో భారత క్రికెట్ పరిపాలనా రంగంలో ఒక శకం ముగిసినట్లయ్యింది. మాజీ అండ్ ప్రస్తుత క్రికెటర్స్ ఆయన మృతికి సంతాపం వ్యక్తం చేస్తున్నాయి. ఇందర్జిత్ బింద్రా 1993 నుంచి 1996 వరకు బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. అంతేకాకుండా, 1978 నుంచి 2014 వరకు మొత్తం 36 సంవత్సరాల […] -
Governor Abdul Nazeer: పేదరిక నిర్మూలనే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళుతోంది!
ఏపీ రాజధాని అమరావతిలో తొలిసారి రిపబ్లిక్ డే వేడుకలు జరిగాయి. జాతీయ పతాకాన్ని రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆవిష్కరించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సహా మంత్రులు నారా లోకేశ్, అచ్చెన్నాయుడు, నారాయణ, కొల్లు రవీంద్ర హాజరయ్యారు.హైకోర్టు సమీపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మైదానంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. రిపబ్లిక్ డే సందర్భంగా నిర్వహించిన అధికారిక వేడుకల్లో గవర్నర్ గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఇండియన్ ఆర్మీ, సెంట్రల్ […] -
Team India History: నీ యవ్వ తగ్గేదేలే.. టీ20 క్రికెట్లో టీమిండియా సరికొత్త చరిత్ర!
టీ20 అంతర్జాతీయ క్రికెట్లో స్థిరత్వం, గెలుపు పరంపర కొనసాగించడం ఏ జట్టుకైనా పెద్ద సవాలే. అయితే భారత జట్టు ఈ విషయంలో ప్రపంచ క్రికెట్లోనే ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. పూర్తి సభ్య దేశాల (FM Teams) మధ్య జరిగిన టీ20 సిరీస్‌లలో వరుస విజయాల పరంగా భారత్ అద్భుత రికార్డులు నమోదు చేస్తోంది. తాజా గణాంకాల ప్రకారం.. భారత్ ప్రస్తుతం 11 వరుస టీ20 అంతర్జాతీయ సిరీస్‌లను గెలుచుకొని అగ్రస్థానంలో నిలిచింది. ఈ పరంపర 2024 నుంచి […] -
Abhishek Sharma History: ఫాస్టెస్ట్ ఫిఫ్టీస్.. అంతర్జాతీయ టీ20ల్లో కొత్త రికార్డు ట్రెండ్!
టీ20 అంతర్జాతీయ క్రికెట్లో దూకుడే విజయానికి కీలకం. ముఖ్యంగా టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ తక్కువ బంతుల్లో భారీ స్కోర్లు చేయడం జట్టుకు భారీ ఆధిక్యంను ఇస్తుంది. ఈ నేపథ్యంలో 25 బంతుల్లోపు అర్ధ శతకం సాధించిన సందర్భాల్లో కొన్ని స్టార్ ఆటగాళ్లు ప్రత్యేకమైన రికార్డులతో ముందంజలో ఉన్నారు. ఈ జాబితాలో భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ అగ్ర స్థానంలో నిలిచాడు. ఇప్పటివరకు అభిషేక్ 9 సార్లు 25 లేదా అంతకంటే తక్కువ బంతుల్లోనే హాఫ్ సెంచరీ […] -
APSRTC: మరోసారి అద్దె బస్సుల యజమానులతో ఏపీఎస్ఆర్టీసీ ఎండీ సమావేశం!
విజయవాడలో ఇవాళ మరోసారి అద్దె బస్సుల యజమానులతో ఏపీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఇప్పటికే నాలుగు సార్లు చర్చలు జరిగినప్పటికీ ప్రధాన డిమాండ్లపై ఎలాంటి తుది నిర్ణయం వెలువడకపోవడంతో.. ఈ సమావేశంపై అద్దె బస్సుల యజమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. ప్రధానంగా MSTC–1, 2, 3, 4 టెండర్లలో పాల్గొన్న హైర్ బస్సుల యజమానుల డిమాండ్లే చర్చల కేంద్రబిందువుగా మారాయి. ‘స్త్రీశక్తి’ పథకం అమలుతో ప్రయాణికుల సంఖ్య పెరగడం వల్ల బస్సులపై మెయింటెనెన్స్ భారం […]
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?